Weight Loss: బరువు తగ్గాలని ప్లాన్ చేస్తున్నారా.. ఈ రొట్టేలు తినండి

ఈజీగా బరువు తగ్గాలంటే రాగులు, జొన్నలు, సజ్జలు, గోధుమలతో కలిపి తయారు చేసిన చపాతీలను తినాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులోని పోషకాలు ఫిట్‌గా ఉండేలా చేస్తాయి. ఇవి బాడీలోని చెడు కొలెస్ట్రాల్‌ను బయటకు పంపడంలో ముఖ్య పాత్ర వహిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

New Update
weight loss3

weight loss

ప్రస్తుత కాలంలో చాలా మంది ఊబకాయం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్ల వల్ల చాలా బాడీలో కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. పూర్వ కాలంలో సజ్జలు, రాగులు, జొన్నలతో తయారు చేసిన ఆహార పదార్థాలను ఎక్కువగా తినేవారు. వీటివల్ల ఎక్కువ కాలం కూడా జీవించేవారు. ప్రస్తుతం రోజుల్లో అయితే ఇలాంటి ఆహార పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. అయితే కొందరు బరువు తగ్గాలని జిమ్ చేయడం, మెడిసిన్ వంటివి వాడుతున్నారు. వీటివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటికి బదులు రాగులు, జొన్నలతో తయారు చేసిన పదార్థాలను తినడం వల్ల ఈజీగా బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి ఎలాగో ఈ స్టోరీలో చూద్దాం. 

ఇది కూడా చూడండి: Champions Trophy 2025 : టీమిండియాకు బిగ్ షాక్ .. బుమ్రా ఔట్!

రక్తహీనత నుంచి విముక్తి..

గోధుమలు, జొన్నలు, రాగులు అన్ని కలిపి ఉన్న పిండితో చపాతీలు తయారు చేసుకుని తింటే ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆహారం ఈజీగా జీర్ణం అయ్యేలా చేస్తాయి. దీంతో తొందరగా బరువు పెరగరు. మల్ట్రీ గ్రెయిన్ పిండిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మలబద్ధకం వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. అలాగే ఇందులోని ఐరన్ రక్తహీనత సమస్య నుంచి విముక్తి కలిగేలా చేస్తుంది. కొందరిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అలాంటి వారు డైలీ వీటిని తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారు. వీటిలో ఉండే నియాసిన్, థయామిన్, రిబోఫ్లోవిన్, బీ-కాంప్లెక్స్, విటమిన్స్ శరీర శక్తిని పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. 

ఇది కూడా చూడండి: పిల్లల తలపై భోగి పళ్ళు పోయడానికి కారణమేంటి.. పురాణాలలో ఈ కథ గురించి తెలుసా?

జొన్నల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది మధుమేహం రాకుండా చేస్తుంది. అలాగే గుండె సమస్యలు రాకుండా కూడా కాపాడుతుంది. వీటిలో ఐరన్, మెగ్నీషియం, కాపర్, కాల్షియం, జింక్, విటమిన్ బీ3 వంటివి ఉంటాయి. ఇవి ఎముకలు బలంగా ఉండేలా చేస్తాయి. రోజు వీటితో తయారు చేసిన రొట్టేలు తీసుకోవడం వల్ల అజీర్ణం, గ్యాస్‌, అసిడిటీ వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. 

ఇది కూడా చూడండి: Sankranthi Muggulu 2025: భోగి పండగకు ఈజీగా కుండల డిజైన్స్ .. 5 నిమిషాల్లోనే వేయిండిలా!

Advertisment
తాజా కథనాలు