/rtv/media/media_files/2025/08/09/sleeping-stomach-2025-08-09-19-32-10.jpg)
Sleeping Stomach
Sleeping Stomach: నేటి కాలంలో మంచి నిద్ర శరీరానికి, మనసుకు చాలా అవసరం. తగినంత నిద్ర మనల్ని తాజాగా, శక్తిమంతంగా ఉంచుతుంది. ఇది మెదడు పనితీరును, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. అలాగే రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. శరీరానికి సంబంధించిన అన్ని జీవక్రియలకు నిద్ర చాలా అవసరం. తగినంత నిద్ర లేకపోతే మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పడతాము. ఆరోగ్యవంతమైన జీవితానికి మంచి నిద్ర ఒక పునాదని చెప్పవచ్చు. శరీరానికి, మెదడుకు ఎంత ఆహారం ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం. కానీ నిద్రించే తప్పు పద్ధతులు ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా.. చాలా మందికి సౌకర్యంగా అనిపించే పొట్టపై పడుకోవడం అనేది శరీరంలోని అనేక భాగాలకు హానికరం. ఆ విషయాల గురించి కొన్ని ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
పొట్టపై పడుకోవడం వల్ల..
పొట్టపై పడుకోవడం వల్ల వెన్ను, మెడపై అసమాన ఒత్తిడి పడుతుంది. ఇది కండరాల ఒత్తిడి, నొప్పికి కారణమవుతుంది. ఈ భంగిమలో మెడ ఒకవైపుకు వంగి ఉంటుంది. ఇది దీర్ఘకాలిక నొప్పికి, బిగుసుకుపోవడానికి దారితీస్తుంది. పొట్టపై పడుకోవడం వల్ల ఊపిరితిత్తులు, డయాఫ్రమ్‌పై ఒత్తిడి పడుతుంది. దీనివల్ల శ్వాస పూర్తిగా, సౌకర్యంగా తీసుకోలేం. ఇది ఆక్సిజన్ సరఫరాను తగ్గిస్తుంది. ముఖ్యంగా ఉబ్బసం, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారికి ఇది చాలా ప్రమాదకరం. ఈ భంగిమలో పొట్ట ప్రేగులపై ఒత్తిడి పడటం వల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది, ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు పెరుగుతాయి. ముఖ్యంగా తిన్న వెంటనే పొట్టపై పడుకోవడం జీర్ణవ్యవస్థకు హానికరం.
ఇది కూడా చదవండి: నాలుకపై ఈ మార్పులు గమనించారా..?.. అనారోగ్య సంకేతాలను చూపిస్తుందట..!!
పొట్టపై పడుకోవడం వల్ల ముఖం దిండుకు నొక్కుకుపోయి, చెమట పట్టడం వల్ల ముడతలు, మొటిమలు, చర్మపు చికాకు పెరగవచ్చు. అయితే గర్భధారణ సమయంలో పొట్టపై పడుకోవడం తల్లికి, బిడ్డకు ఇద్దరికీ ప్రమాదకరం. ఇది గర్భంలోని బిడ్డపై ఒత్తిడిని పెంచుతుంది, రక్త ప్రవాహానికి ఆటంకం కలిగిస్తుంది. పొట్టపై పడుకోవడం వల్ల నరాలపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల చేతులు, కాళ్ళలో తిమ్మిరి, మొద్దుబారడం, బలహీనత వంటివి సంభవించవచ్చు. దీర్ఘకాలంలో ఇది నరాలకు కూడా నష్టం కలిగించవచ్చు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వీలైనంత వరకు పొట్టపై పడుకోవడం మానుకోవాలి. దీని బదులుగా వెల్లకిలా లేదా పక్కకు పడుకోవడం మంచిది. ఇది వెన్ను, మెడపై ఒత్తిడిని తగ్గించి.. మంచి నిద్రకు సహాయపడుతుంది. నిద్ర భంగిమను మార్చుకోవడం వల్ల ఆరోగ్యంపై సానుకూల ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ఆరోగ్యకరమైన చిరుతిండిలో ఆనారోగ్య ప్రమాదాలు.. ఈ రోగులు దూరంగా ఉంటే బెస్ట్..!!