Night Food: ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సూపర్ ఫుడ్స్.. రాత్రిపూట ఇలా తీసుకోండి

రాత్రిపూట తీసుకునే ఆహారం ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. వాటిల్లో బాదం, డార్క్‌ చాక్లెట్, పసుపు పాలు, వాల్‌నట్స్ రాత్రి తీసుకుంటే నిద్ర, గుండె, టైప్ 2 డయాబెటిస్, మెదడు ఆరోగ్యాన్ని, గుండె పనితీరును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

New Update

Night Food: నేటి కాలంలో ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలలో ఆహారం కీలకమైనది. రోజంతా ఏం తింటామన్నదాని ప్రభావం శరీరంపై పడుతుంది. కానీ ముఖ్యంగా రాత్రిపూట తీసుకునే ఆహారం ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. నిద్రకు ముందు తీసుకునే కొన్ని ప్రత్యేకమైన ఫుడ్స్ శరీరాన్ని విశ్రాంతి చేయడం మాత్రమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచగలవు. ప్రతిరోజూ బాదం తినాలి. ఇది నిద్రించే ముందు బాదం తింటే టైప్ 2 డయాబెటిస్, గుండె సంబంధిత సమస్యల రిస్క్ తగ్గుతాయి. బాదంలో  మెలటోనిన్, మ్యాగ్నీషియం వంటి పోషకాలు శరీరాన్ని రిలాక్స్ చేయడంలో, నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది.

గుండె పనితీరును మెరుగుపరచడంలో..

డార్క్ చాక్లెట్లో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లు, ఉండటంతోపాటు మెగ్నీషియం  సమృద్ధిగా ఉంటుంది. ఇవి ఒత్తిడిని తగ్గించి మనస్సుకు ప్రశాంతత కలిగించడంలో తోడ్పడతాయి. రాత్రి  డార్క్ చాక్లెట్ తింటే నిద్ర మెరుగవుతుంది. దీనివల్ల గుండె ఆరోగ్యం, బరువు తగ్గుతారు. అదే విధంగా వాల్‌నట్స్ లోని ఒమెగా-3 కొవ్వులు మెదడు ఆరోగ్యాన్ని, గుండె పనితీరును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి. వాల్‌నట్స్‌ను గోరు వెచ్చని పాలలో కలిపి తినడం వల్ల నిద్ర కుదురుగా వస్తుంది.

ఇది కూడా చదవండి: వేసవి వేడికి అలసిపోయారా? ఈ నీరు తాగితే సమస్యలన్నీ పరార్

పసుపు పాలలో ఉండే కర్క్యూమిన్ అనే సమ్మేళనం శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి శరీరంలోని వాపులను తగ్గిస్తుంది. నిద్రకు ముందు గ్లాస్ గోరు వెచ్చని పాలలో చిటికెడు పసుపు కలిపి తాగడం వల్ల శరీరం రిలాక్స్ అవుతుంది, మంచి నిద్ర వస్తుంది. హర్బల్ టీలో ప్రశాంతత గుణాలు మనసును నిలకడగా ఉంచి నిద్రను ప్రేరేపిస్తాయి. రాత్రి పడుకునే ముందు  చమోమిలే టీ తాగితే ఒత్తిడి తగ్గి, నిద్ర నాణ్యత పెరుగుతుంది. ఈ ఆహారాలు, పానీయాలు రాత్రి ఆహారంలో తీసుకుంటే ఆరోగ్యం పరంగా అనేక లాభాలను  అందుతాయని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

( night-food | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news | telugu-news)

ఇది కూడా చదవండి:
నాభిలో నూనె రాయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు