/rtv/media/media_files/2025/10/12/breast-cancer-2025-10-12-13-49-32.jpg)
Breast cancer
భారతదేశంలో మహిళలను ఎక్కువగా ప్రభావితం చేసే క్యాన్సర్‌లలో రొమ్ము క్యాన్సర్ (Breast Cancer) అత్యంత సాధారణమైనది. అయితే ఈ వ్యాధి గురించి ఇంటర్నెట్‌లో అనేక అపోహలు ప్రచారంలో ఉన్నాయి. ప్రజలు వైద్యులను సంప్రదించకుండా ఆన్‌లైన్ సమాచారాన్ని నమ్మడం తరచుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో రొమ్ము క్యాన్సర్‌కు సంబంధించి ప్రబలంగా ఉన్న కొన్ని అపోహలు మరియు వాటి వెనుక ఉన్న నిజాలను మెడికల్ ఆంకాలజీ నిపుణులు వివరించారు. వాటి గురించి
రొమ్ము క్యాన్సర్ అపోహలు-వాస్తవాలు:
మొదటి మందుతోనే రొమ్ము క్యాన్సర్ శాశ్వతంగా నయమవుతుంది. క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తించడం వలన రోగి కోలుకునే మరియు బ్రతికే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. అయినప్పటికీ చికిత్స అక్కడితో పూర్తవదు. కాబట్టి రోగులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. రొమ్ము క్యాన్సర్‌కు ఇప్పుడు హార్మోనల్, టార్గెటెడ్ థెరపీల ద్వారా చికిత్స అందిస్తున్నారు. ఇవి ఆరోగ్యకరమైన కణాలకు నష్టం కలిగించకుండా కేన్సర్ కణాలను మాత్రమే నాశనం చేస్తాయి. ఈ విధానం జీవన నాణ్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది. అందువల్ల దీర్ఘకాలిక చికిత్స వల్ల జీవన నాణ్యత తగ్గకపోగా.. మహిళల జీవితకాలం పెరగడానికి అవకాశం ఉంది. బాగానే ఉంటే క్రమం తప్పకుండా ఫాలో-అప్ అవసరం లేదు.
ఇది కూడా చదవండి: నిద్ర కావాలా నాయన.. అయితే ఈ యోగాసనాల గురించి తెలుసుకోండి!!
చికిత్స తర్వాత క్యాన్సర్ తిరిగి వచ్చే ప్రమాదం ఉన్నందున.. క్రమం తప్పకుండా ఫాలో-అప్ (Daily Follow-up) అవసరం. రొమ్ము క్యాన్సర్ చికిత్స తర్వాత కోలుకోవడం సాధారణంగా బాగుంటుంది. అయినప్పటికీ ఇమేజింగ్, ల్యాబ్ పరీక్షలు, శారీరక పరీక్షలతో కూడిన దైనందిన ఫాలో-అప్ తప్పనిసరి. శరీరంలో ఏవైనా కొత్త కంతి, నిరంతర అలసట లేదా నొప్పి వంటి మార్పులను గమనిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు సూచించారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: రుచితోపాటు ఆరోగ్యం.. శీతాకాలంలో తినాల్సిన ఈ మిఠాయి రెసిపీ ఎంటో మీరూ తెలుసుకోండి!!