Pigmentation: చర్మంపై పిగ్మెంటేషన్ సమస్య ఎందుకు వస్తుంది..? దాని నివారణ, చికిత్స వివరాలు తెలుసుకోండి

మంగు మచ్చలు వచ్చిన తర్వాత చికిత్స చేయించుకోవడం కంటే.. అవి రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. మంగు మచ్చలు ఎక్కువగా సూర్యరశ్మి కారణంగానే ఏర్పడతాయి. కాబట్టి ఎండలో పనిచేసేవారు ప్రతిరోజూ సన్ స్క్రీన్ ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు.

New Update
Dark spots

Dark spots

మనిషి చర్మం శరీరంలోనే అతిపెద్ద అవయవం. ఇది మనల్ని బయటి వాతావరణం, సూక్ష్మక్రిములు, గాయాల నుంచి రక్షించే బలమైన కవచంలా పనిచేస్తుంది. చర్మం ప్రధానంగా మూడు పొరలను కలిగి ఉంటుంది. బాహ్య చర్మం, డెర్మిస్, హైపోడెర్మిస్. ఈ పొరల్లో ఉన్న మెలనిన్ వర్ణద్రవ్యం మనకు రంగును ఇవ్వడమే కాకుండా.. సూర్యుని అతినీలలోహిత (UV) కిరణాల నుంచి రక్షణ కల్పిస్తుంది. అంతేకాదు చర్మానికి స్పర్శ జ్ఞానాన్ని అందించే ధర్మం ఉంది. ఇది ఉష్ణోగ్రతను నియంత్రించడంలో, విటమిన్ డి (Vitamin D) తయారీలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. చర్మ కణాలు నిరంతరం రాలిపోయి, కొత్త కణాలు పుడుతూ ఉంటాయి. ఇది దాని స్వయం-రక్షణ స్వభావాన్ని తెలియజేస్తుంది. అయితే ఇంత రక్షణ చర్మంపై పిగ్మెంటేషన్ వస్తే అది చర్మ సౌందర్యంపై ప్రభావం. నేటి కాలంలో అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. వాటిల్లో పిగ్మెంటేషన్ ఒకటి. ఈ సమస్య వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

చర్మం టానింగ్ అవ్వటం..

చర్మానికి సహజ రంగును ఇచ్చే ప్రక్రియనే పిగ్మెంటేషన్ అంటారు. చర్మంలోని మెలనోసైట్స్ అనే కణాలు ఉత్పత్తి చేసే మెలనిన్ అనే వర్ణద్రవ్యం  దీనికి కారణం. మెలనిన్ చర్మాన్ని అతినీలలోహిత (UV) కిరణాల నుంచి రక్షించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇది సూర్యరశ్మికి గురైనప్పుడు ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అందుకే చర్మం టానింగ్ అవ్వటం జరుగుతుంది. అయితే కొన్నిసార్లు ఈ మెలనిన్ ఉత్పత్తిలో అసమతుల్యత, అధిక ఉత్పత్తి ఏర్పడినప్పుడు.. చర్మంపై రంగు మార్పులు కనిపిస్తాయి. దీనినే సాధారణంగా పిగ్మెంటేషన్ సమస్యగా చెబుతారు.

పిగ్మెంటేషన్ రకాలు:

పిగ్మెంటేషన్‌లో ప్రధానంగా రెండు రకాలు ఉన్నాయి. మొదటిది హైపర్-పిగ్మెంటేషన్. ఇందులో మెలనిన్ అధికంగా ఉత్పత్తి అవ్వడం వలన చర్మంపై ముదురు రంగు మచ్చలు లేదా మెలస్మా, నల్ల మచ్చలు ఏర్పడతాయి. 2వది హైపో-పిగ్మెంటేషన్. ఇందులో మెలనిన్ ఉత్పత్తి తక్కువగా ఉండటం వలన చర్మంపై లేత రంగు మచ్చలు లేదా బొల్లి - విటిలిగో ఏర్పడతాయి. వయస్సు, హార్మోన్ల మార్పులు, సూర్యరశ్మి, కొన్ని రకాల మందులు, జన్యుపరమైన అంశాలు పిగ్మెంటేషన్ సమస్యకు కారణం కావచ్చు. సరైన చర్మ సంరక్షణ, చికిత్స ద్వారా దీనిని నియంత్రించవచ్చు, తగ్గించవచ్చు.

ఇది కూడా చదవండి: పళ్లు తోముకోడానికి ఏ బ్రష్ అయితే మంచిది.. ఎలక్ట్రిక్ ఆ లేక సాధారణమైన బ్రష్ ఆ.. తెలుసుకొని మీరే నిర్ణయించుకోండి!!

అయితే గర్భధారణ సమయంలో హార్మోన్ల మార్పుల వల్ల ఏర్పడే మచ్చలను మెలస్మా అని ప్రత్యేకంగా పిలుస్తారు. ఈ మచ్చలు నుదురు, చెంపలు, ముక్కు, చేతులు, కాళ్లపై కూడా కనిపిస్తాయి. అంతేకాకుండా మంగు మచ్చలకు ఇతర కారణాలు కూడా ఉంటాయి. గాయాలు, కొన్ని రకాల మందులు, మానసిక ఒత్తిడి, థైరాయిడ్ వ్యాధి, ఊబకాయం, మొటిమలు, చర్మ వ్యాధులు, అలర్జీలు, సౌందర్య సాధనాలు, కీమోథెరపీ, ఇతర చికిత్సలు సమయంలో మంగు మచ్చలు ఏర్పడి అలాగే ఉండిపోతాయని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: సొరకాయతో మిఠాయి.. జీర్ణ వ్యవస్థకి ఎంజాయి

అధిక బరువు, ఊబకాయం అనేక ఆరోగ్య సమస్యలకు దారితీయడమే కాక.. చర్మాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. ముఖంపై సాధారణంగా వచ్చే మొటిమలను గిల్లడం, వాటిని తొలగించడానికి ప్రయత్నించడం వల్ల మచ్చలు ఏర్పడతాయి. మొటిమలు నయమైన తర్వాత కూడా ఈ మంగు మచ్చలు అలాగే ఉండిపోతాయి. అంతేకాకుండా సోరియాసిస్, ఎగ్జిమా వంటి చర్మ వ్యాధుల కారణంగా చర్మంపై గాయాలు, పొరలు ఊడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సమయంలో ఆ ప్రదేశంలో నల్లటి మంగు మచ్చలు ఏర్పడే అవకాశం ఉంది. క్యాన్సర్ చికిత్స తీసుకునే కీమోథెరపీ వంటి చికిత్సల దుష్ప్రభావాల కారణంగా కూడా ముఖంపై లేదా ఇతర శరీర భాగాలపై ఈ మచ్చలు ఏర్పడవచ్చని నిపుణులు చెబుతున్నారు.

 నివారించే మార్గాలు:

మంగు మచ్చలు వచ్చిన తర్వాత చికిత్స చేయించుకోవడం కంటే.. అవి రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. మంగు మచ్చలు ఎక్కువగా సూర్యరశ్మి కారణంగానే ఏర్పడతాయి. కాబట్టి ఎండలో పనిచేసేవారు ప్రతిరోజూ సన్ స్క్రీన్ ఉపయోగించడం అవసరం. సన్ స్క్రీన్ SPF (Sun Protection Factor) ను చర్మ వైద్యుని సలహాతో వాడితే మంచి ఫలితాలు ఉంటాయి. ఎండలో ఎక్కువ తిరిగేవారు, ప్రయాణాలు చేసేవారు రోజుకు మూడు, నాలుగు సార్లు చల్లటి నీటితో ముఖం కడుక్కోవడం ద్వారా నల్లటి మచ్చలు ఏర్పడకుండా నివారించవచ్చు. అయితే ఇప్పుడున్న మార్కెట్‌లో చాలా సౌందర్య సాధనాల్లో రసాయనాలు ఉంటాయి. ఇవి తాత్కాలికంగా మెరుపును ఇచ్చినా.. దీర్ఘకాలంలో మచ్చలకు దారితీయవచ్చు. కాబట్టి కృత్రిమంగా తయారు చేసిన సౌందర్య సాధనాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది. పసుపు, కలబంద, పాలు వంటి సహజ ఉత్పత్తులతో తయారు చేసిన ఫేస్ ప్యాక్‌లను ఉపయోగించడం ద్వారా చర్మం ప్రకాశవంతంగా మారుతుంది, మచ్చలు ఏర్పడకుండా నిరోధించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

చికిత్సా పద్ధతులు:

శరీరంపై ఏర్పడిన మంగు మచ్చలను తొలగించడానికి కొన్ని ప్రత్యేక చికిత్సా పద్ధతులు ఉన్నాయి. చర్మ వైద్యులు హైడ్రోక్వినోన్ (hydroquinone), టెట్రాసైక్లిన్ (tetracycline), గ్లైకోయాసిడ్ (glycoacid) వంటి మందులు కలిగిన క్రీములను సూచిస్తున్నారు. మచ్చలు చర్మంపై పొరలలో మాత్రమే ఉంటే.. ఈ క్రీములను ఉపయోగించడం ద్వారా వాటిని తొలగించవచ్చు. అంతేకాకుండా మంగు మచ్చలు ఏర్పడిన ప్రదేశంలో లేజర్ కిరణాలను ప్రసరింపజేయడం ద్వారా వాటిని తొలగిస్తారు. ఈ చికిత్స ద్వారా మచ్చలు తొలగిన తర్వాత తిరిగి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని వైద్యులు అంటున్నారు. 

ఇది కూడా చదవండి: అమర ఫలం.. చూస్తే టమాటా అనుకుంటారు కానీ.. అంతకు మించిన ప్రయోజనాలు అందిస్తుంది మరి!!

మచ్చలు ఉన్న ప్రదేశంలో చిన్న చిన్న రంధ్రాలు చేయడం ద్వారా కొల్లాజెన్ (collagen), ఎలాస్టిన్ (elastin) అనే ప్రొటీన్ల ఉత్పత్తిని పెంచుతారు. దీనివల్ల మంగు మచ్చలు తొలగిపోయి ఆ స్థానంలో కొత్త చర్మం ఏర్పడుతుంది. కెమికల్ పీల్‌తో శరీరానికి హాని చేయని ప్రత్యేకమైన రసాయనాన్ని ఉపయోగించి చర్మం పై పొరను తొలగిస్తారు. ఆ తర్వాత ఆ స్థానంలో కొత్త పొర ఏర్పడుతుంది.. తద్వారా మంగు మచ్చలు తొలగిపోతాయి. సౌందర్యం కోసం రసాయనాలు కలిగిన కాస్మోటిక్స్ వాడకం దీర్ఘకాలంలో చర్మానికి హాని కలిగిస్తుంది. సహజ పద్ధతుల్లో తయారైన ఉత్పత్తులను వాడటం ద్వారా ఈ మచ్చలను నివారించవచ్చు. ఒకవేళ ఇప్పటికే మంగు మచ్చల సమస్యతో బాధపడుతుంటే.. చర్మానికి సరిపోయే చికిత్స విధానాన్ని తెలుసుకోవడానికి అనుభవజ్ఞులైన చర్మ వైద్యుడిని సంప్రదించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: రోజు రాత్రి పాలు.. ఎండు ద్రాక్షలు మీకు నూతన ఉత్సాహాన్ని ఇవ్వొచ్చు! ఎలానో తెలుసుకోండి!!

Advertisment
తాజా కథనాలు