/rtv/media/media_files/2025/10/14/covid-2025-10-14-19-38-17.jpg)
COVID-19: మగాళ్ల గుండెల్లో గుబులు రేపే వార్త వెలువడింది. ముఖ్యంగా రొమాన్స్‌పై ఆసక్తిచూపే పురుషులకు షాక్ ఇచ్చే న్యూస్ వెల్లడించారు వైద్యులు. COVID-19 పురుషాధిక్యతపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు తెలిపారు. తాజాగా నిర్వహించిన సర్వేలో వీర్యకణాలు బలహీనపడుతున్నట్లు గుర్తించారు. అంతేకాదు కోవిడ్ బారిన పడిన మగాళ్లకు పుట్టబోయే బిడ్డలపై ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉండబోతుందని తాజా పరిశోధనలు నిర్ధారించాయి.
టీకాల ఎఫెక్ట్..
కరోనా వైరస్.. అది సోకిన వ్యక్తిపై మాత్రమే కాకుండా అతని పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యంతోపాటు ప్రవర్తనను కూడా ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు. ఈ ప్రపంచం COVID-19 మహమ్మారితో పోరాడుతున్నప్పుడు ఎక్కువ మంది దృష్టి ఇన్ఫెక్షన్ నివారణతోపాటు చికిత్స టీకాలపైనే కేంద్రీకరించారు. కానీ ఇప్పుడు అదే రాబోయే తరాలను దెబ్బతీస్తుందని, పరిశోధనల్లో ఆశ్చర్యకరమైన ప్రభావాలు కనుగొన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
Also Read : ఎవరి వల్ల కానిది 'బాహుబలి: ది ఎపిక్' రీరిలీజ్ తో జరుగుతోంది.. ఏంటో తెలిస్తే..!
స్పెర్మ్‌లో మార్పులు..
రీసెంట్‌గా ఆస్ట్రేలియాలోని ఫ్లోరీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూరోసైన్స్ అండ్ మెంటల్ హెల్త్‌లో నిర్వహించిన ఒక అధ్యయనంలో.. COVID-19 ఇన్ఫెక్షన్ పురుషుల స్పెర్మ్(sperm) లో మార్పులకు కారణమవుతుందని వెల్లడైంది. ఇది పిల్లల మెదడు అభివృద్ధి, ప్రవర్తనను ప్రభావితం చేస్తుందని తెలిపింది. పరిశోధన ప్రకారం గర్భధారణకు ముందు ఇన్ఫెక్షన్ సంభవిస్తే ఆరోగ్యంగా పుట్టిన బిడ్డలపై కూడా నెమ్మదిగా ఎఫెక్టు చూపుతుందని పేర్కొంది. ఈ వైరస్ సోకిన తర్వాత పురుషుల స్పెర్మ్‌లోని RNAలు, ముఖ్యంగా నాన్-కోడింగ్ RNAలు మారుతాయని పరిశోధకులు కనుగొన్నారు. ఈ జన్యువులు శరీర పెరుగుదల, ప్రవర్తనపై ఎఫ్టెక్ట్ చూపిస్తాయి. దీనిని శాస్త్రీయ పరిభాషలో ఎపిజెనెటిక్ మార్పులు అంటారట.
పరిశోధన ఏం చెబుతోంది?
ఫ్లోరీ శాస్త్రవేత్తలు ఎలుకలపై ఒక ప్రయోగం నిర్వహించారు. మొదట మగ ఎలుకలకు SARS-CoV-2 సోకేలా చేసి ఆ ఇన్ఫెక్షన్ నుంచి పూర్తిగా కోలుకోవడానికి వీలు కల్పించారు. తర్వాత వాటిని ఆరోగ్యకరమైన ఆడ ఎలుకలతో ఉంచారు. ఈ వైరస్ సోకిన మగ ఎలుకల ప్రవర్తన వైరస్ సోకని ఎలుకల కంటే ఎక్కువ ఆందోళనకరమైనదిగా కనిపించిందని చెప్పారు. అంతేకాదు వాటికి పుట్టిన పిల్లల ప్రవర్తన కూడా మిగతా వాటికంటే భిన్నంగా ఉందని, లైంగిక సంపర్కంలోనూ వాటి సామర్థ్యం తక్కువేనని వెల్లడించారు.
Also Read : శ్రీలీల షాకింగ్ సర్ప్రైజ్! ఎవరీ 'ఏజెంట్ మిర్చి'..?
COVID-19 నుంచి కోలుకున్న పురుషుల స్పెర్మ్‌ను పరిశీలిస్తే.. ఇది మిలియన్ల కుటుంబాలను ప్రభావితం చేస్తుందని ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది COVID-19 బారిన పడ్డారు. దీనిని శ్వాసకోశ వ్యాధిగా మాత్రమే కాకుండా మానవ పునరుత్పత్తి, భవిష్యత్ తరాల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపే వైరస్‌గా కూడా చూడాల్సిఉంటుందని వైద్యనిపుణులు అంటున్నారు.