Tea And Coffee: నీళ్ళెప్పుడు తాగాలి.. టీకి ముందా లేక తరువాత!!

టీ లేదా కాఫీ తాగడానికి ముందు నీరు తాగాలా లేక తర్వాత తాగాలా..? అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. టీ లేదా కాఫీ తాగడానికి ముందు లేదా తర్వాత కూడా నీరు తాగవచ్చు. అయితే టీ లేదా కాఫీ తర్వాత నీరు తాగడం వలన ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు

New Update
tea and coffee

Tea And Coffee

మనం భారతీయులం టీ, కాఫీలను అధికంగా ఇష్టపడతాం. చాలామంది రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు టీ తాగుతుంటారు. అయితే.. దీనితోపాటు చాలా మందిలో ఒక ప్రశ్న తరచుగా తలెత్తుతుంది. టీ లేదా కాఫీ తాగడానికి ముందు నీరు తాగాలా, లేక తర్వాత తాగాలా? నిజానికి టీ, కాఫీలు శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తాయి. కాబట్టి నీరు తాగడం తప్పనిసరి. అయితే.. ఎప్పుడు తాగాలనే దానిపై చాలామంది గందరగోళంలో ఉంటారు. ఈ ప్రశ్నకు నిపుణులు ఇచ్చిన సమాధానాన్ని  గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

అద్భుత ప్రయోజనాల కోసం..

దంత వైద్యుల అభిప్రాయం ప్రకారం.. టీ లేదా కాఫీ తాగడానికి ముందు లేదా తర్వాత కూడా నీరు తాగవచ్చు. కానీ ముఖ్యంగా టీ లేదా కాఫీ తాగిన తర్వాత నీరు తాగడం చాలా ముఖ్యం. ఇలా చేయడం వలన చిన్నవైనా..? ఇబ్బంది కలిగించే అనేక సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అయితే టీ లేదా కాఫీ తర్వాత నీరు తాగడం వలన ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

శరీరాన్ని హైడ్రేటెడ్‌: టీ, కాఫీలలో ఉండే కెఫిన్ శరీరాన్ని డీహైడ్రేషన్ చేస్తుంది. టీ, కాఫీ తాగిన తర్వాత నీరు తాగడం వలన శరీరంలోని తేమ, ద్రవ సమతుల్యత (Fluid Balance) తిరిగి ఏర్పడుతుంది. ఇది రోజంతా చురుకుగా, శక్తివంతంగా ఉండేలా చేస్తుంది.

దంతాలు పసుపు రంగు: టీ లేదా కాఫీ తాగడం వలన దంతాలు పసుపు రంగులోకి మారతాయి. వాటిలో ఉండే కెఫిన్, టానిన్లు దంతాల ఉపరితలంపై పేరుకుపోతాయి. అయితే నీరు తాగితే ఈ ప్రభావం గణనీయంగా తగ్గుతుంది. నీరు దంతాల ఉపరితలాన్ని శుభ్రం చేసి మరకలు పేరుకుపోకుండా నిరోధిస్తుంది.

 ఇది కూడా చదవండి: టీ లేదా కాఫీ తాగగానే విరోచనం అవుతుందా.. కారణమేంటో తెలుసుకోండి!!

కుహరాలు (Cavities) నివారణ: టీ లేదా కాఫీలలో ఉండే చక్కెర దంతాలకు అతుక్కుని బ్యాక్టీరియా పెరగడానికి దోహదపడుతుంది. దీని వలన కుహరాలు ఏర్పడతాయి. నీరు తాగడం వలన ఆ చక్కెర కడిగివేయబడి, దంతాలు సురక్షితంగా ఉంటాయి.

దుర్వాసన (Bad Breath) దూరం: టీ లేదా కాఫీ తాగిన తర్వాత నోటిలో లాలాజలం ఉత్పత్తి తగ్గి, బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. దీనివలన నోటి దుర్వాసన వస్తుంది. నీరు తాగడం వలన నోరు శుభ్రంగా ఉండి.. లాలాజలం స్థాయిలు సాధారణ స్థితికి వచ్చి దుర్వాసన తొలగిపోతుంది.

అసిడిటీ (Acidity) నివారణ: టీ, కాఫీ రెండూ ఆమ్ల గుణాలను (Acidic) కలిగి ఉంటాయి. వీటిని ఖాళీ కడుపుతో లేదా ఎక్కువగా తాగితే ఎసిడిటీ సమస్యలు వస్తాయి. టీ,కాఫీ తర్వాత నీరు తాగితే.. అది కడుపులోని ఆమ్లాన్ని సమతుల్యం చేసి గుండెల్లో మంట నుంచి ఉపశమనం అందిస్తుంది. కాబట్టి ఈ సమస్యలన్నింటినీ నివారించడానికి టీ లేదా కాఫీ తర్వాత ఎల్లప్పుడూ నీరు తాగే అలవాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

 ఇది కూడా చదవండి: బీట్‌రూట్ జ్యూస్ అని తీసి పారేయకండి..15 రోజులు వరుసగా తాగితే అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయి!!

Advertisment
తాజా కథనాలు