Healthy Diet: తెల్లటి ఆహార పదార్థాలు విషమా లేక అమృతమా..!!

తెల్లని ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వలన జీవితకాలం తగ్గే అవకాశం ఉంది. రిఫైన్డ్ చక్కెర, తెల్ల బియ్యం, మైదా, ఉప్పు వంటి పదార్థాలు చర్మ సమస్యల నుంచి గుండె జబ్బులు, డయాబెటిస్, ఊబకాయం, క్యాన్సర్‌కు కూడా దోహదం చేయగలవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

New Update
White foods

White foods

నేటి వేగవంతమైన జీవనశైలిలో ప్రాసెస్ చేసిన ఆహారాల వినియోగం పెరిగింది. అయితే తెల్లగా కనిపించే కొన్ని ఆహారాలు ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో చాలా మందికి తెలియదు. రిఫైన్డ్ చక్కెర, తెల్ల బియ్యం, మైదా, ఉప్పు వంటి పదార్థాలు చర్మ సమస్యల నుంచి గుండె జబ్బులు, డయాబెటిస్, ఊబకాయం, క్యాన్సర్‌కు కూడా దోహదం చేయగలవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. డైటీషియన్ల అభిప్రాయం ప్రకారం.. తెల్లని ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వలన జీవితకాలం 10 సంవత్సరాల వరకు తగ్గే అవకాశం ఉందంటున్నారు. తెల్లటి ఆహారాలు శరీరానికి ఎందుకు విషంగా మారుతాయి..? ఆరోగ్యానికి ఎందుకు హాని కలిగిస్తుందో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

నివారించాల్సిన తెల్లని ఆహారాలు:

తెల్ల చక్కెర (White Sugar): చక్కెరలో ఎటువంటి పోషకాలు ఉండవు. దీనిని ఎంప్టీ కేలరీస్ అంటారు. ఇది డయాబెటిస్, కొవ్వు కాలేయం (Fatty Liver), ఇన్సులిన్ నిరోధకత, దంత సమస్యలకు కారణమవుతుంది. తెల్లటి చక్కెరకు బదులు బెల్లం, తేనె, కొబ్బరి చక్కెర వండితే ఆరోగ్యానికి మంచిది. 

 తెల్ల బియ్యం (White Rice): బియ్యం శుద్ధి ప్రక్రియలో పీచుపదార్థం (Fiber) ఖనిజాలు తొలగిపోతాయి. ఇది టైప్ 2 డయాబెటిస్, ఊబకాయం ప్రమాదాన్ని పెంచుతుంది. దీనికి బదులు బ్రౌన్ రైస్, రెడ్ రైస్, చిరుధాన్యాలు ఆరోగ్యానికి మంచి ఎంపిక అని చెబుతున్నారు.

ఉప్పు (Salt): అధిక ఉప్పు వినియోగం అధిక రక్తపోటు, ఎముకల బలహీనత, కడుపు పూతల ప్రమాదాన్ని పెంచుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అభిప్రాయం ప్రకారం.. రోజుకు గరిష్టంగా 5 గ్రాముల ఉప్పు మాత్రమే తీసుకోవాలి. తెల్ల ఉప్పు కంటే కళ్ల ఉప్పు (Rock Salt), హిమాలయన్ పింక్ సాల్ట్ వడుకుంటే మంచిది. 

ఇది కూడా చదవండి:  థ్రెడింగ్ ఇంకా వాక్సింగ్ మధ్య ఎంతో తేడా ఉంది.. అదేంటో మీరూ తెలుసుకోండి!!

రిఫైన్డ్ మైదా (Refined Flour): మైదాలో పీచుపదార్థాలు, విటమిన్లు, ఖనిజాలు ఉండవు. ఇది ట్రైగ్లిజరైడ్స్ను పెంచి.. మంచి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అయితే గోధుమ పిండి, మల్టీగ్రెయిన్ పిండి, ఓట్స్ పిండి తినటం ఆరోగ్యానికి మంచిది

తెల్ల ఆలుగడ్డలు (White Potatoes): ఆలు గడ్డలను డీప్ ఫ్రై చేసినా లేదా క్రీమ్/వెన్నతో కలిపి తీసుకున్నా హానికరం. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతుంది. చిలగడదుంపలు (Sweet Potatoes), కంద, పరిమితంగా ఉడికించిన ఆలు గడ్డలు. తింటే మంచిది. ఈ తెల్లని ఆహారాలలో పోషకాలు లోపించి.. అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. వీటిని తగ్గించడం ద్వారా జీవనశైలి సంబంధిత వ్యాధులను గణనీయంగా నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. 

ఇది కూడా చదవండి: చెమట కంపు కొండుతుందా.. అయితే ఈ రోగాలున్నాయేమో చెక్ చేసుకోండి!!

Advertisment
తాజా కథనాలు