Bottle Gourd Halwa: సొరకాయతో మిఠాయి.. జీర్ణ వ్యవస్థకి ఎంజాయి

చలికాలంలో సొరకాయ హల్వాను ఆహారంలో చేర్చుకుంటే.. జీర్ణ వ్యవస్థ బలోపేతమై.. శరీరంలోని ప్రతి భాగానికి శక్తి లభిస్తుంది. సొరకాయలో సహజంగా నీరు, ఫైబర్ తేలికగా జీర్ణమవుతుంది. అసిడిటీ, కడుపు ఉబ్బరం, ఇతర జీర్ణ సమస్య ఉంటే సొరకాయతో చేసిన వంటకాలను తీసుకోవడం మంచిది.

New Update
bottle gourd halwa

Bottle Gourd Halwa

సొరకాయ (Bottle Gourd) అంటే చాలామంది కేవలం కూరగాయగానే చూస్తారు. కానీ సొరకాయతో చేసే హల్వా (Halwa) రుచికరమైన సాంప్రదాయ భారతీయ వంటకమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో సొరకాయ హల్వాను ఆహారంలో చేర్చుకుంటే.. జీర్ణ వ్యవస్థ బలోపేతమై.. శరీరంలోని ప్రతి భాగానికి శక్తి లభిస్తుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఓ అధ్యయనం ప్రకారం.. సొరకాయలో యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు, బయోయాక్టివ్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ప్రేగుల పనితీరుకు మద్దతునిచ్చి.. శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని (Oxidative Stress) తగ్గిస్తాయి. చలికాలంలో సొరకాయ హల్వా తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

సొరకాయ హల్వా ముఖ్య ప్రయోజనాలు:

సొరకాయ హల్వాలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయని.. ఇవి జీర్ణక్రియకు, శరీరంలో శక్తి స్థాయిలను పెంచడానికి దోహదపడతాయని నివేదిక తెలింది. సొరకాయ హల్వా తీసుకోవడం జీర్ణక్రియపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. సొరకాయలో సహజంగా నీరు, ఫైబర్ అధికంగా ఉండటం వలన ఇది తేలికగా జీర్ణమవుతుంది. అసిడిటీ, కడుపు ఉబ్బరం, ఇతర జీర్ణ సమస్యలతో బాధపడేవారు సొరకాయతో చేసిన వంటకాలను తరచుగా తీసుకోవడం మంచిది. ఇది కడుపును చల్లబరుస్తుంది, ప్రేగుల కదలికలను నియంత్రించడానికి సహాయపడుతుంది. అయితే చాలా తక్కువ మంది హల్వాను గుండె ఆరోగ్యానికి అనుబంధిస్తారు. కానీ సొరకాయ గుండె సంబంధిత సమస్యలకు ప్రయోజనం చేకూరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: అమర ఫలం.. చూస్తే టమాటా అనుకుంటారు కానీ.. అంతకు మించిన ప్రయోజనాలు అందిస్తుంది మరి!!

 ఇందులో పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషకాలు ఉండటం వలన గుండె పనితీరుకు మద్దతు లభిస్తుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడి.. కొలెస్ట్రాల్ సమతుల్యతను మెరుగుపరుస్తుంది. తీపి తినాలని కోరుకునే వారు.. అదే సమయంలో బరువును అదుపులో ఉంచుకోవాలనుకునే వారికి సొరకాయ హల్వా మంచి ఎంపిక. ఈ కూరగాయలో కేలరీలు చాలా తక్కువగా.. నీటి శాతం అధికంగా ఉంటుంది. ఇది త్వరగా కడుపు నిండిన భావన కలిగించి.. ఎక్కువ కేలరీలు చేరకుండా చేస్తుంది. దీనివల్ల అతిగా తినకుండా బరువు అదుపులో ఉంటుంది. ఈ ప్రయోజనాల దృష్ట్యా.. శీతాకాలంలో సొరకాయ హల్వాను తక్కువ కొవ్వు, తక్కువ చక్కెరతో తయారు చేసుకుని తీసుకోవడం ద్వారా రుచితోపాటు ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: ఎంత ఉల్లాసంగా ఉన్నానో... ఎంత ఉత్సాహంగా ఉన్నానో అని అనాలనుకుంటున్నారా..? అయితే అశ్వగంధ వల్ల కలిగే ప్రయోజనాలు మీరూ తెలుసుకోండి!!

Advertisment
తాజా కథనాలు