Joint Pain: చలికాలంలో కీళ్ల నొప్పులకు చెక్.. ఉపశమనానికి 5 ప్రభావవంతమైన చిట్కాలు

కీళ్ల నొప్పి తీవ్రంగా ఉంటే లేదా దీర్ఘకాలంగా కొనసాగితే.. అది రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు. కాబట్టి తప్పకుండా వైద్యుడిని సంప్రదించి.. సరైన రోగ నిర్ధారణ, చికిత్స తీసుకోవడం అవసరమని నిపుణులు చెబుతున్నారు.

New Update
Joint Pain

Joint Pain

చలికాలం (Winter Season) రాగానే చాలా మందిని వేధించే ప్రధాన సమస్య కీళ్ల నొప్పులు (Joint Pains). ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు కీళ్ల చుట్టూ ఉండే కండరాలు బిగుసుకుపోవడం, రక్త ప్రసరణ మందగించడం, వాతావరణ పీడనంలో మార్పుల కారణంగా ఈ నొప్పి మరింత తీవ్రమవుతుంది. అయితే సరైన జాగ్రత్తలు, ఆహార నియమాలు, తేలికపాటి వ్యాయామాల (Light Exercise) ద్వారా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చలికాలంలో కీళ్ల నొప్పుల ఉపశమనానికి 5 ప్రభావవంతమైన చిట్కాల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

డీహైడ్రేషన్ వద్దు:  

కీళ్ల నొప్పులకు ప్రధాన కారణాలలో ఒకటి డీహైడ్రేషన్ (Dehydration). చలికాలంలో దాహం తక్కువగా అనిపించినా.. శరీరం నీటిని కోల్పోతూనే ఉంటుంది. కీళ్లలో ఉండే సైనోవియల్ ద్రవం (Synovial Fluid) కీళ్లు సున్నితంగా కదలడానికి సహజ కందెన (Natural Lubricant) లాగా పనిచేస్తుంది. నీరు తగినంతగా తాగకపోతే ఈ ద్రవం తగ్గిపోయి, కీళ్ల మధ్య ఘర్షణ పెరిగి, నొప్పి, బిగుతు పెరుగుతాయి. అందుకని రోజంతా క్రమం తప్పకుండా గోరు వెచ్చని నీరు (Lukewarm Water) తాగడం వల్ల సైనోవియల్ ద్రవం సరిగా ఉత్పత్తి అయ్యి కీళ్ల నొప్పి, వాపు తగ్గుతాయి, కండరాలు రిలాక్స్ అవుతాయి.

పోషకాహారం: 

కీళ్ల నొప్పి(joint-pain-tips)ని తగ్గించడంలో.. ఎముకలు, కీళ్లను బలోపేతం చేయడంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ (Anti-inflammatory) గుణాలున్న ఆహారాలు శరీరంలోని మంటను తగ్గిస్తాయి. అందుకు నువ్వులు, బెల్లం (Sesame Seeds and Jaggery), బాదం, వాల్‌నట్‌లు, వేరుశనగలు, పసుపు కలిపిన పాలు (Turmeric Milk), ఆకుపచ్చ కూరగాయలు, సోయా, కాయధాన్యాలు (Lentils). ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు (Omega-3 Fatty Acids) అధికంగా ఉండే అవిసె గింజలు, ఆలివ్ నూనె వంటివి కూడా వాపును తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా శీతల పానీయాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, వేయించిన చిరుతిళ్లు, అధికంగా మసాలాలు ఉన్న ఆహారం, అలాగే కొందరు నిపుణుల సలహా ప్రకారం బంగాళాదుంపలు, టమాటాలు, చిక్కుళ్ళు వంటి లెక్టిన్లు అధికంగా ఉండే పదార్థాలను పరిమితం చేయాలి.

విటమిన్ డి: 

చలికాలంలో సూర్యరశ్మి (Sunlight) తక్కువగా లభించడం వల్ల చాలా మందిలో విటమిన్ డి (Vitamin D) లోపం ఏర్పడుతుంది. విటమిన్ డి అనేది కాల్షియంను (Calcium) శరీరం శోషించుకోవడానికి, ఎముకలను బలంగా ఉంచడానికి చాలా అవసరం. దీని లోపం కండరాల బిగుతు, కీళ్ల నొప్పిని పెంచుతుంది. ప్రతిరోజూ కనీసం అరగంట పాటు సూర్యరశ్మిలో నడవడం లేదా కూర్చోవడం ద్వారా శరీరంలో విటమిన్ డి స్థాయిని పెంచుకోవచ్చు. తీవ్రమైన లోపం ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు సప్లిమెంట్లను తీసుకోవడం మంచిది.

తేలికపాటి వ్యాయామం:

చలికి భయపడి ఇంట్లోనే ఉండటం, శారీరక శ్రమను తగ్గించడం వల్ల కీళ్లు(joint-pains) మరింత బిగుసుకుపోతాయి. అందుకే కీళ్లకు మద్దతు ఇచ్చే కండరాలను బలోపేతం చేయడానికి, కీళ్లలో రక్త ప్రసరణను మెరుగుపరచడానికి తేలికపాటి వ్యాయామాలు (Gentle Exercises) అవసరం. వాకింగ్, యోగా, తేలికపాటి స్ట్రెచింగ్‌లు, ఇండోర్ వ్యాయామాలు. నొప్పి లేని పరిమితుల్లో శరీరాన్ని కదిలించడం ద్వారా సైనోవియల్ ద్రవం కీళ్లలోకి చేరి.. బిగుతు తగ్గుతుంది. కీళ్లపై ఎక్కువ భారం పడని ఈత (Swimming) వంటివి కూడా మంచి ఎంపిక. వ్యాయామం ప్రారంభించే ముందు తప్పకుండా వామప్ చేయాలి.

ఇది కూడా చదవండి: ఈ విటమిన్లు శరీరంలో తగ్గితే డేంజర్.. లివర్ దొబ్బుద్ది!

వేడి చికిత్స-మసాజ్:

నొప్పి ఉన్న ప్రాంతానికి వేడిని అందించడం అనేది తక్షణ ఉపశమనాన్ని (Instant Relief) ఇచ్చే పద్ధతి. దీనిని హీట్ థెరపీ (Heat Therapy) అంటారు. వెచ్చని గుడ్డ లేదా వేడి నీటి సంచిని (Hot Water Bag) నొప్పి ఉన్న చోట 10-15 నిమిషాలు ఉంచడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి, కండరాలు రిలాక్స్ అయ్యి, నొప్పి తగ్గుతుంది. అంతేకాకుండా ఆవాలు, కొబ్బరి లేదా నువ్వుల నూనెను (Mustard, Coconut, or Sesame Oil) కొద్దిగా గోరు వెచ్చగా చేసి నొప్పి ఉన్న కీళ్లపై సున్నితంగా 10 నిమిషాలు మసాజ్ చేయడం ద్వారా కీళ్ల బిగుతు తగ్గి.. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. మసాజ్ తర్వాత ఆ ప్రాంతాన్ని వెచ్చని దుస్తులతో కప్పి ఉంచడం మంచిది.

బరువు నియంత్రణ-వెచ్చని దుస్తులు:

చలికాలంలో చాలామంది ఎక్కువగా తినడం వల్ల బరువు పెరుగుతారు. అధిక బరువు ముఖ్యంగా మోకాలు, తుంటి వంటి బరువు మోసే కీళ్లపై ఒత్తిడిని పెంచుతుంది.. ఇది నొప్పిని తీవ్రతరం చేస్తుంది. అందుకే ఆహారంపై శ్రద్ధ పెట్టి ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం చాలా ముఖ్యం. బయటకు వెళ్ళేటప్పుడు శరీరాన్ని పూర్తిగా వెచ్చని దుస్తులతో కప్పి ఉంచాలి. ముఖ్యంగా నొప్పి ఉన్న కీళ్ల భాగాలను వెచ్చని బ్యాండ్లు లేదా గ్లౌజులతో కప్పుకోవడం ద్వారా చల్లటి గాలి తగలకుండా చూసుకోవాలి. ఇది నొప్పి పెరగకుండా నిరోధిస్తుంది. పైన పేర్కొన్న చిట్కాలు ఉపశమనాన్ని అందిస్తాయి.. అయినప్పటికీ కీళ్ల నొప్పి తీవ్రంగా ఉంటే లేదా దీర్ఘకాలంగా కొనసాగితే.. అది రుమటాయిడ్ ఆర్థరైటిస్ (Rheumatoid Arthritis) వంటి ఇతర ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు. కాబట్టి తప్పకుండా వైద్యుడిని సంప్రదించి.. సరైన రోగ నిర్ధారణ, చికిత్స తీసుకోవడం అవసరమని నిపుణులు చెబుతున్నారు. - sexual health tips

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: దాంపత్య జీవితం.. ఆర్థిక స్థితి, ప్రేమ బంధంపై... కలలు చెప్పే రహస్యాలు!

Advertisment
తాజా కథనాలు