Soft Drink: ఇలాంటివి మీ నిత్యకృత్యాల్లో ఉన్నాయా..? అయితే మీ బొక్కలు డొల్ల కావడం ఖాయం..!!

నేటి కాలంలో మనం తీసుకునే కొన్ని రకాల అన్‌హెల్తీ ఫుడ్స్ ఎముకల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. శీతల పానీయాలు, అధిక చక్కెర పదార్థాలు, ఆల్కహాల్, అధిక ఉప్పు, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు, అధిక కెఫిన్ అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు వల్ల ఎముకలు బలహీనపడతాయి.

New Update
soft drink

Soft Drink

వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనపడటం సహజమే అయినప్పటికీ.. ప్రస్తుత అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తున్నాయి. బలంగా ఉండే ఎముకలకు కాల్షియం, విటమిన్ డి, పోషకాలు సమృద్ధిగా ఉన్న ఆహారం చాలా అవసరం. అయితే మనం తీసుకునే కొన్ని రకాల అన్‌హెల్తీ ఫుడ్స్ ఎముకల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఎముకల బలహీనతకు కారణమయ్యే అన్‌హెల్తీ ఆహారాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

ఎముకలకు హానిచేసే ప్రధాన ఆహారాలు: 

శీతల పానీయాలు (Soft Drinks): 

కోలా, సోడా వంటి శీతల పానీయాలలో ఉండే ఫాస్పోరిక్ యాసిడ్ శరీరంలో కాల్షియం సమతుల్యతను దెబ్బతీస్తుంది. దీంతో రక్తంలో కాల్షియం స్థాయిలను నిర్వహించడానికి శరీరం ఎముకల నుంచి కాల్షియంను తీసుకుంటుంది. ఫలితంగా ఎముకలు బలహీనపడతాయి.

అధిక చక్కెర పదార్థాలు:

రిఫైన్డ్ షుగర్ శరీరంలో కాల్షియం శోషణను అడ్డుకుంటుంది. చక్కెర పదార్థాలను అధికంగా తీసుకోవడం వల్ల ఎముకలకు అవసరమైన పోషకాలు అందవు. ప్రతిరోజూ చక్కెర కలిగిన ఆహారాలు తినడం ఎముకలకు హానికరం.

ఆల్కహాల్: 

ఆల్కహాల్ కూడా కాల్షియం శోషణను నిరోధించి, విటమిన్ డి జీవక్రియను దెబ్బతీస్తుంది. దీర్ఘకాలికంగా ఆల్కహాల్ సేవించడం హార్మోన్ల సమతుల్యతను చెదరగొట్టి, ముఖ్యంగా వెన్నెముక మరియు తుంటి ఎముకలను వేగంగా బలహీనపరుస్తుంది.

ఇది కూడా చదవండి: అకస్మాత్తుగా అలా అనిపిస్తోందా..? ఇది SADకి సంకేతం.. అంటే ఏంటో తెలుసా..?

అధిక ఉప్పు (Salt): 

అధికంగా ఉప్పు తీసుకోవడం వల్ల మూత్రం ద్వారా కాల్షియం ఎక్కువగా బయటకు పోతుంది. ప్యాకేజ్డ్ చిప్స్, ఊరగాయలు, ప్రాసెస్డ్ ఫుడ్స్‌లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. ఇవి వృద్ధులలో, మహిళల్లో ఎముకల బలహీనతకు దారితీయవచ్చు.

రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు:

వైట్ బ్రెడ్, పేస్ట్రీలు వంటి రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు తక్కువ పోషక విలువలను కలిగి ఉండి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. వీటి వినియోగం శరీరంలో వాపును పెంచి ఎముకల నిర్మాణ ప్రక్రియను నెమ్మదిస్తుంది.

అధిక కెఫిన్: 

టీ, కాఫీ మరియు ఎనర్జీ డ్రింక్స్ ఎక్కువగా తాగడం కూడా కాల్షియం శోషణపై ప్రతికూల ప్రభావాన్ని చూపి ఎముకలు బలహీనపడేందుకు దారితీయవచ్చు. బలమైన ఎముకల కోసం ఈ అనారోగ్యకరమైన ఆహారాలకు దూరంగా ఉండటం, కాల్షియం, విటమిన్ డి ఉన్న పోషకాహారాన్ని తీసుకోవడం చాలా అవసరం.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి:రుతువులు మారుతున్న కొద్ది అనారోగ్యం.. వైరల్ జ్వరానికి ఆయుర్వేద వైద్యం!!

Advertisment
తాజా కథనాలు