Pancreatic Cancer: ఈ క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ కంటే ప్రమాదకరం

ప్రాణాలను తీసే భయంకరమైన వ్యాధిలో క్యాన్సర్ ఒకటి. మెదడు, రక్త, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ అత్యంత ప్రమాదకరమైనవిగా చెబుతారు. వీటి కంటే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ప్రమాదకరమైనది. తొలి లక్షణాలు కడుపునొప్పి, అజీర్ణం, అలసట ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

New Update

Pancreatic Cancer: క్యాన్సర్ అనే మాట వినగానే చాలా మంది భయపడతారు. ఇది ప్రాణాలను తీసే భయంకరమైన వ్యాధిగా పరిగణించబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో జీవితాలను హరించే ఈ వ్యాధిలో పలు రకాలున్నాయి. మెదడు క్యాన్సర్, రక్త క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్‌లను చాలా మంది అత్యంత ప్రమాదకరమైనవిగా భావిస్తారు. అయితే వాటిని మించిపోయే స్థాయిలో ప్రమాదకరమైనది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్. ఇది చాలా త్వరగా ప్రబలిపోతుంది కానీ ప్రారంభ దశలో లక్షణాలు బయటపడవు. దీంతో దీన్ని గుర్తించడం చాలా కష్టం అవుతుంది. ఈ క్యాన్సర్ ప్యాంక్రియాస్ అనే అవయవాన్ని ప్రభావితం చేస్తుంది.

అకస్మాత్తుగా బరువు తగ్గడం..

దీని తొలి లక్షణాలు సాధారణ కడుపునొప్పి, అజీర్ణం, అలసటలా కనిపిస్తాయి. వీటిని చాలా మంది సామాన్య సమస్యలుగానే భావించి నిర్లక్ష్యం చేస్తారు. కానీ ఇది చాలా వేగంగా పురోగమించే క్యాన్సర్. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు ఎక్కువగా ధూమపానం చేసే వారు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకునే వారు, కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర ఉన్నవారు, శారీరక శ్రమ తక్కువగా చేసే వారిలో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. పై కడుపు భాగంలో నిరంతర నొప్పి, ఆకలి తగ్గిపోవడం, అకస్మాత్తుగా బరువు తగ్గడం, కామెర్లు, తేలికపాటి జ్వరం, అలసట, ఆకలిగా ఉన్నా తినాలన్న ఆసక్తి లేకపోవడం, ముదురు రంగు మూత్రం, లేత మలం వంటివి లక్షణాలుగా కనిపించవచ్చు.

ఇది కూడా చదవండి: కారులో ఈ వస్తువులు ఉంచితే కాలిపోవడం గ్యారంటీ

ఈ లక్షణాలను గుర్తించే సమయానికి ఇది 3వ లేదా 4వ దశకు చేరిపోతుంది. అప్పటికే శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించిన తర్వాత చికిత్స ప్రారంభమవుతుంది. ముఖ్యంగా కాలేయం, ఊపిరితిత్తులు, కడుపు చుట్టూ ఇది వేగంగా విస్తరిస్తుంది. దీనివల్ల బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. 5 సంవత్సరాల గడువు దాటే వారి శాతం 10శాతం కన్నా తక్కువే. కాబట్టి నిత్యం ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం, ధూమపానం, మద్యం మానేసి శారీరక శ్రమను అలవాటు చేసుకోవడం ఎంతో అవసరం. ముఖ్యంగా కడుపు సంబంధిత సమస్యలను తేలికగా తీసుకోకుండా వెంటనే వైద్య సలహా తీసుకోవాలి.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: కొబ్బరి తింటారా..? కొవ్వు కంట్రోల్‌లో ఉంటుందా?

( blood-cancer | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news )

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు