/rtv/media/media_files/2025/10/29/bowel-movement-signal-2025-10-29-08-55-43.jpg)
Bowel Movement Signal
ఉదయం లేవగానే టీ, కాఫీ తాగకుండా చాలామందికి పొట్ట శుభ్రం కాదు (Bowel Movement). టీ లేదా కాఫీని ఖాళీ కడుపుతో తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని తెలిసినా.. చాలామంది ఈ అలవాటును వదులుకోలేకపోతున్నారు. ఉదయం టీ లేదా కాఫీ తాగితేనే మలవిసర్జనకు వెళ్లగలుగుతున్నట్లయితే.. ఇది జీర్ణవ్యవస్థకు హెచ్చరిక సంకేతం కావచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ అలవాటు ఎంత వరకు ఆరోగ్యకరమైనదో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
టీ, కాఫీ తాగితేనే పొట్ట క్లియర్..
సహజ సంకేతం బలహీనపడటం: ఉదయం టీ లేదా కాఫీ తాగిన తర్వాతే టాయిలెట్‌కు వెళ్లగలుగుతున్నప్పుడు.. శరీరం సహజమైన మల విసర్జన సంకేతం (Bowel Movement Signal) బలహీనపడుతుంది. అంటే ప్రేగులు (Intestines) సొంతంగా పనిచేసి మలాన్ని బయటకు పంపే సామర్థ్యాన్ని కోల్పోవడం ప్రారంభిస్తాయి. ఇది క్రమంగా మలబద్ధకం (Constipation) సమస్యను పెంచవచ్చు.
డీహైడ్రేషన్ (Dehydration): రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరానికి ముందుగా నీరు అవసరం. కానీ టీ లేదా కాఫీతో రోజును ప్రారంభిస్తే.. అది మూత్ర విసర్జనను పెంచి.. శరీరం మరింత డీహైడ్రేషన్కు గురయ్యేలా చేస్తుంది.
జీర్ణశక్తి క్షీణత: కాఫీలోని కెఫిన్ అనేది ప్రేగు కండరాలను వేగంగా పనిచేయడానికి ప్రేరేపిస్తుంది (Stimulant). అయితే.. ఇది ప్రతిరోజూ, ఎక్కువ కాలం జరిగితే.. ప్రేగులు సొంతంగా ఎలా పనిచేయాలో మర్చిపోవచ్చు. దీర్ఘకాలంలో ఇది జీర్ణశక్తిని (Digestive Power) బలహీనపరుస్తుంది.
ఇది కూడా చదవండి: ఓర్నీ.. ఒక్క లవంగంతో ఇన్ని లాభాలా.. రాత్రి పూట నోట్లో వేసుకుని పడుకుంటే..!
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఉదయం టీ లేదా కాఫీపై ఆధారపడకుండా మలబద్ధకం సమస్యను పరిష్కరించుకోవడానికి ఈ సులభమైన పద్ధతులు పాటించాలి. ఉదయం లేవగానే ముందుగా ఒకటి లేదా రెండు గ్లాసుల మంచినీళ్లు తాగాలి. ఇది జీర్ణవ్యవస్థను మేల్కొలిపి.. సహజంగా మల విసర్జనను ప్రేరేపిస్తుంది. అంతేకాకుండా ఆహారంలో ఫైబర్‌ను (పీచు పదార్థం) పెంచాలి. పండ్లు, కూరగాయలు, పప్పులు, తృణధాన్యాలు ఎక్కువగా తినాలి. రోజుకు 25-30 గ్రాముల ఫైబర్ తీసుకోవడం వలన ఉదయం ఇబ్బంది లేకుండా మలవిసర్జన జరుగుతుంది. నీరు పుష్కలంగా తాగాలి. రోజంతా కనీసం 10-12 గ్లాసుల నీరు తీసుకుంటే ఇంకా మంచిది. ఉదయం పూట తేలికపాటి వ్యాయామం లేదా కొద్దిసేపు నడవడం కూడా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఈ రోజు నుంచే ఉదయం టీ లేదా కాఫీ తాగే అలవాటును మానుకుని.. ఈ సరళమైన పద్ధతులను పాటించాలి. ఇది మలవిసర్జనను సులభతరం చేయడమే కాక.. మొత్తం ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: తమలపాకుతో వైద్యం.. దగ్గు, జలుబు నుంచి ఉపశమనం మీరే చూడండి!!
Follow Us