TG Crime: సూర్యాపేట జిల్లాలో విషాదం.. మూడు సబ్జెక్టుల్లో ఫెయిలైన బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుదిబండలో విషాదం చోటు చేసుకుంది. మూడు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడని గొంతు కోసుకొని బీటెక్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

New Update
BTech student died

BTech student died

TG Crime:  సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుదిబండలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కీర్తి, ఉపేందర్ దంపతుల కూమాడు వివేక్( 20) హైదరాబాద్‌లో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. మంచి భవిష్యత్తు ఉన్న ఈ యువకుడు.. చదువులో ఫైయిల్‌ అయ్యాడన్న చిన్న కారణంతో ఇంట్లో ఎవరు లేని సమయంలో గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివేక్‌ ఆత్మహత్య అందరినీ తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఇటీవల జరిగిన సెమిస్టర్ పరీక్షల ఫలితాల్లో మూడు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిన విషయాన్ని తెలుసుకున్న అతను మానసిక కలత చెంది ఇలా ప్రాణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

మూడు సబ్జెక్టుల్లో ఫెయిలై..

అయితే సబ్జెక్టులు ఫెయిల్ అయ్యానని విషాదంలో ఉన్న వివేక్ మనోవేదనను ఎవరికీ తెలపలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో బాత్‌రూంలోకి వెళ్లి గొంతు, చెయ్యి కోసుకొని ఆత్మహత్య చేసుకోవడం వలన తల్లిదండ్రుల, కుటుంబ సభ్యుల, స్నేహితుల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివేక్‌ ప్రాణాలు తీసుకోవటం అందరినీ షాక్‌కు గురిచేసింది. అయితే.. ఈ సంఘటన చూస్తే యువతలో చదువుపై భయం, ఒత్తిడి, సామాజిక ఒత్తిళ్ల ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. 

 విద్యార్థులు ఫైయిల్‌  అయినా మళ్ళీ పరీక్షలు రాసేందుకు ప్రయత్నించవచ్చు. విద్యార్థులు ఈ విధంగా ప్రాణాలు తీసుకోవటం సరైనది కాదని కొందరూ అంటున్నారు. ప్రతి విద్యార్థి మానసిక ఒత్తిడిని ఎదుర్కొనగలగే ధైర్యాన్ని పెంచుకోవాలంటున్నారు. బిడ్డ మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు వివేక్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

ఇది కూడా చదవండి: స్నానంలో ఈ తప్పులు చేస్తే..చర్మానికి డేంజర్‌ని తెలుసా..?

ts-crime | ts-crime-news | latest-news | crime)

Advertisment
Advertisment
తాజా కథనాలు