Sreeleela: శ్రీలీల షాకింగ్ సర్ప్రైజ్! ఎవరీ 'ఏజెంట్ మిర్చి'..?

శ్రీలీల తాజాగా "ఏజెంట్ మిర్చి" అనే స్టైలిష్ లుక్‌తో ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చింది. బ్లాక్ అవుట్‌ఫిట్, గన్‌తో ఆమె పోస్టర్ వైరల్ అవుతోంది. అక్టోబర్ 19న అసలు సీక్రెట్ బయటపడనుందని హింట్ ఇచ్చింది. ఇది ఓ హిందీ ప్రాజెక్ట్ కావచ్చని టాక్ నడుస్తోంది.

New Update
Sreeleela

Sreeleela

Sreeleela: టాలీవుడ్‌లో ఇప్పుడు బిజీగా ఉన్న యంగ్ హీరోయిన్‌లలో శ్రీలీల టాప్ ప్లేస్‌లో ఉంది. స్టార్ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ, సక్సెస్- ఫ్లాప్‌లకీ లెక్కచెయ్యకుండా కెరీర్‌ను జెట్ స్పీడ్‌తో నడిపిస్తూ వస్తోంది. అయితే తాజాగా ఆమెపై ఓ క్రేజీ అప్‌డేట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

సినిమానా..? వెబ్ సిరీసా..? 

శ్రీలీల తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్టైలిష్ పోస్టర్ షేర్ చేసింది. ఇందులో ఆమె “ఏజెంట్ మిర్చి”(Agent Mirchi) లుక్‌లో కనిపించింది. బ్లాక్ కాస్ట్యూమ్, గోగుల్స్, చేతిలో గన్ పట్టుకుని ఉన్న శ్రీలీల స్టైల్ చూసి ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇది సినిమాకి సంబంధించిన పోస్టరా? లేక వెబ్ సిరీస్ ప్రోమోషనా? అనే చర్చలు మొదలయ్యాయి.

ఇంకా ఆసక్తికరంగా.. శ్రీలీల ఆ పోస్టర్‌తో పాటు "అక్టోబర్ 19న అసలు సీక్రెట్ బయటపడుతుంది" అంటూ క్యాప్షన్ పెట్టింది. దీంతో ఆ రోజు ఏం రాబోతోందోనని ఫ్యాన్స్ కౌంట్‌డౌన్ మొదలు పెట్టేశారు.

ఇదిలా ఉండగా, ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఇది ఓ హిందీ ప్రాజెక్ట్ అయ్యే అవకాశం ఉందట. పాన్ ఇండియా స్థాయిలో శ్రీలీల ఈ ప్రాజెక్ట్‌తో అడుగుపెడుతోందని, ఇది ఆమె కెరీర్‌కు కీలక మలుపు కావచ్చని టాక్. ఇటీవలే శ్రీలీలకు తెలుగు చిత్రాలతో పాటు తమిళం, కన్నడ, హిందీ నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయని సమాచారం. అలాంటిది ఏజెంట్ మిర్చి లుక్‌తో ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందా? అనే ఉత్కంఠ పెరిగింది.

ఫ్యాన్స్ మాత్రం ఈ లుక్‌కి ఫిదా అవుతూ, ఆమె ఓ యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తుందేమోనని గెస్ కొడుతున్నారు. గతంలో శ్రీలీలను ఎక్కువగా లవ్, ఫ్యామిలీ డ్రామాల పాత్రల్లో చూసిన ప్రేక్షకులకు ఇది ఒక కొత్త షేడే అని చెప్పాలి. ఇంతకీ “ఏజెంట్ మిర్చి” రహస్యం ఏంటి? అక్టోబర్ 19న ఏం జరుగబోతోంది? అన్నది త్వరలోనే తెలుస్తుంది.

Advertisment
తాజా కథనాలు