/rtv/media/media_files/2025/07/26/crying-eyes-2025-07-26-14-54-49.jpg)
Crying Eyes
Crying Eyes: ఏడుపు అనేది చాలామందికి భావోద్వేగ బలహీనతగా అనిపించవచ్చు. చిన్ననాటి నుంచే ఏడవకండి, బలంగా ఉండండి అనే ఉక్తిని మనం వింటూ పెరిగాము. కానీ ఏడుపు కేవలం మన ఊహించినట్లుగా ఆవేదన లేదా బాధకు సంకేతం మాత్రమే కాదు.. అది శరీరానికి, కళ్ళకు సహజ శుభ్రతను, మానసిక ప్రశాంతతను అందించే ప్రక్రియ. కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, మానసిక స్థితిని సమతుల్యం చేయడంలో ఏడుపు ఎంతో ఉపయోగపడుతుంది. ఏడుపు సమయంలో కన్నీళ్ల ద్వారా కళ్ళకు తేమ కలుగుతుంది. ఏడుపు కళ్ళను ఎందుకు ఆరోగ్యంగా ఉంచుతుంది? వాటి రహస్యాల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
కన్నీళ్లలో దాగి ఉన్న ఆరోగ్య రహస్యం..
ఈ కన్నీళ్లలో నీటితోపాటు లిపిడ్లు, శ్లేష్మం, ఎంజైమ్‌లు, ముఖ్యంగా లైసోజోమ్ అనే శక్తివంతమైన రసాయనం ఉంటుంది. లైసోజోమ్‌లు కళ్ళలోకి వచ్చే బ్యాక్టీరియా కణగోడను ధ్వంసం చేసి వాటిని నాశనం చేస్తాయి. తద్వారా కళ్ళు ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ పొందుతాయి. ఇవి కళ్లలోకి చొచ్చుకువచ్చే దుమ్ము, పొగ, ఇతర కణాలను కూడా తొలగిస్తాయి. ఏడుపు కళ్ళకు ఒక శుభ్రపరిచే ప్రక్రియతో సమానం. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఏడుపు మానసిక ఒత్తిడిని తగ్గించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. మనం ఏడ్చినప్పుడు శరీరంలో ఉన్న ఒత్తిడిని పెంచే కార్టిసాల్ వంటి హార్మోన్ల స్థాయిలో తక్కువగా మారుతుంది. దీని వలన మనస్సు ప్రశాంతతను పొందుతుంది. అలాగే భావోద్వేగాలను అణగదీయకుండా బయటకు వెళ్లనివ్వడం ద్వారా భావోద్వేగ సమతుల్యత ఏర్పడుతుంది.
ఇది కూడా చదవండి: వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే కంటి ఇన్ఫెక్షన్ ప్రమాదాలు తగ్గుతాయి..!!
దీని వలన మనసు తేలికగా మారి మంచి నిద్ర వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఏడుపు బలహీనతకు ప్రతీక కాదు. ఇది శరీరానికి, ముఖ్యంగా కళ్ల ఆరోగ్యానికి సహజమైన ఔషధం. శాస్త్రపరంగా పరిశీలించినప్పుడు కూడా ఏడుపు ద్వారా మానసిక విశ్రాంతి లభించడమే కాకుండా, శరీరంలోని ముఖ్యమైన అవయవం అయిన కళ్ళకు పరిరక్షణ లభిస్తుంది. కనుక ఇకపై కన్నీళ్లు వచ్చినప్పుడు అవి మన బలహీనత కాదు.. మన కళ్ళ ఆరోగ్య రహస్యం అనే దృష్టితో చూసే ప్రయత్నం చేయాలి. ఏడుపు శరీరాన్ని, మనసును, కళ్లను శుభ్రంగా ఉంచే సహజ ప్రక్రియగా గుర్తించాలని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: చియా విత్తనాల ప్రయోజనాలను పొందడానికి ఉత్తమ మార్గం ఇదే
( crying | crying-benefits | eyes | Health Tips | health tips in telugu | latest health tips | best-health-tips | Latest News | telugu-news)