/rtv/media/media_files/2025/09/22/cervical-cancer-vaccine-2025-09-22-19-08-50.jpg)
Cervical Cancer Vaccine
గర్భాశయ క్యాన్సర్ అనేది గర్భాశయ ముఖద్వారం లేదా సర్విక్స్ వద్ద కణాల అసాధారణ పెరుగుదల వల్ల వస్తుంది. దీనికి ప్రధాన కారణం హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (HPV) అని పిలిచే వైరస్. ఈ క్యాన్సర్ నివారణకు టీకాలు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా ప్యాప్ స్మియర్ (Pap smear) వంటి సాధారణ పరీక్షల ద్వారా దీనిని ముందుగానే గుర్తించి చికిత్స చేయవచ్చు. లక్షణాలు మొదట్లో స్పష్టంగా ఉండకపోవచ్చు.. కానీ వ్యాధి ముదిరిన తర్వాత అసాధారణ రక్తస్రావం, వెన్నునొప్పి, మూత్ర విసర్జన సమస్యలు కనిపించవచ్చు. సకాలంలో సరైన చికిత్స తీసుకోవడం వల్ల ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు. అందుకే రెగ్యులర్ పరీక్షలు, టీకాలు చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. మహిళల్లో అత్యంత సాధారణమైన క్యాన్సర్లలో రెండవది గర్భాశయ క్యాన్సర్.
గర్భాశయ క్యాన్సర్ నివారణకు..
భారతదేశంలో దీని కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రాణాంతకమైన ఈ వ్యాధి గురించి మహిళల్లో అవగాహన పెంచడం చాలా అవసరమని క్యాన్సర్ ఆంకాలజిస్ట్ నిపుణులు చెబుతున్నారు. ఈ క్యాన్సర్‌ను నివారించడానికి మహిళలు హ్యూమన్ పాపిలోమావైరస్ (HPV) టీకా తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. HPV టీకా గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుందని వైద్యులు తెలుపుతున్నారు. ఈ టీకాను రెండు రకాలుగా ఇస్తారు. 9 నుంచి 14 సంవత్సరాల మధ్య వయసు గల బాలికలకు రెండు డోసుల టీకా ఇస్తారు. ఈ రెండు డోసుల మధ్య ఆరు నెలల వ్యవధి ఉంటుంది.
ఇది కూడా చదవండి: నీడలు భయపెడుతున్నాయా..? మీరు స్కిజోఫ్రెనియా బాధితులు కావొచ్చు
అదేవిధంగా 14 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న అమ్మాయిలు, మహిళలకు మూడు డోసుల టీకా ఇస్తారు. మొదటి డోసు తర్వాత ఒక నెల వ్యవధిలో రెండవ డోసు, మరియు మొదటి డోసు తర్వాత ఆరు నెలల వ్యవధిలో మూడవ డోసు ఇస్తారు. వైద్య నిపుణులను సంప్రదించిన తర్వాత అందుబాటులో ఉన్న మూడు రకాల HPV టీకాలలో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. దీనిని ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా పొందవచ్చు. ముఖ్యంగా ఢిల్లీ వంటి నగరాల్లో మహిళలు ప్రభుత్వ ఆసుపత్రులలో ఈ టీకాను ఉచితంగా తీసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. గర్భాశయ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా ఈ టీకా ఒక బలమైన రక్షణ కవచమని.. ఇది మహిళల ఆరోగ్యానికి, భవిష్యత్తుకు చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి:గర్భధారణ సమయంలో ఈ ఆహారం తల్లి బిడ్డ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం