/rtv/media/media_files/2025/07/24/eyes-2025-07-24-16-28-23.jpg)
Eye Infection
Eye Infection: వర్షాకాలం మనకు ఆహ్లాదాన్ని, చల్లదనాన్ని అందిస్తే కూడా.. అదే సమయంలో ఆరోగ్యపరంగా కొన్ని సవాళ్లను కూడా అందిస్తుంది. ముఖ్యంగా ఈ సీజన్‌లో గాలిలో తేమ పెరిగినప్పుడు.. బ్యాక్టీరియా వేగంగా విస్తరించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. దీనివల్ల అనేక కంటి ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. ముఖ్యంగా కళ్ళు శరీరంలో అత్యంత సున్నితమైన అవయవాలలో ఒకటి. వాటి పట్ల నిర్లక్ష్యం వహించకూడదు. వర్షాకాలంలో చలి, తడి వాతావరణం వల్ల బ్యాక్టీరియా, ఫంగస్ వంటి సూక్ష్మక్రిములు కళ్లను ప్రభావితం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో కళ్ళ ఇన్ఫెక్షన్లు ఎర్రబడి కనిపించడం, నీరు కారడం, దురద వంటి తేలికపాటి లక్షణాలతో మొదలవుతూ.. ఆ తర్వాత తీవ్రమవుతాయి. వర్షాకాలంలో కళ్ళ జాగ్రత్త గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
కళ్ళ సంరక్షణకు తీసుకునే జాగ్రత్తలు..
ఒకసారి ఇన్ఫెక్షన్ పెరిగితే.. దృష్టిపై ప్రభావం చూపే ప్రమాదం కూడా ఉంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, కాంటాక్ట్ లెన్స్‌లు ఉపయోగించే వ్యక్తులు మరింత జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్లు సూచించేదల్లా ఒక్కటే ప్రతి రోజు కళ్ళను శుభ్రమైన చల్లటి నీటితో కడుక్కోవాలి. బయట నుంచి వచ్చిన వెంటనే లేదా ధూళిలో గడిపిన తర్వాత కళ్ళను శుభ్రపరచడం తప్పనిసరి. మురికి చేతులతో కళ్ళను తాకడం వల్ల సూక్ష్మక్రిములు కళ్ళలోకి చేరే అవకాశం ఉంటుంది. కనీసం రోజుకు రెండుసార్లు కళ్ళను శుభ్రం చేయడం ఒక మంచి అలవాటుగా మార్చుకోవాలి.
ఇది కూడా చదవండి: మీ పిల్లలకు క్రాక్స్ చెప్పులు వేస్తున్నారా? అయితే.. ఈ షాకింగ్ విషయాలు మీ కోసమే..!
కాంటాక్ట్ లెన్స్‌ల విషయంలో అయితే మరింత జాగ్రత్త అవసరం. లెన్స్‌లు వేసే ముందు చేతులను సబ్బుతో బాగా కడుక్కోవాలి. పాత లేదా కాలపరిమితి ముగిసిన లెన్స్‌లు వాడకూడదు. అలాగే లెన్స్ ద్రావణాన్ని ప్రతిరోజూ మార్చాలి. వర్షాకాలంలో పాత కంటి మేకప్ ఉత్పత్తులు వాడటం వల్ల కూడా ఇన్ఫెక్షన్ రాగలదు. అవసరమైతే కంటి వైద్యుడి సలహా మేరకు యాంటీబాక్టీరియల్ డ్రాప్స్ వాడాలి. ఇంకా వర్షాకాలం వేడి టీ, పకోడీలు, సినిమాలు లాంటి ఆనందాలను ఆస్వాదించాలంటే.. కళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం తప్పనిసరి. ఒకవేళ కళ్ళలో ఇన్ఫెక్షన్ వస్తే తక్షణమే వైద్యులను సంప్రదించాలి. నిర్లక్ష్యం చేస్తే సమస్య తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ వర్షాకాలంలో తేమ, ధూళి, మురికి వాతావరణంలోనూ కళ్ళను జాగ్రత్తగా కాపాడుకొని ఆరోగ్యంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. విద్యుత్ షాక్‌కు చికిత్స అందించే విధానం ఇదే
( eyes | Health Tips | health tips in telugu | latest health tips | best-health-tips | Latest News | telugu-news )