/rtv/media/media_files/2025/09/12/walking-2025-09-12-15-56-48.jpg)
walking
వాకింగ్ అనేది అత్యంత సులభమైన, అత్యంత ప్రభావవంతమైన వ్యాయామాలలో ఒకటి. ఇది శారీరక, మానసిక ఆరోగ్యానికి చాలా మంచిది. రోజూ వాకింగ్ చేయడం వల్ల బరువు తగ్గడం, గుండె ఆరోగ్యం మెరుగుపడడం, ఒత్తిడి తగ్గడం వంటి ప్రయోజనాలు పొందవచ్చు. ఇది అన్ని వయసుల వారికీ అనుకూలమైనది. వాకింగ్ అనేది ఒక సహజమైన, సులభమైన వ్యాయామం అయినప్పటికి ఇది శరీరాన్ని చురుగ్గా ఉంచడమే కాకుండా.. అనేక తీవ్రమైన వ్యాధుల నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది. అయితే చాలామంది నడిచేటప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. దీనివల్ల నడక వల్ల లభించే పూర్తి ప్రయోజనాలు అందవు. దీనిపై ప్రముఖ ఆరోగ్య నిపుణులు కొన్ని ముఖ్యమైన విషయాలను వెల్లడిస్తున్నారు. సరైన పద్ధతులు పాటించకపోతే నడక కూడా ఆరోగ్యానికి హాని కలిగించవచ్చని వారు హెచ్చరించారు. అయితే వాకింగ్ సరైన పద్ధతులో చేయపోతే ఏం జరుగుతుందో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
వాకింగ్‌లో చేయకుడని తప్పులు:
చాలామంది వాకింగ్‌ను కేవలం ఆదరాబాదరా లేకుండా నడవడంలా భావిస్తారు. అయితే ఫిట్‌నెస్ కోసం నడిచేటప్పుడు వేగం చాలా ముఖ్యం. అతి నెమ్మదిగా నడవడం వల్ల కేలరీలు అంతగా కరిగిపోవు. గుండె, ఊపిరితిత్తులకు కూడా సరైన వ్యాయామం లభించదు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. నడిచేటప్పుడు మీ వేగం ఎలా ఉండాలంటే.. మీరు సులభంగా మాట్లాడగలిగినప్పటికీ.. మీ శ్వాస కొద్దిగా వేగంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా మనం తరచుగా ఫోన్ చూస్తూనో, తల వంచుకొనినో నడుస్తూ ఉంటాం. దీనివల్ల వెన్ను, మెడ నొప్పి సమస్యలు పెరుగుతాయి. నడిచేటప్పుడు శరీరాన్ని నిటారుగా ఉంచడం చాలా అవసరం. మీ కళ్ళు ఎదురుగా ఉండాలి, భుజాలు రిలాక్స్‌డ్‌గా ఉంచుకోవాలి. ఈ పద్ధతి సరైన ఆక్సిజన్ ప్రవాహానికి సహాయపడటమే కాకుండా.. మిమ్మల్ని మరింత చురుగ్గా, ఆత్మవిశ్వాసంతో చూపిస్తుంది.
ఇది కూడా చదవండి: జ్ఞాపకాలు బాధిస్తూ ఉంటే ఇలా ఉపశమనం పొందండి
మరొక సాధారణ పొరపాటు, సౌకర్యవంతమైన బూట్లు ధరించకపోవడం. హైహీల్స్ లేదా గట్టి సోల్స్ ఉన్న బూట్లు ధరించి నడిస్తే పాదాలు, మడమలలో నొప్పి రావచ్చు. అందుకే మంచి గ్రిప్ ఉన్న తేలికైన స్పోర్ట్స్ షూస్‌ను ఉపయోగించడం మంచిది. దీనివల్ల నడక ఆనందంగా ఉంటుంది. ఆరోగ్యంపైనా దుష్ప్రభావం పడదు. కొందరు ఉదయాన్నే ఏమీ తినకుండానే నడకకు వెళ్తారు. మరికొందరు తిన్న వెంటనే నడవడం మొదలుపెడతారు. ఈ రెండూ సరైనవి కావు. ఖాళీ కడుపుతో నడిస్తే త్వరగా అలసిపోవడం, శక్తి కోల్పోవడం జరుగుతుంది. అదేవిధంగా అతిగా తిన్న తర్వాత నడిస్తే కడుపు బరువుగా అనిపించి, గ్యాస్ట్రిక్ సమస్యలు రావొచ్చు. అందుకుని నడకకు ముందు తర్వాత స్ట్రెచింగ్ చేయడం చాలా ముఖ్యం. ఇది కండరాలను రిలాక్స్ చేసి గాయాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. స్ట్రెచింగ్ చేయకుండా నడిస్తే కాళ్ళలో బిగుసుకుపోవడం, కండరాల నొప్పి వంటి సమస్యలు ఎదురుకావచ్చు. ఈ సాధారణ చిట్కాలను పాటించడం ద్వారా నడకను ఒక పూర్తి స్థాయి ఆరోగ్యకరమైన వ్యాయామంగా మార్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి:షాకింగ్ న్యూస్.. ఫోన్ ఎక్కువగా చూసే పిల్లలకు గుండె పోటు.. ఎందుకో తెలుసా..?