/rtv/media/media_files/2025/03/29/healthyperson10-298230.jpeg)
Healthy person
అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని పదార్థాలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వంటింట్లో దొరికే ఈ చిన్న పదార్థాన్ని డైలీ తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు(Health Problems) కూడా రావని నిపుణులు అంటున్నారు. సాధారణంగా అందరి వంటింట్లో లవంగాలు ఉంటాయి. ఇందులోని ఔషధ గుణాలు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. లవంగాల్లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి అనేక వ్యాధులకు చికిత్స చేయడంలో సహాయపడతాయి. ఆయుర్వేదంలో కూడా లవంగాలు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉన్నాయి. ఔషధ గుణాలు అధికంగా ఉన్న ఈ మసాలా దినుసును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక తీవ్రమైన అనారోగ్య సమస్యలను నివారించవచ్చని నిపుణులు అంటున్నారు. దీన్ని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి(Immune Power) కూడా పెరుగుతుంది. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షనాలు, విటమిన్ E, విటమిన్ C, ఫోలేట్, రిబోఫ్లేవిన్, విటమిన్ A, థయామిన్, విటమిన్ D, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. డైలీ రాత్రిపూట రెండు లవంగాలను తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, గుండె పోటు వంటివి కూడా క్లియర్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూాడా చూడండి: Health Benefits: పెరుగు.. యోగర్ట్.. ఈ రెండింటి మధ్య తేడా ఏంటి? ఆరోగ్యానికి ఏది మంచిది?
కడుపు సమస్యలు
లవంగాలు(cloves) తినడం వల్ల మలబద్ధకం, ఆమ్లత్వం, గ్యాస్ వంటి కడుపు సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. లవంగాలు తినడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా మెరుగుపడుతుంది.
దుర్వాసన
మీ దంతాలలో పుండ్లు, దుర్వాసన ఉంటే లవంగాలు బాగా ఉపయోగపడతాయి. పడుకునే ముందు రెండు లవంగాలను నమలితే వీటి నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే పంటి నొప్పిని తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
తలనొప్పి
తలనొప్పి నుంచి ఉపశమనం పొందడానికి పడుకునే ముందు రెండు లవంగాలను నమలాలి. ఇందులోని పోషకాలు తలనొప్పిని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
జలుబు, దగ్గు
మీకు జలుబు, దగ్గు సమస్య ఎక్కువగా ఉంటే ప్రతి రాత్రి పడుకునే ముందు 2 లవంగాలు తినాలని నిపుణులు అంటున్నారు.
రోగనిరోధక శక్తి
రోగనిరోధక శక్తి చాలా బలహీనంగా ఉన్నవారు డైలీ దీన్ని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఇమ్యూనిటీ పవర్ తొందరగా పెరుగుతుందని చెబుతున్నారు.
వైరల్ ఇన్ఫెక్షన్
వైరల్ ఇన్ఫెక్షన్, బ్రోన్కైటిస్, సైనస్, ఉబ్బసం మొదలైన సమస్యల నుండి ఉపశమనం పొందడానికి మీరు ప్రతిరోజూ లవంగాలను తినాలి. రెండు లవంగాలను నమిలి ఆ తర్వాత గ్లాసు గోరువెచ్చని నీరు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా నమలలేని వారు లవంగాల పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకోవచ్చని నిపుణులు అంటున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూాడా చూడండి: Retinal Diseases: కళ్ళు మసకబారుతున్నాయా?.. పట్టించుకోకుండా ఉంటే కల్లుపోతాయి!!