/rtv/media/media_files/2025/10/17/uttar-pradesh-woman-arrested-for-marrying-multiple-men-2025-10-17-16-10-59.jpg)
Uttar Pradesh Woman Arrested For Marrying Multiple Men
ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు పెళ్లిళ్ల పేరుతో భారీ మోసానికి పాల్పడ్డారు. పలువురు వ్యక్తులను పెళ్లి చేసుకొని.. ఆ తర్వాత డబ్బులు, నగలతో పారిపోయారు. వాళ్ల తండ్రి కూడా ఈ మోసానికి సహకరించాడు. ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఆ కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని సికర్ జిల్లాకు చెందిన తారాచంద్ జాట్ అనే వ్యక్తిని గతేడాది మే నెలలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన భగత్ సింగ్ అనే వ్యక్తి కలిశాడు.
తారాచంద్‌కు భన్వర్ లాల్, శంకర్‌లాల్ ఇద్దరు కుమారులు ఉన్నారు. భగత్ సింగ్‌కు కాజల్, తమన్నా అనే ఇద్దరు కుమార్తెలతో పాటు కొడుకు సూరజ్ ఉన్నారు. అయితే ఈ రెండు కుటుంబాల మధ్య పెళ్లి కుదిరింది. పెళ్లి ఖర్చుల కోసం తారాచంద్ నుంచి భగత్ సింగ్ రూ.11 లక్షలు తీసుకున్నాడు. అయితే గతేడాది మే 21వ తేదీన భగత్ సింగ్, తన భార్య సరోజ్, కొడుకు సూరజ్‌తో పాటు ఇద్దరు కుమార్తెలతో కలిసి ఓ అతిథి గృహానికి చేరుకున్నారు. అక్కడ తారాచంద్ తన కొడుకలతో వారికి పెళ్లి జరిపించాడు.
Also Read: దీపావళిపై ఆంక్షలు.. అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తత!
వివాహం తర్వాత వాళ్లందరూ రెండ్రోజుల పాటు తారాచంద్ ఇంట్లోనే ఉన్నారు. ఇక మూడో రోజు ఆ ఇంట్లో నుంచి డబ్బు, నగలు తీసుకొని పారిపోయారు. దీంతో తారాచంద్ కుటుంబం స్థానిక పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు డిసెంబర్ 18న భగత్ సింగ్, అతడి భార్య సరోజ్‌ను అరెస్టు చేశారు. మోసపూరితంగా వీళ్లు పెళ్లిళ్లు నిర్వహించే రాకెట్ నడుపుతున్నట్లు గుర్తించారు. కూతురు తమన్నా, కాజల్, కొడుకు సూరజ్‌ను కూడా అరెస్టు చేశారు.
Also Read: హెచ్ 1బీ వీసా ఫీజుల విషయంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోర్టులో సవాల్
తండ్రి భగత్ సింగ్ పెళ్లిళ్ల పేరుతో మోసపూరిత నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసినట్లు కాజల్ విచారణలో తెలిపింది. పలువురు వ్యక్తులను ఊరికే పెళ్లిళ్లు చేసుకొని మోసగించి డబ్బు, నగలతో పారిపోయినట్లు పేర్కొంది. మరోవైపు మోసపోయిన బాధితుల గురించి ఆరాతీస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ నెట్‌వర్క్‌కు సంబంధించి మిగతా నిందితుల ఆచూకి కోసం వెతుకున్నట్లు స్పష్టం చేశారు.