/rtv/media/media_files/2025/10/11/spinach-with-paneer-2025-10-11-07-46-01.jpg)
palak paneer
ఆరోగ్యానికి అత్యంత ప్రయోజనకరమైన ఆహారాలలో పనీర్ ఒకటి. ఇందులో ప్రోటీన్, కాల్షియం వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే కొన్ని ఆహార పదార్థాలతో కలిపి పనీర్‌ను తీసుకోవడం హానికరం కావచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అటువంటి వాటిలో పాలకూర (Spinach) కూడా ఒకటి. సాధారణంగా భారతీయ వంటకాల్లో ప్రసిద్ధి చెందిన పాలక్ పనీర్ (Palak Paneer) కాంబినేషన్ ఆరోగ్యానికి అంత మంచిది కాదంటున్నారు నిపుణులు. దీనికి గల ప్రధాన కారణాల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
పోషకాల శోషణలో సమస్య:
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పనీర్‌లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో పాలకూరలో ఐరన్ (ఇనుము) సమృద్ధిగా ఉంటుంది. ఈ రెండు పోషకాలను శరీరం ఒకేసారి సమర్థవంతంగా గ్రహించలేదు (Absorb). కాల్షియం ఎక్కువగా ఉన్నప్పుడు.. అది ఐరన్ శోషణకు ఆటంకం కలిగిస్తుంది. దీనివల్ల శరీరానికి ఈ రెండింటి ప్రయోజనాలు పూర్తిగా అందవు. పాలక్ పనీర్‌ను కలిపి తీసుకోవడం జీర్ణవ్యవస్థకు కూడా హానికరం కావచ్చు. కాల్షియం, ఐరన్ రెండింటినీ ఒకేసారి జీర్ణం చేయడం కష్టం. దీని వలన అసిడిటీ, విరేచనాలు (Diarrhea), మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దీర్ఘకాలంలో ఇది మరింత తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి:గుప్పెడు మొలకెత్తిన ధాన్యం.. బొడ్డు చుట్టూ కొవ్వు మాయం!!
ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల శరీరం ఐరన్‌ను సరిగా గ్రహించలేదు. దీని ఫలితంగా శరీరంలో ఐరన్ లోపం ఏర్పడి.. హిమోగ్లోబిన్ స్థాయిలు ప్రభావితం కావచ్చు. ఇది రక్తహీనతకు దారితీయవచ్చు. పాలకూరలో ఆక్సాలిక్ యాసిడ్ ఉంటుంది.. పనీర్‌లో కాల్షియం ఉంటుంది. ఈ రెండూ కలిసినప్పుడు ఆక్సాలిక్ యాసిడ్ కాల్షియంతో చర్య జరిపి శరీరంలో కిడ్నీలో రాళ్లు (Kidney Stones) ఏర్పడటానికి ప్రధాన కారణం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఈ సమస్యలన్నిటినీ నివారించడానికి పాలకూర, పనీర్‌ను ఒకే భోజనంలో కాకుండా వాటిని వేరు వేరు సమయాల్లో తీసుకోవడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి:ఉదయం ఖాళీ కడుపుతో ఈ గింజల పొడి తీసుకుంటే.. అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం