/rtv/media/media_files/2025/08/03/corn-silk-tea-2025-08-03-09-12-14.jpg)
Corn Silk Tea
ఈ జీవనశైలిలో కొన్ని అలవాట్లు భాగమై పోయాయి. అలాంటి వాటిలో టీ ఒకటి. ప్రతీ ఉదయం కప్పు టీతో రోజు ప్రారంభం అవుతుంది. దేశవ్యాప్తంగా టీ తాగే అలవాటు ఎంతో మందికి ఉంటుంది. ఉదయం నిద్ర లేవగానే నూతనోత్తేజం కోసం టీ తప్పనిసరి. టీలోని కెఫీన్ మెదడును ఉత్తేజపరచి.. ఏకాగ్రతను పెంచుతుంది. ఇది శరీరాన్ని చురుకుగా మార్చడమే కాకుండా, మానసికంగా కూడా ప్రశాంతతను చేకూరుస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. టీలో ఎన్నో రకాలు ఉంటాయి. తాజాగా మొక్కజొన్న పీచు టీ ట్రెండ్ అవుతుంది.
కార్న్ సిల్క్ టీ..
వర్షాకాలంలో మొక్కజొన్న రుచి మాటల్లో చెప్పలేము. చల్లని వాతావరణంలో వేడివేడి మొక్కజొన్న తింటే మనసుకు ఎంతో హాయిని ఇస్తుంది. ఈ సీజన్‌లో మొక్కజొన్న ( Corn) రుచికరమైనదే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అయితే సాధారణంగా పారవేసే మొక్కజొన్నలో పీచుతో టీని తయారు చేసుకోవచ్చు. టీ మూత్రపిండాల్లో రాళ్లు వంటి బాధాకరమైన వ్యాధులను పూర్తిగా నయం చేస్తుంది. సాధారణంగా దీన్ని ఒలిచి చెత్తబుట్టలో పడేస్తుంటాం. కానీ ఆయుర్వేదం, ఆధునిక వైద్యం రెండూ దీని అద్భుతమైన గుణాలను గుర్తించింది. మొక్కజొన్న పీచుతో తయారు చేసిన టీ (Corn silk tea) మూత్రపిండాల్లో రాళ్లను కరిగించి వాపును తగ్గించి, మూత్ర విసర్జనను మెరుగుపరుస్తుంది. మొక్కజొన్న కంకి ఆకుపచ్చని ఆకుల లోపల దాగి ఉండే పీచు భాగమే కార్న్ సిల్క్. ఇది లేత పసుపు, గోధుమ రంగు దారాల వలె కనిపిస్తుంది. వీటిని శుభ్రం చేసి.. ఆరబెట్టి మరిగించి టీగా తాగుతారు.
ఇది కూడా చదవండి: వర్షాకాలంలో క్యారెట్ జ్యూస్ తాగడానికి సరైన సమయం ఇదే..!!
ఒక గ్లాసు నీటిలో 1 టీస్పూన్ మొక్కజొన్న పీచును వేయాలి. దీన్ని 7 నిమిషాల పాటు మరిగించి.. వడపోసి గోరువెచ్చగా తాగాలి. కావాలంటే రుచి కోసం కొద్దిగా తేనె కలుపుకోవచ్చు. కార్న్ సిల్క్ టీలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి మూత్రపిండాలలో వాపు, చికాకును తగ్గిస్తాయి. ఈ టీ కాల్షియం, ఆక్సలేట్ వంటి మూలకాలు పేరుకుపోకుండా నిరోధించడం ద్వారా భవిష్యత్తులో రాళ్లు ఏర్పడే అవకాశాలను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. రోజుకు ఒకసారి గోరు వెచ్చని కార్న్ సిల్క్ టీని తాగవచ్చు. దీనిని 2 నుంచి 3 వారాల పాటు ఉపయోగించవచ్చు. అయితే.. వైద్య సలహా తప్పనిసరి. నొప్పి తీవ్రంగా ఉన్నా లేదా మూత్రంలో రక్తం వచ్చినా వెంటనే డాక్టర్లని సంప్రదించాలి. మూత్రపిండాల్లో రాళ్లకు మందులు ఖరీదైనవి, చాలా నొప్పిని కలిగిస్తాయి. కానీ మొక్కజొన్న పీచుతో తయారు చేసిన కార్న్ సిల్క్ టీ సహజమైన, చవకైన, దుష్ప్రభావాలు లేని ఉత్తమ నివారణ మార్గం. ఇది కీడ్నీ రోగులకు చాలా ఉపశమనాన్ని ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి:ఈ అలవాట్ల ఉంటే యవ్వనంలోనే చర్మంపై ముడతలు.. వయస్సు కాక మరో కారణాలు ఇవే
( Latest News | Health Tips | health tips in telugu | latest health tips | best-health-tips)