/rtv/media/media_files/2025/10/09/baahubali-2025-10-09-13-50-54.jpg)
Baahubali
Baahubali The Epic: ఇప్పుడు ప్రీమియం ఫార్మాట్లలో సినిమాలు చూడాలనే ఆడియన్స్ సంఖ్య పెరిగింది. IMAX, డాల్బీ విజన్, 4DX లాంటి ఫార్మాట్లలో టికెట్ల ధరలు ఎక్కువైనా, కొత్త అనుభూతిని కోరుతూ ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. కానీ ఈ మెగా ఫార్మాట్లలో సినిమా అందించడం అనేది చాలా కష్టం, ముఖ్యంగా పాన్-ఇండియా సినిమాల విషయంలో.
ఈ పరిస్థితుల్లో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి(SS Rajamouli) మరోసారి తన మ్యాజిక్ చూపించేందుకు సిద్ధమయ్యారు. మహేష్ బాబుతో చేస్తున్న తన తదుపరి గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ ప్రాజెక్ట్‌కు ముందుగా, ‘బాహుబలి’ను ఓ కొత్త అవతారంలో మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
Also Read : శ్రీలీల షాకింగ్ సర్ప్రైజ్! ఎవరీ 'ఏజెంట్ మిర్చి'..?
బాహుబలి: ది ఎపిక్..
‘బాహుబలి: ది బిగినింగ్’ మరియు ‘బాహుబలి 2: ది కన్‌క్లూజన్’ అనే రెండు భాగాలను ఒకే సినిమాగా మిక్స్ చేసి, కొత్తగా ఎడిట్ చేసి “బాహుబలి: ది ఎపిక్”గా తీసుకువస్తున్నారు. ఇది అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఈసారి ప్రేక్షకులకు మరింత గ్రాండ్ అనుభూతిని అందించేందుకు, ఈ సినిమా IMAX, డాల్బీ సినిమా, 4DX, DBox, EpiQ, ICE, PCX వంటి పలు పెద్ద తెర ఫార్మాట్లలో రిలీజ్ అవుతుంది. పాన్ ఇండియా సినిమాల్లో చాలా అరుదుగా ఇన్ని ఫార్మాట్లలో ఒకే సమయంలో రిలీజ్ చేయడం జరుగుతుంది.
ఈ రీ-కట్ వెర్షన్‌ను అన్ని ఫార్మాట్లకు టైం మీదగా అందించడం ఓ పెద్ద ఛాలెంజ్ అని నిర్మాత శోభు యార్లగడ్డ ట్వీట్‌లో తెలిపారు. అన్నపూర్ణ స్టూడియోస్ సహకారంతో అన్ని ఫార్మాట్లకు సమయానికి కంటెంట్ అందించేందుకు కష్టపడుతున్నట్టు చెప్పారు.
- దర్శకుడు: ఎస్.ఎస్. రాజమౌళి
- నటీనటులు: ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా
- నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని
- సంగీతం: ఎం.ఎం. కీరవాణి
గతంలో ఈ సినిమాతో చరిత్ర సృష్టించిన రాజమౌళి, ఇప్పుడు ఈ రీ-రిలీజ్‌తో మరోసారి ప్రేక్షకులను బాహుబలి మాయాజాలం తీసుకువెళ్లనున్నారు. అక్టోబర్ 31ను మీ డైరీలో నోట్ చేసుకోండి ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావొద్దు..!
Also Read : వాడో అమ్మాయిల పిచ్చోడు.. కిందేసి తొక్కేస్తా! పికిల్స్ పాప, దువ్వాడ మాధురి గుసగుసలు!