/rtv/media/media_files/2025/11/20/dry-khajur-milk-2025-11-20-13-05-02.jpg)
Dry Khajur Milk
చలికాలంలో ఆహారంలో కూరగాయలు డ్రైఫ్రూట్స్‌ను చేర్చుకోవడం మంచిది. ఆయుర్వేదం ప్రకారం, శీతాకాలంలో జీర్ణ శక్తి (జఠరాగ్ని) బలంగా ఉంటుంది. దీనివల్ల జీర్ణం కాని ఆహారం కూడా తేలికగా జీర్ణమవుతుంది. ఈ సీజన్‌లో శరీరాన్ని వెచ్చగా, శక్తివంతంగా ఉంచేందుకు ఖర్జూరం (Dates) ఒక అద్భుతమైన ఎంపిక. చిన్నగా కనిపించే ఈ ఖర్జూరం రుచిలో తియ్యగా ఉండి, శక్తి, పోషణ మరియు ఔషధ గుణాల గనిగా పరిగణించబడుతుంది. రాత్రిపూట పాలలో ఖర్జూరం కలిపి తీసుకుంటే కలిగే అద్భుత ప్రయోజనాలను తెలుసుకుందాం.
ఖర్జూరం, పాలు కలిపి తీసుకుంటే..
ఆయుర్వేదంలో ఖర్జూరాన్ని బలాన్నిచ్చే టానిక్‌గా చెబుతారు. ఇది ముఖ్యంగా చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచి.. శక్తిని అందించి బలహీనతను తగ్గిస్తుంది. ఖర్జూరంలో పొటాషియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరిచి, హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతాయి. అలాగే అధిక రక్తపోటును నివారిస్తాయి. ఖర్జూరం మెదడుకు చాలా మంచిది. వీటిని తీసుకోవడం వల్ల నరాలు బలపడతాయి. ఇందులో ఉండే మెగ్నీషియం, ఫాస్ఫరస్ మెదడు ఒత్తిడిని తగ్గిస్తాయి. రోజువారీ బలహీనత, అలసటను అధిగమించడానికి ఖర్జూరం చాలా ఉపయోగపడుతుంది. ఖర్జూరంలో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది.. ఇది ఎముకలు, దంతాలను బలోపేతం చేయడానికి, వృద్ధులలో వచ్చే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందడంలో ఇది సహాయపడుతుంది. ఇది చర్మం, జుట్టుకు కూడా మేలు చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది.
ఇది కూడా చదవండి: ఒమేగా ఆయిల్స్ ఉండే ఈ గింజలు ఎప్పుడు తినాలో ఇప్పుడే తెలుసుకోండి!!
బలహీనత, అలసట ఉన్నవారు, ఎముకలు బలహీనంగా ఉన్న వృద్ధులు, రక్తహీనతతో బాధపడేవారు, కీళ్ల నొప్పులు ఉన్నవారు, పాలిచ్చే తల్లులు (Breastfeeding women) ఈ ఐదు రకాల వారు తప్పక తినాలని చెబుతున్నారు. 2-3 ఖర్జూరాలు, 1 గ్లాసు పాలు తీసుకోవాలి. పాలను ఒక గిన్నెలో వేడి చేసి.. అందులో ఖర్జూరాలను వేసి బాగా మరిగించాలి. పాలు కొద్దిగా చిక్కబడి.. ఖర్జూరం మెత్తబడిన తర్వాత ఈ పాలను రాత్రిపూట సేవించడం చాలా ప్రయోజనకరం. రుచికి కావాలనుకుంటే ఖర్జూరాలతోపాటు మఖానా లేదా కొద్దిగా కండ చక్కెర (sugar candy) కలుపుకోవచ్చు. ఖర్జూరం సహజంగానే పాలు తియ్యగా మారేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: సొరకాయతో మిఠాయి.. జీర్ణ వ్యవస్థకి ఎంజాయి
Follow Us