Salt: ఉప్పు తెచ్చే తిప్పలు.. వామ్మో ఇంత ప్రమాదమా!

ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు పెరగడంతో పాటు గుండె పోటు వస్తుంది. అలాగే కిడ్నీలో రాళ్ల సమస్యలు కూడా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజుకి 5 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తీసుకుంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు చెబుతున్నారు.

New Update
Salt

Salt Photograph: (Salt)

ఉప్పు అందరి ఇంట్లో తప్పకుండా ఉంటుంది. ఇది లేకపోతే అసలు వండిన వంటలు టేస్టీగా కూడా ఉండవు. అయితే అధిక ఉప్పు అనారోగ్య సమస్యలకు (Health Problems) కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. రోజుకి 5 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల రక్తపోటు, గుండె పోటు, మూత్రపిండాలు దెబ్బతినడం వంటివి అన్ని కూడా వస్తాయని నిపుణులు అంటున్నారు. అధికంగా ఉప్పు తీసుకుంటే రక్తం గడ్డకడుతుంది. అలాగే ధమనులపై ఒత్తిడిని కూడా పెంచుతుంది. ఇది గుండె సమస్యలకు కారణం అవుతుంది. శరీరంలో సోడియం స్థాయిలు కాస్త లిమిట్‌గానే ఉండాలి. మరీ ఎక్కువ అయితే ఆక్సీకరణ పెరిగి ఒత్తిడిని ప్రేరేపిస్తుంది. 

ఇది కూడా చూడండి: Papaya Side Effects: వీరు పొరపాటున బొప్పాయి తింటే.. సమస్య పెరగడం ఖాయం

దీర్ఘకాలిక సమస్యలతో..

సోడియం ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రపిండాలు దెబ్బతింటాయి. రక్తంలో సోడియం స్థాయిలు ఎక్కువగా ఉంటే హైపర్‌ నాట్రేమియా వస్తుంది. ఇది మూత్రపిండాలపై ఒత్తిడిని పెంచుతుంది. దీంతో దీర్ఘకాలికంగా మూత్రపిండాల సమస్యలతో బాధపడతారు. అలాగే మూత్రపిండాల్లో రాళ్లు కూడా ఏర్పడతాయి.

ఉప్పు (Salt) ఎక్కువగా తీసుకోకూడదని.. తక్కువగా కూడా తీసుకోకూడదు. తక్కువగా ఉప్పు తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్‌కి గురి కావడంతో కండరాలు అన్ని బలహీనంగా మారిపోతాయి. కాబట్టి ఎక్కువగా కాదు.. అలా అని తక్కువగా కాకుండా లిమిట్‌లో తీసుకోండి. ఈ సమస్యల బారిన పడకుండా ఉండాలంటే పోషకాలు ఉండే పదార్థాలను తీసుకోవాలి. అలాగే ప్రాసెస్ చేసిన ఫుడ్ తినాలి. ఉప్పును తక్కువగా తీసుకోవాలి. 

ఇది కూడా చూడండి:  Air Pollution: వాయు కాలుష్యంతో చిన్నపిల్లల్లో బ్రెయిన్ సమస్యలు .. తాజా అధ్యయనాల్లో షాకింగ్ విషయాలు !

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చూడండి: Dengue: బొప్పాయి ఆకులు నిజంగానే ప్లేట్లెట్స్ ను పెంచుతాయా? సైన్స్ ఏం చెబుతోంది?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు