Schizophrenia Symptoms: నీడలు భయపెడుతున్నాయా..? మీరు స్కిజోఫ్రెనియా బాధితులు కావొచ్చు

స్కిజోఫ్రెనియా అనేది ఒక తీవ్రమైన మానసిక వ్యాధి. దీనివల్ల వాస్తవానికి.. ఊహకు మధ్య తేడాను గుర్తించడంలో మెదడుకు గందరగోళం ఏర్పడుతుంది. ఈ సమస్యతో బాధపడేవారు నిజంగా లేనివి చూసినట్లుగా, విన్నట్లుగా భ్రమిస్తారని నిపుణులు చెబుతున్నారు.

New Update
Schizophrenia Symptoms

Schizophrenia Symptoms

నేటి వేగవంతమైన ప్రపంచంలో ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యల వల్ల అనేక మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. మన చుట్టూ ఉన్న విషయాలను చూసి చాలా మంది భయపడుతూ ఉంటారు. కొందరికి రాత్రివేళల్లో నీడలు కనిపిస్తాయి.. మరికొందరికి ఒంటరిగా ఉన్నా ఎవరితోనో మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. వీటిని చాలా మంది చేతబడులు లేదా మంత్రతంత్రాలతో ముడిపెడతారు. కానీ ఇవి స్కిజోఫ్రెనియా అనే మానసిక వ్యాధి లక్షణాలు కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. స్కిజోఫ్రెనియా గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

స్కిజోఫ్రెనియా మానసిక వ్యాధి..

స్కిజోఫ్రెనియా అనేది ఒక తీవ్రమైన మానసిక వ్యాధి. దీనివల్ల వాస్తవానికి.. ఊహకు మధ్య తేడాను గుర్తించడంలో మెదడుకు గందరగోళం ఏర్పడుతుంది. ఈ సమస్యతో బాధపడేవారు నిజంగా లేనివి చూసినట్లుగా, విన్నట్లుగా భ్రమిస్తారు. ఈ వ్యాధి ఉన్నవారు ఇతరులు తమ గురించి మాట్లాడుకుంటున్నారని.. తమను హాని చేయాలని చూస్తున్నారని లేదా తమపై నిఘా వేస్తున్నారని భ్రమపడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో.. తమను ఒక నీడ అనుసరిస్తున్నట్లుగా భావిస్తారు. ఈ వ్యాధి నెమ్మదిగా వారి ఆలోచనలు, భావోద్వేగాలు, రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. మొదట్లో స్కిజోఫ్రెనియా లక్షణాలు సాధారణంగా అనిపిస్తాయి. ఒంటరిగా ఉండాలని కోరుకోవడం, ఇతరులతో మాట్లాడటానికి ఆసక్తి చూపకపోవడం, ఏ పనిపైనా దృష్టి పెట్టలేకపోవడం లేదా భయం, అనుమానాలతో ఉండటం వంటి లక్షణాలు కనపడతాయి. అయితే ఈ సమస్య తీవ్రమైన తర్వాత కొన్ని లక్షణాలు బయటపడతాయి. 

ఇది కూడా చదవండి:స్త్రీ అండాలను ఫ్రీజ్ చేయడానికి సరైన వయసు ఏదో తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చదవండి

అవి.. గదిలో ఎవరూ లేకపోయినా వారితో మాట్లాడినట్లుగా అనిపించడం, చనిపోయిన వ్యక్తులు కనిపిస్తున్నారని భావించడం, తమకు తామే మాట్లాడుకోవడం, వాస్తవంతో సంబంధం లేని విషయాలను నిజమని నమ్మడం వంటి ఉంటాయి. స్కిజోఫ్రెనియా రావడానికి కచ్చితమైన కారణం ఇంకా తెలియ రాలేదు. మెదడులోని రసాయనాలు డోపామైన్, సెరోటోనిన్ వంటి వాటిలో అసమతుల్యత వల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. జన్యుపరమైన కారణాలు కూడా ఈ వ్యాధికి ఒక కారణంగా భావిస్తారు. ఒక భయంకరమైన అనుభవం, అధిక ఒత్తిడి, నిద్రలేమి, లేదా మత్తు పదార్థాలకు బానిస కావడం వంటి అలవాట్లు కూడా ఈ వ్యాధిని ప్రేరేపించవచ్చని చెబుతున్నారు. స్కిజోఫ్రెనియా అనేది దీర్ఘకాలిక సమస్య అయినప్పటికీ.. దీనికి చికిత్స అందుబాటులో ఉంది. సరైన చికిత్స, థెరపీ, మందుల వాడకం ద్వారా దీనిని అదుపులో ఉంచవచ్చు. మీకు లేదా మీకు తెలిసిన వారికి ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఒక మానసిక వైద్య నిపుణుడిని సంప్రదించడం చాలా అవసరం. నిపుణుల సలహా తీసుకోవడం ద్వారా జీవితాన్ని సాధారణ స్థితిలోకి తీసుకురావచ్చని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి:నిద్ర తక్కువ పోయే వారికి షాకింగ్ న్యూస్.. ఆ కొత్త రోగం గ్యారెంటీ..?

Advertisment
తాజా కథనాలు