/rtv/media/media_files/2025/10/14/night-shift-duty-2025-10-14-07-03-36.jpg)
Night Shift Duty
నేటి ఆధునిక జీవనశైలిలో కిడ్నీలో రాళ్ల (Kidney Stones) సమస్య సర్వసాధారణమైంది. అయితే నైట్ షిఫ్ట్‌లో పనిచేసే వారికి మరింత పెరిగే అవకాశం ఉందని ఓ కొత్త అధ్యయనం హెచ్చరించింది. అధ్యయనం ప్రకారం.. రాత్రి వేళల్లో పనిచేసేవారికి కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం సాధారణ వ్యక్తుల కంటే 15 శాతం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా యువకులు, తక్కువ శారీరక శ్రమ చేసేవారిలో ఈ ప్రమాదం మరింత అధికమని పరిశోధకులు తెలిపారు. నైట్ షిఫ్ట్ ఉద్యోగులకు కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం ఎందుకు ఎక్కువగా ఉంటుంటో దాని గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
నైట్ షిఫ్ట్ చేస్తే కిడ్నీలపై ప్రభావితం:
కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి శరీర బరువు (BMI), తక్కువ నీటి వినియోగం, ఇతర జీవనశైలి కారకాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. రాత్రిపూట పనిచేసేవారు సరైన నిద్ర, ఆహారం వంటి అలవాట్లను పాటించడంలో తరచుగా ఇబ్బంది పడతారు. ఇది శరీరంలోని సహజ సమయ వ్యవస్థ అయిన సిర్కాడియన్ రిథమ్ (Circadian Rhythm)ను తీవ్రంగా దెబ్బతీస్తుంది. నైట్ షిఫ్ట్ ఉద్యోగులలో కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం 15% అధికంగా ఉంది. ధూమపానం, తక్కువ నిద్ర, తగినంత నీరు తాగకపోవడం, అధిక బరువు వంటి జీవనశైలి అలవాట్లు కూడా ఈ ప్రమాదాన్ని పెంచుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: చర్మంతో పాటు పాదాలపై ఈ లక్షణాలు కనిపిస్తే ఆ విటమిన్ లోపమే.. దాన్ని ఎలా పెంచుకోవాలో తెలుసుకోండి
సిర్కాడియన్ రిథమ్ అనేది మనం ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు మేల్కోవాలి, హార్మోన్లు ఎప్పుడు ఉత్పత్తి కావాలనే అంశాలను నియంత్రించే ఒక సహజ ప్రక్రియ. ఈ రిథమ్ దెబ్బతిన్నప్పుడు.. జీవక్రియ (Metabolism), హార్మోన్ల స్థాయిలు అసమతుల్యమవుతాయి. కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి ఇదొక ముఖ్య కారణమవుతుంది. కిడ్నీలో రాళ్లు దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి, గుండె జబ్బులు, కిడ్నీ వైఫల్యం వంటి తీవ్ర సమస్యలకు దారితీయవచ్చు. కాబట్టి.. నైట్ షిఫ్ట్ ఉద్యోగులు తగినంత నీరు తాగుతూ.. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం అత్యవసరమని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి:అపోహలు వీడండి నిజం తెలుసుకోండి