Tongue: నాలుకపై ఈ మార్పులు గమనించారా..?.. అనారోగ్య సంకేతాలను చూపిస్తుందట..!!

నాలుక మీద వచ్చే రంగులు, పగుళ్లు, మచ్చలు, పుండ్లు వంటివి వివిధ వ్యాధులకు తొలి సంకేతాలుగా చెప్పవచ్చు. అవేమిటో తెలుసుకుని సరైన జాగ్రత్తలు తీసుకుంటే.. అనారోగ్యం రాకుండా ముందుగానే జాగ్రత్తపడవచ్చు. నాలుక రంగల గురించి ఇంకా తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లో వెళ్లండి.

New Update
Tongue

Tongue

మాట్లాడటానికి, రుచిని ఆస్వాదించడానికి నాలుక(Tounge) చాలా ముఖ్యమైనది. కానీ నాలుక ఆరోగ్యంగా ఉంటేనే ఇవి సాధ్యమవుతాయి.  నాలుక రంగులో, ఆకారంలో, ఆకృతిలో మార్పులను చూపిస్తుంది. ఈ మార్పులు శరీరంలో జరుగుతున్న అనేక ఆరోగ్య సమస్యలను(Health Problems), పోషకాల లోపాలను సూచిస్తాయి. నాలుక మీద వచ్చే రంగులు, పగుళ్లు, మచ్చలు, పుండ్లు వంటివి వివిధ వ్యాధులకు తొలి సంకేతాలుగా చెప్పవచ్చు. శరీరంలో కొన్ని మార్పులు గమనిస్తే.. వాటి ద్వారా శరీరంలో ఎదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయో లేదో తెలుసుకోవచ్చు. శరీరంలో కనిపించే మార్పులే ఆరోగ్య సమస్యలకు సంకేతాలుగా చెప్పవచ్చు. అలాంటి వాటిలో ఒకటి నాలుకలో కనిపించే మార్పులు. నాలుక రంగు, ఆకారం, దానిపై ఏర్పడే పొర శరీర ఆరోగ్య స్థితిని తెలియజేస్తాయి. ఆరోగ్యకరమైన నాలుక లేత, ముదురు గులాబీ రంగులో ఉంటుంది. కానీ దాని రంగులో అకస్మాత్తుగా మార్పు వస్తే.. అది అనారోగ్యానికి సంకేతం కావచ్చు. అవేమిటో తెలుసుకుని సరైన జాగ్రత్తలు తీసుకుంటే.. అనారోగ్యం రాకుండా ముందుగానే జాగ్రత్తపడవచ్చు. ఆ సంకేతాల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

అనారోగ్యాలకు సంకేతాలు:

నాలుక ఎర్రగా మారితే.. అది ఇన్ఫెక్షన్లు, జ్వరం, ఆందోళన లేదా విటమిన్ B లోపాన్ని సూచిస్తుంది. పాలిపోయిన నాలుక అనీమియా లేదా రక్తంలో పోషకాల లోపాన్ని సూచిస్తుంది. నీలం లేదా ఊదా రంగులో మారితే.. అది రక్త ప్రసరణ లోపం లేదా గుండె-ఊపిరితిత్తుల సమస్యలను సూచించవచ్చు. పసుపు రంగు నాలుక జీర్ణక్రియ లేదా కాలేయ సంబంధిత సమస్యలను సూచిస్తుంది. సాధారణంగా నాలుకపై తేలికపాటి పొర ఉంటుంది. కానీ అది మందంగా, రంగుతో లేదా మచ్చలు వంటి వాటితో కనిపిస్తే.. అది ఆరోగ్య సమస్యలకు సంకేతం. తెల్లటి పొర నోటిలోని థ్రష్ లేదా నీటి లోపాన్ని సూచిస్తుంది. పసుపు లేదా ఆకుపచ్చ పొర బ్యాక్టీరియా, జీర్ణ సమస్యలను సూచిస్తుంది. నల్లటి, వెంట్రుకల మాదిరిగా కనిపించే జిహ్వ పేలవమైన పరిశుభ్రత, ధూమపానం లేదా మందుల వాడకం వల్ల ఏర్పడుతుంది.

ఇది కూడా చదవండి: తప్పుడు ఫుడ్ కాంబినేషన్లతో జాగ్రత్త.. వీటిని కలిపి తింటే..!!

నాలుక ఉబ్బినట్లుగా లేదా సాధారణం కంటే పెద్దదిగా కనిపిస్తే.. అది అలర్జీ, ఇన్ఫెక్షన్ లేదా హార్మోన్ల సమస్యకు సంకేతం. నాలుకపై గుట్టలు కనిపించకుండా పోతే.. అది విటమిన్ B లేదా ఇనుము లోపాన్ని సూచిస్తుంది. నాలుక అంచులలో దంతాల గుర్తులు కనిపిస్తే.. అది ఒత్తిడి, థైరాయిడ్ సమస్య లేదా శరీరంలో నీరు నిలిచిపోయే సంకేతం కావచ్చు. నాలుకపై ఎర్రటి మచ్చలు, పుండ్లు లేదా గడ్డలు కనిపిస్తే.. అది ఇన్ఫెక్షన్లు, గాయం లేదా తీవ్రమైన వ్యాధి లక్షణంగా చెప్పవచ్చు. చాలా కాలం పాటు ఉండే మచ్చలు లేదా వాపును నిర్లక్ష్యం చేయకూడదు.. ఎందుకంటే అవి క్యాన్సర్ వంటి వ్యాధులతో సంబంధం కలిగి ఉంటాయి. నాలుకను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే.. ప్రతిరోజు బ్రష్ చేసేటప్పుడు నాలుకను కూడా శుభ్రం చేయాలి. ఎక్కువ నీరు తాగాలి, ధూమపానం మానేయాలి. విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ఎదైనా మార్పులు గమనిస్తే.. వెంటనే వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: చర్మంపై గడ్డలు ఉన్నాయా? అయితే ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దు

Advertisment
తాజా కథనాలు