Early Morning: ఉదయాన్నే ఈ గ్రీన్స్‌ తీసుకుంటే.. ఆరోగ్యపరంగా ఉన్న ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు!

ప్రస్తుతం రోజుల్లో చాలా మంది ఎక్కువగా గ్రీన్స్ తీసుకుంటున్నారు. అంటే ఆకు కూరలు, కూరగాయలు, అన్ని కలిపి జ్యూస్ తయారు చేసి తీసుకుంటారు. వీటిని పొడి చేసుకుని తాగడం కంటే ఫ్రెష్‌గా జ్యూస్ చేసుకుని తాగడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

New Update
Greens

Greens Benefits

ఆరోగ్యంగా ఉండాలని చాలా మంది విటమిన్లు, పోషకాలు ఉండే వాటిని తీసుకుంటున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే ఆకు కూరలు ఎక్కువగా తీసుకోవాలి. వీటివల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటారని నిపుణులు అంటున్నారు. అయితే ప్రస్తుతం రోజుల్లో చాలా మంది ఎక్కువగా గ్రీన్స్ తీసుకుంటున్నారు. అంటే ఆకు కూరలు, కూరగాయలు, అన్ని కలిపి జ్యూస్ తయారు చేసి తీసుకుంటారు. ఇందులో గోధుమ గడ్డి, తులసి, మునగ, అకై బెర్రీ ఇలా రకరకాలు ఉన్నాయి. వీటిని కొందరు అప్పుటికప్పుడే జ్యూస్ చేసి తాగుతారు. మరికొందరు పొడి చేసుకుని ఉదయాన్నే పరగడుపున తాగుతారు. అయితే వీటిని ఎలా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదో ఈ స్టోరీలో చూద్దాం. 

ఇది కూడా చూడండి: Health Tips: రాత్రి ఆలస్యంగా తినొద్దు.. అనారోగ్యం బారిన పడొద్దు.. ఎలానో ఇప్పుడే తెలుసుకోండి!!

పొడి కంటే తాజావి తీసుకోవాలని..

గ్రీన్స్ ఆరోగ్యానికి మంచివే. తాజా కూరగాయలతో ఫ్రెష్‌గా తయారు చేసుకుంటే ఆరోగ్యానికి ప్రయోజనాలు ఉంటాయి. ఇందులోని పోషకాలు, ప్రొటీన్స్ అన్ని కూడా ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా చేస్తుందని నిపుణులు అంటున్నారు. అదే పొడుల రూపంలో అయితే వాటిని ఎండబెట్టడం వల్ల అందులోని సహజ పోషకాలు అన్ని కూడా పోతాయి. ముఖ్యంగా ఫైబర్, పీచు అంతా తగ్గిపోతుంది. దీనివల్ల శరీరానికి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉండవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కూరగాయలు, పండ్లు వంటివి తాజాగా తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. అయితే పౌడర్ అయితే ఎక్కడికి వెళ్లినా ఈజీగా క్యారీ చేయవచ్చు. విటమిన్ల లోపం కూడా తగ్గుతుంది. చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. అయితే పొడి కంటే ఫ్రెష్‌గా తయారు చేసే జ్యూస్‌ను తీసుకోవడం బెటర్ అని నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చూడండి: Diwali 2025: దీపావళి వేళ మార్కెట్లో భారీగా నకిలీ పనీర్.. ఈ సింపుల్ చిట్కాతో ఇట్టే గుర్తు పట్టండి!!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు