/rtv/media/media_files/2025/05/19/QNiSxpyLVruLiZEIY2ue.jpg)
Night Dress
Night Dress: చాలా మంది పగటిపూట వేసుకునే దుస్తులనే ధరించి రాత్రి నిద్రపోతుంటారు. ఇది అనేక రకాల ఆనారోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. మంచి నిద్ర కోసం సౌకర్యవంతమైన మంచంతోపాటు శరీరానికి తగిన దుస్తులు వేసుకోవాలి. ముఖ్యంగా రాత్రిపూట ధరించే దుస్తుల ఎంపికలో నిర్లక్ష్యం వహిస్తే చర్మ సమస్యలు, రక్త ప్రసరణలో అంతరాయాలు, నిద్రాభంగం వంటి సమస్యలు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
దద్దుర్లు, ఇన్ఫెక్షన్లు:
బిగుతుగా ఉండే టీ-షర్టులు, లెగ్గింగ్స్, లోదుస్తులు వంటివి శరీరాన్ని బలవంతంగా గట్టిగా పట్టుకుని ఉంచుతాయి. ఇది రక్త ప్రసరణను ప్రభావితం చేయడమే కాకుండా వేసవి కాలంలో చర్మం ముడతలు పడేలా చేస్తుంది. శరీరానికి గాలి అందకుండా చెమట పెరిగి దురదలు, దద్దుర్లు, ఇన్ఫెక్షన్లకు దారి తీసే అవకాశం ఉంది. కొంతమంది మహిళలు రాత్రిపూట కూడా బ్రా ధరింస్తారు. అయితే అండర్‌వైర్ బ్రాలు రాత్రిపూట ధరించడం వల్ల రొమ్ము వద్ద నొప్పి, వాపు లాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. దాంతోపాటు శ్వాసతత్వానికి సంబంధించి అసౌకర్యం కలుగుతుంది. కనుక రాత్రిపూట సౌకర్యవంతమైన, కాటన్ మేటీరియల్‌తో తయారైన వదులుగా ఉండే బ్రాలను మాత్రమే ధరించాలి.
ఇది కూడా చదవండి: అకాల వర్షాలతో వ్యాధులు వచ్చే ప్రమాదం.. ఈ టిప్స్ అప్రమత్తంగా ఉండండి
ఇక నైలాన్, పాలిస్టర్ వంటి సింథటిక్ పదార్థాలతో తయారు చేసిన బట్టలు కూడా రాత్రిపూట ఉపయోగించకూడదు. ఈ ఫాబ్రిక్స్ శరీర చెమటను పీల్చుకోలేవు, గాలికి మార్గం కల్పించవు. దీంతో చర్మంపై అలెర్జీలు రావచ్చు. ఇవి దెబ్బతినే ప్రమాదాన్ని పెంచుతాయి. అలాగే జీన్స్ వంటి మందపాటి బట్టలు శరీరాన్ని ఒత్తిడి చెయ్యడమే కాకుండా, నిద్ర సమయంలో పూర్తి సౌకర్యం లేకుండా చేస్తాయి. మరింతగా చెమట కారడం, దురదలు, అసహనంగ ఉంటుంది. కొంతమందికి వెచ్చని బట్టలు ధరించి పడుకునే అలవాటు ఉంటుంది. కానీ శరీరం నిద్రపోతున్నపుడు స్వయంగా వేడిపోతుంది. అలాంటి సమయంలో వెచ్చని బట్టలు మరింతగా శరీర ఉష్ణోగ్రతను పెంచి నిద్రకు భంగం కలిగిస్తాయి. కాబట్టి రాత్రి నిద్రకు ముందు వేసుకునే దుస్తుల ఎంపిక చాలా ముఖ్యం. తేలికైన, శ్వాస తీసుకునే ఫాబ్రిక్‌తో తయారైన సౌకర్యవంతమైన దుస్తులను మాత్రమే ధరించడం వలన మంచి నిద్రతోపాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సూపర్ ఫుడ్స్.. రాత్రిపూట ఇలా తీసుకోండి
( health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news )