/rtv/media/media_files/2025/09/30/almond-2025-09-30-16-20-04.jpg)
Almond
బాదంపప్పు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన గింజల్లో ఒకటి. బాదంపప్పును తరచుగా స్నాక్‌గా తినడం, స్వీట్లు, సలాడ్లు, వివిధ వంటకాలలో ఉపయోగిస్తారు. ఇది విటమిన్ E, మెగ్నీషియం, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. క్రమం తప్పకుండా బాదంపప్పు తినడం వలన గుండె ఆరోగ్యం మెరుగుపడి.. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపు చేయటంతోపాటు బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. కేవలం రుచికే కాదు ఆరోగ్యానికి కూడా బాదంపప్పు ఎంతో మేలు చేస్తుంది. అయితే బాదంపప్పు ఆరోగ్యానికి చాలా మంచిదైనప్పటికీ.. వాటిని సరైన పద్ధతిలో తినకపోవడం, కొన్ని ఆహారాలతో కలిపి తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. బాదం తినే సరైన విధానం తెలియకపోతే.. అది ప్రయోజనం బదులు సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి బాదంతోపాటు ఏయే ఆహారాలను తీసుకోకూడదో తెలుసుకోవడం తప్పనిసరి. ఆ విషయాల గురించి కొన్ని ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
నూనె పదార్థాలు:
చిప్స్, డీప్ ఫ్రైడ్ స్నాక్స్ వంటి నూనెతో కూడిన ఆహారాలతో బాదంపప్పును ఎప్పుడూ తినకూడదు. ఇలా చేయడం వల్ల శరీరానికి ఎటువంటి పోషకాలు అందకపోగా హాని కలుగుతుంది. బాదంలోని ప్రయోజనాలు పొందాలంటే ఈ రెండింటి కలయికను పూర్తిగా నివారించాలి.
ఇది కూడా చదవండి: నల్లగా మారుతున్న చేతులను నార్మల్ రంగులోకి తెచ్చుకోవడానికి చిట్కాలు
టీ-కాఫీతో కలిపి:
చాలామంది వేయించిన బాదం పప్పులను టీ లేదా కాఫీతో కలిపి తినడానికి ఇష్టపడతారు. బాదంలో ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నీషియం ఉంటాయి. ఇవి మనసును ప్రశాంతపరుస్తాయి. కానీ వీటిని టీ, కాఫీతో కలిపి తీసుకుంటే.. ఆ పానీయాల ప్రభావం వల్ల నాడీ వ్యవస్థ ప్రేరేపించబడుతుంది. దీని వలన ఆందోళన (Anxiety), క్రమరహిత హృదయ స్పందన వంటి వివిధ ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు.
సిట్రస్ పండ్లు:
నారింజ, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లతో బాదంపప్పును కలిపి తినకూడదు. ఈ రెండింటి కలయిక కడుపు నొప్పి, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. సిట్రస్ పండ్లను తిన్న తర్వాత కనీసం గంట విరామం ఇచ్చి మాత్రమే బాదంపప్పును తినాలని నిపుణులు సూచిస్తున్నారు. గుండెపోటు రాకుండా ఉండాలంటే.. బాదంపప్పును సరైన పద్ధతిలో తీసుకోవడం ముఖ్యం. ఎల్లప్పుడూ సరైన ఆహార నియమాలను పాటించాలి. ఆరోగ్యానికి సంబంధించిన ఏ విషయంపైనైనా చర్యలు తీసుకునే ముందు డాక్టర్‌ను లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: పొద్దున్నే ఇలా చేయండి.. మొటిమలు.. మచ్చలను తగ్గించుకోండి