Immunity Booster: బలం, ఆరోగ్యం ఇచ్చే ఆహారపదార్ధాల జాబితా

సమతుల్య ఆహారం రోగనిరోధక శక్తికి పునాది. శరీర రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. అయితే ధాన్యాలు, ఆకుపచ్చ కూరగాయలు, కాలానుగుణ పండ్లు, పప్పులు, ఉసిరి, నారింజ, నిమ్మ వంటి విటమిన్ సి అధికంగా ఉన్న పండ్లు ఆహారంలో చేర్చుకుంటే మంచిదని నిపుణులు అంటున్నారు.

New Update
Immunity Booster

Immunity Booster

నేటి వేగవంతమైన.. ఒత్తిడితో కూడిన జీవనంలో రోగనిరోధక శక్తిని (Immune System) బలంగా ఉంచుకోవడం అత్యంత కీలకం. మారుతున్న వాతావరణం, కాలుష్యం, అనారోగ్యకరమైన ఆహారం, నిద్ర లేమి వంటి కారణాల వల్ల రోగనిరోధక వ్యవస్థ బలహీనపడి, త్వరగా అంటువ్యాధులకు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. జలుబు, ఫ్లూ, అలర్జీల వంటి సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ పొందడానికి, మందులు లేకుండానే జీవనశైలి, ఆహారపు అలవాట్లలో కొన్ని సరళమైన మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. సహజంగా రోగనిరోధక శక్తిని పెంచే చిట్కాల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

రోగనిరోధక శక్తి పెంచే శక్తివంతమైన సహజ పదార్థాలు:

శరీరం వైరస్‌లు, బ్యాక్టీరియాలతో పోరాడే సామర్థ్యాన్ని పెంచడానికి రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటల గాఢ నిద్ర అవసరం. ఇది శరీరంలోని T-కణాలను ప్రేరేపిస్తుంది. అతేకాకుండా సమతుల్య ఆహారం రోగనిరోధక శక్తికి పునాది. శరీర రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. అయితే ధాన్యాలు, ఆకుపచ్చ కూరగాయలు, కాలానుగుణ పండ్లు, పప్పులు ఆహారంలో చేర్చుకుంటే మంచిదని వైద్యులు అంటున్నారు. ఇంకా ఉసిరి, నారింజ, నిమ్మ వంటి విటమిన్ సి అధికంగా ఉన్న పండ్లు తెల్ల రక్త కణాలను క్రియాశీలం చేస్తాయి. గుమ్మడి గింజలు, వేరుశెనగ వంటి జింక్ సమృద్ధిగా ఉన్న ఆహారాలు ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణనిస్తాయంటున్నా. అయితే  ప్రతిరోజూ 15-20 నిమిషాల పాటు సూర్యరశ్మికి ఉండటం ద్వారా విటమిన్ డి లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: ఈ డైట్ ప్లాన్ ఒకే రోజు ట్రై చేయండి.. శరీరంలోని అన్ని మలినాలను తరిమి కొడుతుంది

ఉసిరి, పసుపు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు. పసుపులోని కర్కుమిన్ రోగనిరోధక కణాలను క్రియాశీలం చేస్తే.. వెల్లుల్లిలోని అల్లిసిన్ వైరస్‌లు, బ్యాక్టీరియాల నుంచి రక్షణ ఇస్తుంది. అల్లం వాపును తగ్గిస్తుంది. పెరుగు, పులియబెట్టిన ఆహారాలలో ఉండే ప్రోబయోటిక్స్ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇది రోగనిరోధక వ్యవస్థకు మొదటి రక్షణగా చెబుతారు. గ్రీన్ టీ కూడా వైరస్‌లను నిష్క్రియం చేయడంలో సహాయపడుతుంది. యోగ, ప్రాణాయామం చేయడం, ధ్యానం ద్వారా ఒత్తిడిని తగ్గించడం, పుష్కలంగా నీరు త్రాగడం, ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండటం వంటి సాధారణ జీవనశైలి మార్పులు సహజంగా రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: క్రీమ్ బిస్కెట్లు తింటే ఖతమే.. షాకింగ్ న్యూస్!

Advertisment
తాజా కథనాలు