/rtv/media/media_files/2025/09/29/pimples-2025-09-29-19-40-07.jpg)
pimples
మనిషి ఆరోగ్యానికి, జీర్ణక్రియకు లాలాజలం చాలా ముఖ్యం. మన నోటిలో ఉండే ఈ ద్రవం లాలాజల గ్రంథుల నుంచి ఉత్పత్తి అవుతుంది. ఇది కేవలం నోటిని పొడిగా ఉండకుండా కాపాడటమే కాదు.. మనం తీసుకునే ఆహారాన్ని మెత్తగా మార్చి.. దాన్ని సులభంగా మింగడానికి సహాయపడుతుంది. లాలాజలంలో ఉండే ఎంజైములు జీర్ణక్రియను నోటిలోనే ప్రారంభిస్తాయి. ముఖ్యంగా పిండి పదార్థాలను ఇది చిన్న భాగాలుగా విడగొట్టుతుంది. లాలాజలం నోటి ఆరోగ్యాన్ని కాపాడుతూ.. బ్యాక్టీరియా పెరుగుదలను అడ్డుకుంటుంది. దీనివల్ల దంతాలు, చిగుళ్ళ సమస్యలు రాకుండా ఉంటాయి. లాలాజలం జీర్ణ వ్యవస్థకు ముఖ్యమైన రక్షకుడు, సహాయకారి లాంటిది. ఉదయం లాలాజలంతో మొటిమల సమస్య తగ్గుతుందట. ఆ విషయాల గురించి కొన్ని ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
లాలాజలం క్రీమ్‌లా..
శరీరంలో ఉత్పన్నమయ్యే అనేక సమస్యలకు నోటిలోని లాలాజలం (Saliva) ఒక అద్భుత ఔషధంలా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. సుమారు 8.4 pH విలువ కలిగిన ఈ లాలాజలంలో 18 ముఖ్యమైన పోషకాలు ఉన్నాయట. ఉదయం నిద్ర లేవగానే వచ్చే మొదటి లాలాజలం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఉదయం లాలాజలాన్ని కళ్లకు పెట్టుకుంటే కంటి చూపు మెరుగవుతుంది. దుమ్ము కారణంగా కళ్లు ఎర్రబడితే ఉపశమనం లభిస్తుంది. మొటిమలు (Acne), మచ్చలు, కళ్ల కింద నల్లటి వలయాలు (Dark Circles) వంటివాటికి ఈ లాలాజలం క్రీమ్‌లా పనిచేస్తుందని చెబుతున్నారు. పాత గాయాలపై దీనిని రాస్తే త్వరగా మానేందుకు ఉపకరిస్తుంది.
ఇది కూడా చదవండి:ముక్కు పొడిబారి ఊపిరి ఆడట్లేదా..? అయితే మీరు వినికిడి కోల్పోవచ్చు నిర్లక్ష్యం చేయకండి..!!
అంతేకాకుండా ఉదయం లాలాజలాన్ని మింగడం ద్వారా ఎగ్జిమా, సోరియాసిస్, గ్యాంగ్రీన్, జీర్ణకోశ సమస్యలు వంటివి నయమవుతాయని చెబుతున్నారు. ఉదయం బ్రష్ చేసేటప్పుడు కూడా దీనిని ఉమ్మకుండా ఉండటం దంత ఆరోగ్యం, జీర్ణకోశ సమస్యలకు మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. లాలాజలాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచేందుకు వేప పుల్ల (Neem toothbrush) వాడటం ఉత్తమం. మన శరీరమే తనకు వచ్చే కొన్ని వ్యాధులను నయం చేసుకునే శక్తిని కలిగి ఉందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: పండ్లు ఏ సమయంలో తినాలి? ఏ సమయంలో తినొద్దు?