Betel leaves: తమలపాకుతో వైద్యం.. దగ్గు, జలుబు నుంచి ఉపశమనం మీరే చూడండి!!

దీర్ఘకాలికంగా ఉన్న దగ్గు, ఛాతీ రద్దీ సమస్యతో బాధపడుతుంటే.. ఇంటి చిట్కా అద్భుతంగా పని చేస్తాయి. తమలపాకు (Paan) రెసిపీ కేవలం 5-7 రోజుల్లో పేరుకుపోయిన కఫం, దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ చిట్కా తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
Betel Leaf

Betel leaves

చలికాలం కూడా మెల్లగా మొదలవుతోంది. ఈ మారే వాతావరణంలో అనేక రకాల అనారోగ్యాలు వచ్చే ప్రమాదం ఉంది. ఈ సమయంలో సాధారణంగా దగ్గు (Cough), జలుబు, ఛాతీలో రద్దీ (Chest Congestion) వంటి సమస్యలు కనిపిస్తాయి. చాలామంది వీటిని వదిలించుకోవడానికి ఖరీదైన మందులను ఆశ్రయిస్తారు. అయితే వాటి వల్ల దుష్ప్రభావాలు (Side effects) కూడా ఉండవచ్చు. దీర్ఘకాలికంగా ఉన్న దగ్గు, ఛాతీ రద్దీ సమస్యతో బాధపడుతుంటే.. ఇంటి చిట్కా అద్భుతంగా పని చేస్తాయి. ఆయుర్వేద వైద్యుల అభిప్రాయం ప్రకారం.. తమలపాకు (Paan) రెసిపీ కేవలం 5-7 రోజుల్లో పేరుకుపోయిన కఫం, దగ్గు నుంచి ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది చెబుతున్నారు. ఆ ప్రభావవంతమైన నివారణ గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:

ఈ ప్రత్యేకమైన తమలపాకును తయారు చేయడానికి అవసరమైనవి మూడు సాధారణ పదార్థాలు. తమలపాకు (Betel Leaf) 1, వాము (Carom Seeds) 2 చిటికెలు, లవంగాలు (Cloves) 2, తేనె (Honey) అర టీస్పూన్. ఈ తమలపాకును తయారు చేయడం చాలా సులభంగా ఉంటుంది. ముందుగా ఒక తమలపాకు తీసుకుని దాని ముందు, వెనుక భాగాలను కత్తిరించాలి. ఇప్పుడు ఈ ఆకుపై 2 చిటికెలు వాము, 2 లవంగాలను (కేవలం మొగ్గపై భాగాన్ని మాత్రమే కాండాన్ని కాదు) అర టీస్పూన్ తేనె వేయాలి. ఇప్పుడు ప్రత్యేక తమలపాకు సిద్ధంగా ఉంది. ఈ తమలపాకును నోటిలో ఉంచుకుని.. నెమ్మదిగా నములుతూ రసాన్ని మింగాలి.

 ఇది కూడా చదవండి: యాపిల్ మెరవడానికి ఏ కెమికల్ పూస్తారో తెలుసా..? ఇలా గుర్తు పట్టండి!!

నిపుణులు అభిప్రాయం ప్రకారం.. ఈ తమలపాకును 5 నుంచి 7 రోజుల పాటు క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా ఛాతీ రద్దీ, దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు. తమలపాకు (Betel Leaf) శ్లేష్మం (Mucus) ను పలుచబడటానికి సహాయపడుతుంది. వాము (Carom Seeds) ఆ పలుచబడిన శ్లేష్మాన్ని శరీరం నుంచి బయటకు పంపడానికి సహాయపడుతుంది. తేనె (Honey) దగ్గు, శ్లేష్మాన్ని పూర్తిగా తొలగించడంలో తేనె ప్రయోజనకరంగా పనిచేస్తుంది. ఈ తమలపాకు కేవలం దగ్గుకే కాక.. కడుపు ఉబ్బరం (Flatulence), ఎసిడిటీ (Acidity), గ్యాస్ వంటి సమస్యల నుంచి కూడా మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు శ్వాసకోశ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. ఈ సహజమైన, ప్రభావవంతమైన చిట్కాను ఉపయోగించి దగ్గు సమస్యను దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

 ఇది కూడా చదవండి: టీకి సరైన రుచి రావటం లేదా..? ఆరోగ్య రహస్యం ఎలా చేయాలో తెలుసుకోండి!!

Advertisment
తాజా కథనాలు