/rtv/media/media_files/2025/04/18/xw0npfkDNol1r1WmdyWP.jpg)
coconut flower
Coconut Flower: వేసవి కాలంలో ఆహారం విషయంలో మనం జాగ్రత్త వహించాలి. కొబ్బరి తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందని చాలా మంది అనుకుంటారు. అసలు విషయం ఏమిటంటే కొబ్బరిని మితంగా తీసుకుంటే అది ఆరోగ్యానికి హానికరం కాదు. కొబ్బరిలో ఉండే కొవ్వు రకాలు వేరుగా ఉండటం వల్ల ఇవి శరీరాన్ని దెబ్బతీయవు. దీనిలో ఉండే మీడియం-చైన్ ట్రైగ్లిజరైడ్స్ శరీరంలో వేగంగా జీర్ణమై శక్తిగా మారుతాయి. ఇవి మిగిలిన కొవ్వులా శరీరంలో పేరుకుపోకుండా శక్తి రూపంలో ఉపయోగపడతాయి. అలాగే కొబ్బరిలో ఉన్న కొవ్వు చాలా తక్కువ మోతాదులో గుండె ఆరోగ్యానికి సహాయకరమని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:
అయితే ఇన్సులిన్ సున్నితత తగ్గినవారికి లేదా డయాబెటిస్ ఉన్నవారికి కొలెస్ట్రాల్ నియంత్రణ అత్యంత ముఖ్యం. ఈ పరిస్థితుల్లో శరీరం లోపల కొవ్వు నిల్వలు అధికంగా మారే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాలి. కొలెస్ట్రాల్ ఇది శరీరంలో మూడు రకాలుగా ఉంటుంది. HDL, LDL, ట్రైగ్లిసరైడ్స్. మంచి కొలెస్ట్రాల్ మన గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, చెడు కొలెస్ట్రాల్ అధికమైతే గుండె నాళాల మూసుకుపోవడం వంటివి జరుగుతాయి. వీటిని నియంత్రించటాలంటే శారీరక శ్రమ, సమతుల్య ఆహారం, తక్కువ ట్రాన్స్ ఫ్యాట్స్ తీసుకోవడం అవసరం.
ఇది కూడా చదవండి: వేసవిలో రాగులు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదేనా?
స్నాక్స్, ఫాస్ట్ ఫుడ్, వేయించిన పదార్థాల్లో ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉండటంతో అవి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. వాటి తినడాన్ని తగ్గించాలి. అంతేకాదు కొలెస్ట్రాల్ రోజువారీ మొత్తం శరీర అవసరాల్లో 5 శాతాన్ని మించకూడదు అనే నిబంధనను గుర్తుంచుకోవాలి. కొబ్బరి తినడం మంచిదే కానీ ఏ పదార్థం అయినా మితిమీరిన వినియోగం శరీరానికి శాపంగా మారవచ్చు. కాబట్టి కొబ్బరి మితంగా వాడితే వేసవిలో శరీరానికి శక్తిని ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: మీకు మాట్లాడుతూ భోజనం చేసే అలవాటు ఉందా?.. ఈ 5 షాకింగ్ విషయాలు తప్పక తెలుసుకోండి!
( health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news )