Amla Seeds: ఉసిరి గింజలను ఇక పడేయకండి.. తాజా రీసెర్చ్‌లో ఊహించని విషయాలు!!

ఉసిరి గింజలు ఆరోగ్యానికి నిధిగా మారాయి, రైతులకు ఆదాయ వనరుగా నిలిచాయి, భారతీయ ఆయుర్వేద పరిశోధనకు అంతర్జాతీయ వేదికపై గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. ప్రాచీన విజ్ఞానాన్ని ఆధునిక సైన్స్ దృష్టికోణంలో చూస్తే మానవాళికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని నిపుణులు అంటున్నారు.

New Update
Amla seeds

Amla Seeds

భారతీయ సంస్కృతిలో, ఆయుర్వేదంలో ఉసిరికాయకు ఉన్న స్థానం అద్వితీయమైనది. రసాయనంగా పిలువబడే ఉసిరి.. తరతరాలుగా రోగనిరోధక శక్తిని పెంచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి, దీర్ఘాయుష్షుకు కీలకమైన మూలికగా వాడబడుతోంది. అయితే.. ఉసిరికాయ యొక్క గుజ్జును ఉపయోగించిన తర్వాత.. దాని గింజలు (seeds) కేవలం వ్యర్థంగా (waste) పారవేయబడేవి. ఆయుర్వేదంలో దశాబ్దాలుగా పాతుకుపోయిన ఈ ధోరణికి శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేశారు. నిరుపయోగంగా భావించబడే ఈ ఉసిరి గింజలపై(Amla Seeds) నిర్వహించిన లోతైన పరిశోధన, ఈ గింజలు ఆరోగ్య నిధి అని నిరూపించింది. ఈ ఆవిష్కరణ కేవలం సైన్స్ ప్రపంచానికే పరిమితం కాలేదు.. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరిని ఇచ్చి.. ప్రాచీన ఆయుర్వేద జ్ఞానాన్ని ఆధునిక శాస్త్రంతో కలిపితే ఎంతటి సంచలనం సృష్టించవచ్చో ప్రపంచానికి చూపించింది. దీనిని వేస్ట్ టు వెల్త్ (Waste to Wealth) భావనకు పర్ఫెక్ట్ ఉదాహరణగా పేర్కొనవచ్చు. అయితే వీటి గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

పరిశోధనలో ఏం కనుగొన్నారు..?

ఈ గింజలలో అపారమైన ఔషధ గుణాలున్నాయని పరిశోధన, అభివృద్ధి చేసిన బృందం నిపుణులు వెల్లడించారు. ఈ పరిశోధన ప్రకారం.. ఉసిరి గింజల్లో ఇంతకుముందు పెద్దగా వినియోగించబడని శక్తివంతమైన బయోయాక్టివ్ సమ్మేళనాలు (bioactive compounds) దాగి ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి క్వెర్సెటిన్. ఇవి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. అంతేకాకుండా ఎలాజిక్ ఆసిడ్.. యాంటీ-క్యాన్సర్, యాంటీఆక్సిడెంట్, గుండెకు రక్షణ ఇచ్చే (Cardioprotective) గుణాలు కలిగిన సమ్మేళనం, ఇంకా ఫ్లేవనాయిడ్స్.. వృద్ధాప్య సంకేతాలను నిరోధించడంలో (Anti-aging), రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా గుండె ఆరోగ్యం, మెదడు పనితీరు, శరీరంలో మంట (inflammation) తగ్గించడానికి చాలా అవసరం. టానిన్స్ (Tannins), సపోనిన్స్ (Saponins) కూడా బలమైన యాంటీఆక్సిడెంట్, యాంటీ-వైరల్ లక్షణాలను కలిగి ఉంటాయి.

ఔషధపరమైన ప్రయోజనాలు:

ఈ సమ్మేళనాలను ఆధారం చేసుకొని ఈ గింజలు కేవలం నివారణకే కాకుండా.. ఆధునిక జీవనశైలి వ్యాధులను (Lifestyle Diseases) నియంత్రించడానికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొంది. ఒమేగా-3, ఎలాజిక్ ఆసిడ్ ఉండటం వలన ఈ గింజలు అధిక రక్తపోటు (High Blood Pressure),  కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అయితే ఫ్లేవనాయిడ్స్, యాంటీఆక్సిడెంట్లు చర్మంపై వృద్ధాప్య ప్రభావాలను తగ్గించి, చర్మానికి మెరుపునిస్తాయి. అంతేకాకుండా ఉసిరి యొక్క హైపోగ్లైసీమిక్ ప్రభావం గింజలలో కూడా ఉంటుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇవి క్వెర్సెటిన్,  విటమిన్ సి వంటి వాటితో రోగనిరోధకశక్తిని బలోపేతం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. - healthy life style

అంతర్జాతీయ గుర్తింపు-నూతన ఆవిష్కరణ:

ఈ పరిశోధన దేశీయంగానే కాక.. అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు పొందింది. భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ (Ministry of AYUSH), ఏషియన్ ట్రెడిషనల్ మెడిసిన్ బోర్డ్ (Asian Traditional Medicine Board) వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఈ అధ్యయనాన్ని ప్రశంసించాయి. అంతేకాకుండా.. యూరప్, మలేషియా, థాయిలాండ్ వంటి దేశాల పరిశోధనా పత్రాలలో ఈ పరిశోధనా ఫలితాలు ఉదహరించబడటం (cited) భారతీయ ఆయుర్వేదానికి లభించిన గౌరవంగా చెప్పవచ్చు. ఈ అధ్యయనం ఆధారంగా.. ఉసిరి గింజల నూనె క్యాప్సూల్స్ (Amla Seed Oil Capsules), స్కిన్‌కేర్ ఫార్ములేషన్స్ (skincare formulations),  రోగనిరోధక శక్తిని పెంచే ఉత్పత్తులను అభివృద్ధి చేసింది. విదేశాల్లో సహజమైన న్యూట్రాస్యూటికల్స్‌కు పెరుగుతున్న డిమాండ్‌ దృష్ట్యా.. ఈ కొత్త ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి గిరాకీ లభిస్తోంది. ఇది భారతదేశం మూలికా ఎగుమతి సామర్థ్యాన్ని (herbal export potential) పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి:  బ్రా రంగు, సైజ్ కూడా క్యాన్సర్‌కు కారణమా..?.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!

రైతులకు అదనపు ఆదాయ వనరు:

ఈ పరిశోధన అతిపెద్ద సామాజిక ప్రభావం రైతులకు కలిగిన ప్రయోజనం. ఇంతకుముందు ఉసిరి గింజలు వ్యవసాయ వ్యర్థంగా పారేయబడేవి. ఇప్పుడు ఈ గింజలను రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. అంతేకాకుండా ఉత్తరాఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్,  ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలలో రైతుల నుంచి ఈ గింజలను కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వ్యర్థం అనుకున్న వస్తువుకు విలువ రావడంతో.. ఉసిరి రైతులు అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమేకాక..జీరో వేస్ట్ హెర్బల్ ఫార్మింగ్ పద్ధతిని ప్రోత్సహిస్తుంది. ఇది విదేశాల నుంచి దిగుమతి చేసుకునే హెర్బల్ ఉత్పత్తులపై ఆధారపడటాన్ని కూడా ఈ చర్య తగ్గిస్తుంది. ఈ ఆవిష్కరణ ప్రాచీన జ్ఞానాన్ని ఆధునిక శాస్త్రం ద్వారా నిర్ధారించడంలో భారతదేశం యొక్క సామర్థ్యాన్ని రుజువు చేసింది. ఆయుర్వేద గ్రంథాలలో ఉసిరి ఉపయోగాలు విస్తృతంగా ఉన్నా.. దాని గింజల లోతైన రసాయన కూర్పును గుర్తించి.. దాని ఆధారంగా ఔషధ ఉత్పత్తులను రూపొందించడం అనేది ఒక వినూత్న పద్ధతి. ఉసిరి గింజలను నిరుపయోగమైనవిగా పారేసే రోజులు పోయాయి. ఇవి ఇప్పుడు ఆరోగ్యానికి నిధిగా మారాయి... రైతులకు ఆదాయ వనరుగా నిలిచాయి, భారతీయ ఆయుర్వేద పరిశోధనకు అంతర్జాతీయ వేదికపై గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. ప్రాచీన విజ్ఞానాన్ని ఆధునిక సైన్స్ దృష్టికోణంలో చూస్తే మానవాళికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని నిపుణులు అంటున్నారు. - daily-life-style

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: షుగర్ ఉన్న వాళ్లు పిల్లలను కనొచ్చా..? ఎలా ప్లాన్ చేసుకోవాలి..?

Advertisment
తాజా కథనాలు