Health Benefits: పెరుగు.. యోగర్ట్.. ఈ రెండింటి మధ్య తేడా ఏంటి? ఆరోగ్యానికి ఏది మంచిది?

పెరుగు, యోగర్ట్ రెండింటిలో కూడా పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని నిపుణులు అంటున్నారు. పెరుగులోని లాక్టోజ్ వల్ల కొందరికి అలర్జీ వస్తుంది. దీంతో వారు పెరుగుకు బదులు యోగర్ట్ తీసుకోవచ్చు.

New Update
Yogurt

Yogurt

పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే కొందరు పెరుగు ఉపయోగిస్తే.. మరికొందరు యోగర్ట్ వంటివి తీసుకుంటారు. చాలా మందికి పెరుగు వేరే, యోగర్ట్ వేరే అని విషయం తెలియదు. పెరుగునే ఇంగ్లీష్‌లో యోగర్ట్ అంటారని అనుకుంటారు. కానీ ఈ రెండు వేర్వేరు. రెండు పాల ఉత్పత్తులు అయినప్పటికీ కాస్త డిఫరెన్స్ ఉంది. అయితే ఈ రెండింటిలోనూ పోషకాలు ఉన్నాయి. మరి వీటి మధ్య ఉన్న తేడా ఏంటో చూద్దాం.

ఇది కూడా చూడండి: Memory Power: మధుమేహమే కాదు.. ఈ మూడు వ్యాధులు మీ జ్ఞాపకశక్తిని తినేస్తాయి తెలుసా..?

కాచిన పాలు చల్లారిన తర్వాత అందులో కాస్త పెరుగు వేస్తే కొన్ని గంటల్లోనే మొత్తం మారిపోతుంది. పెరుగులో ఉండే బ్యాక్టీరియా ఆ పాలను తినేసి పెరుగుగా మార్చేస్తుంది. మరికొందరు ఇందులో నిమ్మరసం, వెనిగర్ వంటివి వేస్తుంటారు. అదే యోగర్ట్ అయితే వేరే. దీన్ని ఇంటిలో తయారు చేయలేరు. కృత్రిమ యాసిడ్స్ కలిపి ఈ యోగర్ట్‌ను తయారు చేస్తారు. కాకపోతే పెరుగులో కంటే యోగర్ట్‌లో ఎక్కువ బ్యాక్టీరియాలు ఉంటాయి. దీని తయారీకి కూడా ప్రత్యేకమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఈ యోగర్ట్‌లో కూడా కొన్ని రకాలు ఉన్నాయి. గ్రీక్ స్టైల్ యోగర్ట్ అంటూ ఉంటాయి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. పెరుగు నచ్చని వారు ఈ గ్రీక్ యోగర్ట్ తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 

పెరుగు వల్ల అలర్జీ..

పెరుగులోని లాక్టోజ్ వల్ల కొందరికి అలర్జీ వస్తుంది. దీంతో వారు పెరుగుకు బదులు యోగర్ట్ తీసుకోవచ్చు. యోగర్ట్ పిల్లలకు బాగా నచ్చుతుంది. దీన్ని ప్యాక్స్‌లో అమ్ముతారు. అయితే ఈ రెండింటి వల్ల కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పెరుగు, యోగర్ట్‌లో పోషకాలు ఎక్కువగా ఉన్నాయి. పెరుగు శరీరాన్ని చలవ చేస్తుంది. దీంతో వేడిని తగ్గిస్తుంది. యోగర్ట్‌లో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కూడా శరీరానికి కావాల్సిన విటమిన్స్, మినరల్స్‌ను అందిస్తుంది. దీనివల్ల కీళ్ల సమస్యలు, అస్థియోపోరోసిస్, ఎముకల వంటి సమస్యలు రాకుండా చేస్తుంది. అయితే యోగర్ట్ వల్ల కాస్త బరువు పెరిగే అవకాశం ఉంది. కానీ ఇంకా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చూడండి: Health Tips: ముక్కు పొడిబారి ఊపిరి ఆడట్లేదా..? అయితే మీరు వినికిడి కోల్పోవచ్చు నిర్లక్ష్యం చేయకండి..!!

Advertisment
తాజా కథనాలు