Headache: ఈ చిట్కాలు పాటిస్తే.. క్షణాల్లో తలనొప్పి మాయం!

ఆకస్మిక తలనొప్పికి మందులు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో అల్లం రసం, నిమ్మరసం, దాల్చిన చెక్క నీరు తాగటం, లవంగాలు వాసన చూడటం, జాస్మిన్ ఫ్లవర్, మల్లె పూల టీ తాగటం వంటివి తీసుకోవటం వలన క్షణాల్లో ఉపశమనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

New Update
Headache

Headache

తలనొప్పి రావడం ఒక సాధారణ సమస్య. కానీ అది ఎవరికైనా వచ్చిన సమయంలో ఆ వ్యక్తి దృష్టి దానిపైనే మనసు ఉంటుంది. తలనొప్పికి అనేక కారణాలు ఉండవచ్చు. చాలా కాలంగా తలనొప్పితో బాధిస్తుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఈ నొప్పి అకస్మాత్తుగా వస్తే ఇంటి నివారణలతో చికిత్స చేయవచ్చు. ఆకస్మిక తలనొప్పికి మందులు తీసుకోవలసిన అవసరం లేదు. ఎటువంటి మందులు లేకుండా నొప్పి నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు. ఆ చిట్కాలు ఏంటో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

Also Read :  బరువు తగ్గాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే..ఈ వివరాలు మీ కోసమే!

తలనొప్పి నుంచి ఉపశమనం:

అకస్మాత్తుగా తలనొప్పి (Headache) వస్తే అల్లం  మంచిది. అల్లం రక్త నాళాలలో వాపును తగ్గిస్తుంది. తలనొప్పి నుంచి ఉపశమనం పొందడానికి అల్లం రసం, నిమ్మరసం సమాన పరిమాణంలో తీసుకొని వాటిని కలిపి తీసుకోవాలి. అల్లం ఎసెన్స్ ఉన్న మిఠాయిలను తినవచ్చు.  అల్లంను నీటిలో మరిగించి తాగవచ్చు. అంతేకాకుండా తలనొప్పి సమస్య ఉంటే దాల్చిన చెక్కతో తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. దాల్చిన చెక్కను పొడిలా చేసి.. ఈ పొడిలో కొంచెం నీరు కలిపి మందపాటి పేస్ట్ తయారు చేయాలి. ఆ పేస్ట్‌ని తలపై అప్లై చేసి 30 నిమిషాలు తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోకుంటే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఇది కూడా చదవండి: ఈ టిప్స్ పాటిస్తే ఎలాంటి మొటిమలైనా మాయం.. ఓ సారి ట్రై చేయండి!

తలనొప్పి సమస్య నుంచి బయటపడటానికి లవంగాలు సహాయపడతాయి. లవంగాలు నొప్పిని తగ్గించే లక్షణాలు ఉన్నాయి. తలనొప్పి నుంచి ఉపశమనం పొందడానికి.. కొన్ని లవంగాలను శుభ్రమైన గుడ్డలో కట్టి వాసన చూస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. మల్లె పూలు తలనొప్పి సమస్యను తగ్గిస్తాయి. జాస్మిన్ ఫ్లవర్ టీ చాలా మంచిది. అకస్మాత్తుగా తలనొప్పి వస్తే..  మల్లెపూల టీ తాగలి. దీనిలో రుచి కావాలంటే కొన్ని చుక్కల తేనెను కల్పవచ్చు.

Also Read :  ఈ చిట్కాలు పాటిస్తే.. మీ కంటి చూపు సేఫ్!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: బఠానీ తొక్కలు పారవేసే ముందు అద్భుత ప్రయోజనాలను తెలుసుకోండి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు