/rtv/media/media_files/2025/08/02/carrot-juice-2025-08-02-07-44-52.jpg)
Carrot Juice
Carrot Juice: వర్షాకాలం తాజాదనంతోపాటు చల్లదనాన్ని తీసుకువస్తుంది. ఈ సీజన్‌లో అనేక వ్యాధులు వస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో ఆహారంపై ఎక్కువ శ్రద్ద పెట్టాలి. మారుతున్న వాతావరణంలో కొందరూ వేడివేడి ఆహారాలు తింటారు. వాటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవు. అవి రోగనిరోధక శక్తిని కూడా పెంచవు. వర్షాకాలంలో శరీరాన్ని లోపలి నుంచి బలోపేతం చేయడంతోపాటు రోగనిరోధక శక్తి చాలా ముఖ్యం. అలాంటి సమయంలో క్యారెట్ రసం చాలా బాగ పని చేస్తుంది. ఈ జ్యూస్‌ని ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేసే సూపర్ డ్రింక్ అని కూడా అంటారు. ప్రతీరోజూ ఉదయం దీనిని తాగితే శరీరానికి ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వార్షాకాలంలో క్యారెట్ జ్యూస్ ఏ సమయంలో తాగాలి..? దాని కలిగే ప్రయోజనాల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
వర్షాకాలంలో క్యారెట్ జ్యూస్ తాగితే..
క్యారెట్లలో రోజూ తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. క్యారెట్లలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు శరీర వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుంది. వర్షాకాలంలో ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం అధికంగా ఉంటాయి. కాబట్టి బలమైన రోగనిరోధక శక్తి కావాలంటే క్యారెట్లను తినాలన నిపుణులు చెబుతున్నారు. క్యారెస చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది. క్యారెట్ రసం చర్మాన్ని డీటాక్సిఫై చేసి మొటిమలు, దద్దుర్లు వంటి సమస్యలను తగ్గిస్తుంది. వర్షాకాలంలోచర్మం జిడ్డుగా, నిర్జీవంగా ఉంటే క్యారెట్ చర్మాన్ని లోపలి నుంచి శుభ్రపరుస్తుందని చర్మ నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: వ్యాయామంతో మానసిక ఆరోగ్యం మెరుగు.. దాని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా..?
క్యారెట్లలో విటమిన్ ఎ కంటి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. తేమ, బలహీనమైన కాంతి కారణంగా.. కళ్ళలో చికాకు, దృష్టి మసకబారడం వంటి సాధారణ సమస్య ఎక్కువగా వస్తూ ఉంటాయి. క్యారెట్లలో మంచి ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఈ సీజన్‌లో చెడు ఆహారం, నీరు జీర్ణక్రియకు అంతరాయం కలిగిస్తాయి. అటువంటి సమయంలో క్యారెట్లు ఎక్కువగా సహాయపడతాయి. క్యారెట్ జ్యూస్ కాలేయాన్ని శుభ్రపరిచి శరీరం నుంచి విషాన్ని తొలగిస్తుంది. వర్షాకాలంలోఎక్కువగా వేయించిన, బయటి ఆహారాలు తింటారు. దీని వలన శరీరానికి డీటాక్స్ కావాలంటే క్యారెట్ జ్యూస్ మేలు చేస్తుంది. క్యారెట్ జ్యూస్ తాగడానికి సరైన సమయం ఉదయం. దీనిని ఖాళీ కడుపుతో తాగితే అనేక ప్రయోజనాలు అందుతాయి. దీనిలో కొంచెం అల్లం, నిమ్మకాయ కలిపి తాగినా మంచి రుచితోపాటు ఆరోగ్యానికి ఉపయోగంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: రాగి పాత్ర నీళ్లలో ఉన్న మిరాకిల్స్.. ఈ అద్భుత ప్రయోజనాలు మిస్ కాకండి..!!
( carrot | carrots | Health Tips | health tips in telugu | latest health tips | best-health-tips | Latest News )