Mahesh Babu: 'సైయారా'.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే పేరు వినిపిస్తోంది. జులై 18న ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. దాదాపు రూ. 60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రెండు రోజుల్లోనే రూ. 40 కోట్ల వసూళ్లు సాధించినట్లు ట్రెడ్ వర్గాల సమాచారం. దీన్ని బట్టి చూస్తే మరో వారాంతంలోపే 100 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమని అనిపిస్తోంది. 'ఆషిక్2' తర్వాత డైరెక్టర్ మోహిత్ కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ సాధించింది.
అలియా, మహేష్ బాబు ఫిదా!
ప్రేక్షకులతో పాటు సినీ తారలు సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ 'సైయారా' అద్భుతమైన సినిమా అంటూ సోషల్ మీడియా వేదికగా చిత్రబృందాన్ని, నటీనటులకు అభినందనలు తెలియజేసింది. అయితే తాజాగా సూపర్ మహేష్ బాబు కూడా సినిమాను అభినందించారు. కథ, నటీనటుల పర్ఫార్మెన్స్ బాగుందని తెలిపారు. అహాన్ పాండే, అనీత్ పద్ధా తమ పాత్రల్లో ఒదిగిపోయారని ప్రశంసలు కురిపించారు.
Take a bow #Saiyaara team…👏🏻👏🏻👏🏻
— Mahesh Babu (@urstrulyMahesh) July 20, 2025
What a beautifully made film with honest storytelling, standout performances and top notch execution….. Big love to #AhaanPanday & #AneetPadda for living their roles so effortlessly…
This one deserves all the love coming its way… ♥️♥️♥️…
రొమాంటిక్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో హీరో హీరోయిన్ ఇంటెన్స్ లవ్ స్టోరీ, ఎమోషనల్ సీన్స్, మ్యూజిక్ ప్రేక్షకులను ఫిదా చేస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగా 'కబీర్ సింగ్' సినిమాను గుర్తుచేస్తోందని, అదే తరహాలో యువతను ఆకట్టుకుంటోందని అంటున్నారు. ప్రేమ, బాధ, త్యాగం వంటి అంశాలను చాలా లోతుగా చూపించారు దర్శకుడు మోహిత్. డెబ్యూగా ఎంట్రీ ఇచ్చిన ఆహాన్.. సినిమాలో హీరోకు కావాల్సిన స్వాగ్, దురుసు స్వభావం, ఇంటెన్స్ ఎమోషన్స్ పండించడంలో సక్సెస్ అయ్యాడు. అలాగే అనీత్ పద్దా కూడా తన పాత్రతో మెప్పించింది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాకు మరో ప్లస్ పాయింట్ అయ్యింది. మ్యూజికల్ హిట్ గా పేరు పొందిన ఈ చిత్రానికి మిథూన్, సాచెట్-పరంపర, రిషబ్ కాంత్, విశాల్ మిశ్రా, తనిష్క్ బాగ్చి, ఫహీమ్ అబ్దుల్లా, అర్స్లాన్ నిజామి స్వరాలూ సమకూర్చారు.