Superman Trailer: పదేళ్ళ తర్వాత మళ్లీ రాబోతున్న 'సూపర్‌మ్యాన్' .. ట్రైలర్ భలే ఉంది!

పదేళ్ళ తర్వాత… సూపర్‌మ్యాన్ మళ్ళీ తిరిగి వస్తున్నాడు. తాజాగా సూపర్ మ్యాన్ కొత్త సీరీస్ ట్రైలర్ విడుదల చేశారు. జేమ్స్ గన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జులై 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ ట్రైలర్ మీరు కూడా చూసేయండి.

New Update

Superman Trailer:  ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రేక్షకాదరణ పొందిన  'సూపర్ మ్యాన్' ఫ్రాంచైజీ నుంచి  మరో కొత్త సీరీస్ తో వెండితెరపై సందడి చేయబోతుంది.  జేమ్స్ గన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. 

సూపర్‌మ్యాన్ ట్రైలర్

ఇప్పటి వరకు సూపర్‌మ్యాన్ పాత్రలో కనిపించిన హెన్రీ కావిల్ స్థానంలో ఇప్పుడు డేవిడ్ కోరెన్స్‌వెట్ నటిస్తున్నారు. ట్రైలర్ చూస్తుంటే..  డేవిడ్  'సూపర్ మ్యాన్' పాత్రను చాలా బాగా డీల్ చేసినట్లు అభిమానులు అనుకుంటున్నారు.  ఈ సారి సూపర్ మ్యాన్ యాక్షన్ మాత్రమే కాకుండా మనిషిగా ఎలా ఆలోచిస్తున్నాడో కూడా చూపించబోతున్నారు.  కొత్త  హీరోలు, కొత్త నటులు, కొత్త కథనంతో  ట్రైలర్ ఆకట్టుకుంటోంది. సూపర్‌మ్యాన్  నిజంగా హీరోనా? లేక అతను కూడా ఒక సాధారణ వ్యక్తిలానే తప్పులు చేస్తున్నాడా? అనే ప్రశ్నలు ఈ కథలో చూపించబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. DC  స్టూడియోస్ నుంచి వస్తున్న తొలి ఫీచర్ ఫిల్మ్ ఇదే కావడం విశేషం. 

Also Read: BIG BREAKING: హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పై కేసు!


ఇందులో రాచెల్ బ్రాస్నహాన్, నికోలస్ హౌల్ట్, ఎడీ గతేగి, ఆంథనీ కారిగన్, నాథన్ ఫిలియన్, ఇసబెలా మెర్సెడ్ తదితరులు కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా ద్వారా  DC యూనివర్స్ కొత్త దశలోకి ప్రవేశిస్తోంది. గత సినిమాలకంటే ఇది భిన్నంగా  ఉంటుంది.  

latest-news | telugu-news | cinema-news 

Also Read: Andhra King Taluka: అదిరిపోయిన టైటిల్ గ్లింప్స్.. రామ్ కొత్త మూవీ టైటిల్ ఇదే

Advertisment
తాజా కథనాలు