Diabetes: డయాబెటిస్ ఉన్నవారు ORS తాగవచ్చా..?

ORS శరీరానికి తక్షణ శక్తి ఇస్తుంది. ORSలో చక్కెర రక్తంలో షుగర్ స్థాయిని పెంచుతుంది. ఇది మధుమేహ బాధితులకు అనేక రకాల సమస్యలను తెచ్చిపెడుతుంది. మధుమేహ రోగులకు తయారు చేసిన షుగర్ లేని ORSను తీసుకోవాలి. ఇంట్లో చక్కర లేకుండా ఓఆర్ఎస్ చేసుకుని తీసుకోవాలంటున్నారు.

New Update

Diabetes: శరీరంలో నీటి శాతం తగ్గిపోయినప్పుడు, ముఖ్యంగా వేసవిలో వాంతులు, విరేచనాలు, చెమటల వల్ల నీరు, ఎలక్ట్రోలైట్లు కోల్పోవడం వల్ల నిర్జలీకరణం సంభవిస్తుంది. అలాంటి సమయంలో వైద్యులు తరచూ ORS తాగమని సిఫార్సు చేస్తారు. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తూ అలసటను తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే మధుమేహం ఉన్నవారికి ORS తాగడం సురక్షితమేనా అన్న ప్రశ్న చాలా మందిలో ఉంది. ఎందుకంటే సాధారణంగా అందుబాటులో ఉండే ORSలో చక్కెర ఉండటం వల్ల అది రక్తంలో షుగర్ స్థాయిని పెంచే ప్రమాదం ఉంది.

మధుమేహ రోగులకు అనేక రకాల సమస్యలు:

ఇది మధుమేహ బాధితులకు అనేక రకాల సమస్యలను తెచ్చిపెడుతుంది. డయాబెటిస్ ఉన్నవారికి సాధారణ ORS కాకుండా ప్రత్యేకంగా మధుమేహ రోగులకు తయారు చేసిన షుగర్ లేని ORS ను తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మార్కెట్లో ఇవి అందుబాటులో లేకపోతే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఒక గ్లాసు నీటిలో కొద్దిగా ఉప్పు, కొద్దిగా నిమ్మరసం కలిపి తాగితే అదే సహజ ORS లాగా పనిచేస్తుంది. కొబ్బరి నీళ్లు కూడా మంచి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడతాయి, ఎందుకంటే ఇందులో సహజ ఎలక్ట్రో లైట్లు ఉంటాయి.

ఇది కూడా చదవండి: ఈ క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ కంటే ప్రమాదకరం

అయితే ఇవన్నీ చేయడంలో ముందుగా వైద్యుడి సలహా తీసుకోవడం చాలా అవసరం. ఏమైనా తీసుకునే ముందు మీ బ్లడ్ షుగర్ లెవెల్ తనిఖీ చేయించుకోవాలి. డయాబెటిస్ ఉన్నవారికి సాధారణ ORS మంచి ఎంపిక కాదు. ఇది తాగడం వల్ల షుగర్ లెవెల్ పెరిగి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. కాబట్టి డయాబెటిక్ ఫ్రెండ్లీ ORS లేకపోతే ఇంట్లో తయారు చేసుకునే సహజ మార్గాలపై ఆధారపడటం ఉత్తమం.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: డయాబెటిస్ ఉన్నవారు చెరకు రసం తాగవచ్చా? అది సురక్షితమో కాదో తెలుసుకోండి

( health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | diabetes-health-tips | latest-news )

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు