/rtv/media/media_files/2025/11/20/electric-toothbrush-2025-11-20-10-10-16.jpg)
Electric Toothbrush
నేటి కాలంలో నోటి ఆరోగ్యం, దంతాల శుభ్రతకు సరైన టూత్‌పేస్ట్ ఎంత ముఖ్యమో.. సరైన టూత్‌బ్రష్ ఎంచుకోవడం కూడా అంతే ముఖ్యం. ప్రస్తుతం మార్కెట్‌లో మామూలు బ్రష్‌లతోపాటు ఎలక్ట్రిక్ టూత్‌బ్రష్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సాధారణ బ్రష్ కంటే ఎలక్ట్రిక్ బ్రష్ మేలు చేస్తుందా..? రెండింటిలో ఏది ఉత్తమం..? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. దంతాలు శుభ్రం చేసుకోవడంలో పిల్లలైనా, పెద్దలైనా సరైన పద్ధతిని పాటించాలని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల కాలక్రమేణా దంతాలపై ప్లాక్ (Plaque) పేరుకుపోతుందని, ఇది దంతక్షయం (Cavities), నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. దంతాల శుభ్రతకు మామూలు బ్రష్ , ఎలక్ట్రిక్ బ్రష్ ఎద మంచిదో కొన్ని విషయాలు ఈ అర్టికల్‌లో తెలుసుకుందాం.
నిపుణుల సలహా ఇదే..
అనిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఎలక్ట్రిక్ టూత్‌బ్రష్ వాడటం చాలా ప్రయోజనకరమని సూచిస్తున్నారు. ఎలక్ట్రిక్ టూత్‌బ్రష్‌లు వాటి ఆటోమేటిక్ కదలికల ద్వారా సరైన బ్రషింగ్ టెక్నిక్‌ను పాటిస్తాయి. సాధారణ బ్రష్‌తో సరిగ్గా శుభ్రం చేయలేని పళ్ల మధ్య, చిగుళ్ల దగ్గర పేరుకుపోయిన మురికిని ఈ బ్రష్‌లు సమర్థవంతంగా శుభ్రం చేయగలవు. ఎలక్ట్రిక్ బ్రష్‌లలో ఉండే మరో ముఖ్య ప్రయోజనం ప్రెషర్ సెన్సార్. సాధారణంగా చాలామంది దంతాలపై అతిగా ఒత్తిడి పెట్టి బ్రష్ చేస్తారు.. దీనివల్ల ఎనామిల్ (Enamel) అరిగిపోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: ఇలా చేస్తే మలబద్ధకం మటుమాయం.. కడుపుకు ఉపశమనం..!
అయితే ఎలక్ట్రిక్ బ్రష్‌లలో ఉండే సెన్సార్‌లు దంతాలపై ఎప్పుడూ సరైన ఒత్తిడి ఉండేలా చూస్తాయి. దీనివల్ల దంతాలకు నష్టం జరగకుండా చిగుళ్లు రక్షించబడతాయి. సరైన పద్ధతిలో బ్రష్ చేయడం పిల్లలకు కూడా సులభతరం అవుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సాధారణ టూత్‌బ్రష్ చెడ్డది కాదు. సరైన బ్రషింగ్ టెక్నిక్‌ను పాటిస్తే మామూలు బ్రష్ కూడా మంచి శుభ్రతను అందిస్తుంది. కానీ చాలామంది సరైన పద్ధతిని ఉపయోగించలేకపోవడమే సమస్య. అందుకే సరైన టెక్నిక్ అలవాటు లేని వారికి ఎలక్ట్రిక్ బ్రష్ మెరుగైన ఎంపికగా ఉంటుంది. కాబట్టి అవసరాలు పద్ధతిని బట్టి రెండింటిలో దేనినైనా ఎంచుకోవచ్చని చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ఎంత ఉల్లాసంగా ఉన్నానో... ఎంత ఉత్సాహంగా ఉన్నానో అని అనాలనుకుంటున్నారా..? అయితే అశ్వగంధ వల్ల కలిగే ప్రయోజనాలు మీరూ తెలుసుకోండి!!
Follow Us