Young Age: ఈ అలవాట్ల ఉంటే యవ్వనంలోనే చర్మంపై ముడతలు.. వయస్సు కాక మరో కారణాలు ఇవే

ముఖంపై ముడతలు, వృద్ధాప్య సంకేతాలను ముందుగానే రాకుంటా తగు జాగ్రత్తలు తీసుకోవచ్చు. నిద్రలేకున్న, ధూమపానం, మద్యం, అధిక ఒత్తిడి వంటి సమస్యలు ఉంటే యవ్వనంగా కనిపించలేరు. ఈ లక్షణాలు ఉంటే సకాలంలో అలవాట్లపై శ్రద్ధ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

New Update
Wrinkles on the skin at a young age

skin young age

అందంగా, యవ్వనంగా ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. నేటి కాలంలో చాలామంది చర్మంపై ఎక్కువ శ్రద్ద పెడ్డుతున్నారు. అయినా చర్మానికి సరైన సంరక్షణ ఇవ్వలేకపోతున్నారు. కొందరైతే చిన్న వయస్సులోనే  చర్మంపై ముడతలు వస్తూ ఉంటాయి. అద్దంలో మన ముఖం చూసుకున్నప్పుడు, నవ్వినప్పుడు.. ఫెస్‌లో కొంచెం మెరుపు కనిపిస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో చిరునవ్వుతోపాటు ముఖంపై గీతలు పెరుగుతున్నట్లు చెబుతున్నారు. ముఖంపై ముడతలు, వృద్ధాప్య సంకేతాలను ముందుగానే రాకుంటా తగు జాగ్రత్తలు తీసుకోవచ్చు. ముడతలు వయసుతోపాటు దినచర్య, తప్పుడు జీవనశైలి వల్ల యవ్వనం(youth)గా కనిపించలేరని నిపుణులు చెబుతున్నారు. చర్మాన్ని యవ్వనంలోనే వృద్ధాప్యం చేసే అలవాట్లు ఎలాంటి ఉన్నాయో కొన్ని విషయాలు ఈ  ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

నిద్ర:

  • నిద్ర అనేది అరోగ్యానికి మంచిది. ప్రతిరోజూ 8 గంటలు నిద్ర పోతే చర్మంపై మంచి ఫలితం కనిపిస్తుంది. అంత కంటే తక్కువ నిద్ర పోతే చర్మంపై ముడతలు ముందుగానే వస్తాయి. అంతేకాకుండా రాత్రి ఎక్కువ సమయం మొబైల్‌ ఫోడినా..? తగినంత నిద్ర లేకపోయినా.. కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గి చర్మం   స్థితిస్థాపకతపై ప్రభావం చూపుతుంది. 

సూర్యుని కఠినమైన కిరణాలు:

  • బయటకు వెళ్లేవారు UV కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే ఆ కిరణాలు చర్మం లోపలి పొరలను దెబ్బతీస్తాయి. దీనివల్ల కూడా తక్కువ వయస్సులో ముడతలు, పిగ్మెంటేషన్ అకాలంగా వస్తాయి. అందుకే ఎప్పుడు సన్‌స్క్రీన్ అప్లై చేయాలి. ఎండలో బయటకు వెళ్లే వారు చర్మానికి సన్‌స్ర్కీన్‌ వాడాలి.

    ఇది కూడా చదవండి: రాగి పాత్ర నీళ్లలో ఉన్న మిరాకిల్స్.. ఈ అద్భుత ప్రయోజనాలు మిస్‌ కాకండి..!!

    ధూమపానం- మద్యం:
  • ఈ మధ్యకాలంలో చిన్న వయస్సు వారు సిగరెట్లు, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటున్నారు. ఈ అలవాట్లు చర్మం సహజ తేమను తీసివేసి శరీరంలో ఫ్రీ రాడికల్స్‌ను పెంచుతాయి. దీనివల్ల చర్మం త్వరగా నిర్జీవంగా, వదులుగా మారటంతోపాటు సమయానికి ముందే ముడతలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఆహారం-నీరు:

  • ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఉద్యోగాలు చేస్తూ బిజీగా ఉంటున్నారు. వంట చేసే సమయం లేక ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఫుడ్, స్వీట్లు ఎక్కువ తింటూ ఉంటారు. వీటిని ఎక్కువగా తినడం వల్ల చర్మంలో మంట, ఆక్సీకరణ ఒత్తిడి పెరుగుతుంది. అతేకాకుండా శరీరానికి తగినంత నీరు అందకపోతే.. చర్మం పొడిబారి త్వరగా వృద్ధాప్యంగా కనిపిస్తుంది. 

అధిక ఒత్తిడి:

  • ఇప్పటి వారు చిన్న విషయాలకు ఆందోళన చెందుతూ ఒత్తిడికి గురవుతారు. ఈ రెండు సమస్యలు ఉండటం వల్ల ముఖంపై సరళ రేఖలు ఏర్పడతాయి. ఒత్తిడి కార్టిసాల్ అనే హార్మోన్ స్థాయిని పెంచి చర్మం వేగంగా వృద్ధాప్యానికి గురి చేస్తుంది. అందుకని ఏ పనిలోనైనా ఒత్తిడి, ఆందోళన లేకుండా చూసుకోవాలి.

సంరక్షణ కోసం..

  • ప్రతి ఒక్కరూ రోజూ 7-8 గంటలు నిద్రపోయే చూసుకోవాలి. బయటకు వెళ్ళే ముందు సన్‌స్క్రీన్ అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ధూమపానం, మద్యపానం మానుకుంటే చర్మానికి, ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. హైడ్రేటెడ్‌గా ఉంటూ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే ఇంటి మంచి ఫలితం ఉంటుంది. రోజూలో ధ్యానం, యోగా చేస్తే ఒత్తిడి(stress) తగ్గి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఈ ముఖంపై ముడతలు కేవలం వయస్సు వల్ల వచ్చేవని  అనుకోవద్దు.  యవ్వనంలో చర్మంపై గీతలు, ముడతలు కనిపిస్తుంటే సకాలంలో అలవాట్లపై శ్రద్ధ తీసుకోని తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: వర్షాకాలంలో క్యారెట్ జ్యూస్ తాగడానికి సరైన సమయం ఇదే..!!

young-age | Latest News)

Advertisment
తాజా కథనాలు