/rtv/media/media_files/2024/12/24/skincare1.jpeg)
Skincare
Skin Glow:దీపావళి పండగ(Diwali 2025) కి ముఖం అందంగా మెరిసిపోవాలని అమ్మాయిలు కోరుకుంటారు. దీనికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కేవలం ఒక్కరోజులోనే ముఖం మెరిసిపోవాలని చూస్తారు. మేకప్ వంటివి లేకుండా ముఖం కాంతివంతంగా మారుతుందని నిపుణులు అంటున్నారు. అయతే కొన్ని నిమిషాల వ్యవధిలోనే ముఖం కాంతివంతంగా మారాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలి? ఫేస్‌కు ఎలాంటి ప్యాక్ వేయాలి? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
ఐస్ క్యూబ్స్ ముఖానికి అప్లై చేస్తే..
బీట్‌రూట్(beetroot) ను నేరుగా ముఖానికి రుద్దడం కంటే, దాన్ని ఐస్ క్యూబ్స్(ice-cubes) రూపంలో తయారుచేసి వాడితే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు అంటున్నారు. దీని కోసం ముందుగా బీట్‌రూట్‌ను చిన్న ముక్కలుగా కట్ చేసి, నీళ్లు కలపకుండా మెత్తని పేస్ట్ చేసుకోవాలి. రసం తీసి అందులో పాల మీగడ, కలబంద, తేనె వంటివి కలపాలి. దీన్ని ఐస్ క్యూబ్ ట్రేలో వేసి నైట్ అంతా ఫ్రిడ్జ్‌లో ఉంచాలి. ఆ తర్వాత ఐస్ క్యూబ్స్ రెడీ అవుతాయి. వీటిని డైలీ ముఖానికి రెండు నిమిషాల పాటు మసాజ్ చేయాలని నిపుణులు అంటున్నారు. ఇలా మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుందని నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చూడండి: Hair Care: హెయిర్ స్పాకి వెళ్ళేముందు ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.. లేదంటే మీ జుట్టు సంగతి అంతే!!
ఐస్ చల్లదనం వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోయి, చర్మం బిగుతుగా మారుతుంది. దీంతో ముఖంపై వాపు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే బీట్ రూట్ ఐస్ క్యూబ్స్‌ను ముఖంపై మసాజ్ చేసిన తర్వాత మళ్లీ మాయిశ్చరైజర్ రాసుకోవాలి. దీనివల్ల ముఖానికి సహజమైన మెరుపు వస్తుంది. అలాగే ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు వంటి సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై ముడతలు రాకుండా యంగ్ లుక్‌లో ఉండేలా చేస్తాయని నిపుణులు అంటున్నారు. ఇందులో మీరు ఉపయోగించిన తేనె, కలబంద జెల్ చర్మంలో తేమను నిలిపి ఉంచి, పొడిబారకుండా కాపాడతాయని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: Early Morning: ఉదయాన్నే ఈ గ్రీన్స్ తీసుకుంటే.. ఆరోగ్యపరంగా ఉన్న ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు!
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.