/rtv/media/media_files/2025/07/21/coconut-water-and-diabetes-2025-07-21-20-29-14.jpg)
Coconut Water And Diabetes
డయాబెటిస్ అనేది శరీరంలో రక్తపు చక్కెర స్థాయిలు అదుపు తప్పే వ్యాధి. ఈ రోగులు తమ ఆహారంలో తీసుకునే ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. ఎందుకంటే ప్రతి ఆహార పదార్థం రక్తంలో గ్లూకోజ్ స్థాయిపై ప్రభావం చూపుతుంది. చాలామంది డయాబెటిస్ రోగులు కొబ్బరి నీరు తాగొచ్చా? అనే ప్రశ్నను తరచూ ఎదుర్కొంటారు. కొబ్బరి నీరు తీపిగా ఉండటంతో ఇది రక్తంలో చక్కెరను పెంచుతుందా అన్న సందేహం రావడం సహజం. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొబ్బరి నీరు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) గల పానీయం. అంటే ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని మెల్లగా పెంచుతుంది. అంతేకాక గ్లైసెమిక్ లోడ్ కూడా తక్కువగా ఉండటంతో ఇది డయాబెటిస్ రోగులకు మితంగా తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
Also Read : దరిద్రం అంటే వీడిదే.. భర్తని నదిలోకి తోసిన భార్య కేసులో బిగ్ ట్విస్ట్.. భర్తపైనే కేసు
డయాబెటిస్ రోగికి ముఖ్యమైన విషయాలు:
కొబ్బరి నీటిలో సహజంగా పొటాషియం, మెగ్నీషియం, సోడియం వంటి ఎలక్ట్రోలైట్లు ఉంటాయి. ఇవి శరీరాన్ని హైడ్రేట్ చేసేందుకు ఉపయోగపడతాయి. ముఖ్యంగా వ్యాయామం తర్వాత లేదా వేసవిలో కానీ దీన్ని ఎంత తీసుకోవాలి.? ఎప్పుడు తీసుకోవాలి అనే అంశాల్లో జాగ్రత్త అవసరం. డాక్టర్ల సూచన ప్రకారం.. డయాబెటిస్ ఉన్నవారు రోజుకు ఒకసారి 100 నుంచి 150 మిల్లీ లీటర్లు మాత్రమే కొబ్బరి నీరు తీసుకోవాలి. ఉదయం ఖాళీ కడుపుతో లేదా వ్యాయామం అనంతరం తాగితే శరీరానికి తగిన శక్తిని అందించడమే కాక.. చక్కెర స్థాయిలను ప్రభావితం చేయకుండా ఉంచే అవకాశముంది.
ఇది కూడా చదవండి: బ్రాహ్మణులలో శిఖ ప్రాముఖ్యత.. ఆధ్యాత్మిక, శాస్త్రీయ దృక్పథం
అయితే కొన్ని పరిస్థితుల్లో కొబ్బరి నీరు తాగడం మంచిదికాదు. ముఖ్యంగా డయాబెటిస్ కారణంగా మూత్రపిండాలకు సంబంధించి సమస్యలు ఉన్నవారు దీన్ని తప్పుకోవాలి. ఎందుకంటే ఇందులో ఉండే అధిక పొటాషియం స్థాయి మూత్రపిండాలపై ఒత్తిడిని కలిగించవచ్చు. అలాగే కొబ్బరి నీటిలో ఉండే క్రీమ్‌ను తినకూడదు. అందులో అధికంగా ఉండే కొవ్వు, కేలరీలు రక్తంలోని చక్కెర స్థాయిని పెంచే ప్రమాదం ఉంది. డయాబెటిస్ రోగులు ఎప్పటికప్పుడు వైద్యుని సలహా తీసుకుంటూ.. ఆరోగ్యాన్ని బట్టి ఆహారాన్ని నియంత్రించుకోవాలి. కొబ్బరి నీరు తాగవచ్చు కానీ పరిమితంగా.. సరైన సమయంలో మరియు నిబంధనలతోనే తాగాలని నిపుణులు చెబుతున్నారు.
Also Read : బిగ్ బాస్ బ్యూటీకి బెడిసికొట్టిన సర్జరీ!.. షాకింగ్ వీడియో
గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: కాలిన గాయాలపై టూత్‌పేస్ట్ రాస్తున్నారా..? డాక్టర్ చెప్పే విషయాలు తెలుసుకోండి
(coconut-water | diabetes | Health Tips | health tips in telugu | latest health tips | best-health-tips | Latest News | telugu-news)