/rtv/media/media_files/2025/09/25/viral-fever-2025-09-25-19-10-42.jpg)
Viral Fever
వర్షాకాలం ప్రారంభం కావడంతో.. వాతావరణంలో అకస్మాత్తుగా చోటు చేసుకున్న మార్పులు ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి. వేడి, చలి మార్పుల వల్ల వైరస్‌లు సులభంగా వ్యాప్తి చెందుతున్నాయి. ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో తుమ్ము, దగ్గు లేదా ఇతరులతో సన్నిహితంగా ఉండటం ద్వారా ఒకరి నుండి మరొకరికి వైరస్‌లు వ్యాపిస్తాయి. జ్వరం, ఒళ్లు నొప్పులు, గొంతు నొప్పి, దగ్గు, తలనొప్పి, అలసట, అప్పుడప్పుడు వాంతులు, విరేచనాలు వంటివి ఈ ఫీవర్ ప్రధాన లక్షణాలు. అంతరాల వాతావరణంలో ఆనారోగ్య సమస్యలు, వైరల్ ఫీవర్స్‌పై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
వైరల్ ఫీవర్స్‌పై జాగ్రత్తలు:
అయితే ఈ వైరల్ ఫీవర్‌లను నివారించడానికి ఆయుర్వేదంలో కొన్ని ఇంటి చిట్కాలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. తులసి, అల్లం, మిరియాలతో కాషాయం కాచి తాగడం వల్ల శరీరానికి వ్యాధులను ఎదుర్కొనే శక్తి లభిస్తుంది. ఉదయం, సాయంత్రం 2 చెంచాల గిలోయ్ జ్యూస్ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పసుపు పాలు తాగడం వల్ల అలసట తగ్గుతుంది. అంతేకాకుండా నిమ్మ, తేనె కలిపిన గోరు వెచ్చని నీరు, కొబ్బరి నీరు, సూప్‌లు, పండ్ల రసాలు తాగడం ద్వారా శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా చూసుకోవచ్చు.
ఇది కూడా చదవండి: ప్రతిరోజు తలంటు స్నానం చేస్తున్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్త
ఈ సమయంలో ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం చాలా ముఖ్యం. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. వేయించిన లేదా భారీ ఆహారాలకు దూరంగా ఉండాలి. సులభంగా జీర్ణమయ్యే తేలికపాటి ఆహారం తినాలి. తగినంత నిద్ర, విశ్రాంతి తప్పనిసరి. ప్రాణాయామం, యోగా చేయడం వల్ల కూడా ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా రోగులు ఇతరులకు వైరస్ వ్యాప్తి చెందకుండా మాస్క్‌లు ధరించడం, పరిశుభ్రత పాటించడం అవసరం. ప్రతి జ్వరం వైరల్ ఫీవర్ కానప్పటికీ జ్వరం, టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా జ్వరాల లక్షణాలు ఒకేలా ఉంటాయి. ఈ ఫీవర్ సాధారణంగా 5-7 రోజుల్లో వాటంతట అవే తగ్గుతాయి. యాంటీ బయాటిక్స్ వైరస్‌పై పనిచేయవు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ సీజన్‌లో ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: అకస్మాత్తుగా అలా అనిపిస్తోందా..? ఇది SADకి సంకేతం.. అంటే ఏంటో తెలుసా..?