Coriander Leaves Water: కొత్తిమీర కాడల నీటితో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

కొత్తిమీర కాడల నీటిని ప్రతిరోజూ తాగడం వలన షుగర్ లెవెల్స్‌ను నియంత్రణలో ఉంటుంది. ఈ నీటి కోసం కొత్తిమీర కాడలు, కొద్దిగా మిరియాల పొడి కలిపి బాగా మరిగించాలి. తర్వాత వడకట్టి తాగితే రోగనిరోధకశక్తి పెరగటంతోపాటు గుండె ఆరోగ్యానికి, జీర్ణక్రియకు మేలు చేస్తుంది.

New Update
coriander leaves water

coriander leaves water

Coriander Leaves Water: వంటల్లో రుచి, వాసన పెంచే కొత్తిమీర కేవలం గార్నిషింగ్‌కు మాత్రమే కాదు.. ఆరోగ్యాన్ని పెంపొందించే ఔషధమైనది కూడా. ప్రతిరోజూ వంటల్లో కొత్తిమీర వాడకం సాధారణమే అయినా.. ఎక్కువమంది ఆకులను మాత్రమే ఉపయోగించి కాడలను పారేసేస్తుంటారు. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం.. కొత్తిమీర కాడల్లో పాస్ఫరస్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్స్ ఎ, బి, సి వంటి అనేక పోషకాలు అధికంగా ఉంటాయి. వీటిని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా శరీరానికి అనేక లాభాలు లభిస్తాయని చెబుతున్నారు.  కొత్తిమీర కాడలతో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.

Also Read :  వల్లభనేని వంశీకి బెయిల్!

షుగర్ లెవెల్స్‌ను నియంత్రణలో..

కొత్తిమీర కాడల నీటిని తయారు చేయడం చాలా సులభం. ఒక గిన్నెలో ఒక గ్లాసు నీరు పోసి మరిగించాలి. ఆ తర్వాత కట్ చేసిన కొత్తిమీర కాడలను అందులో వేసి కొద్దిగా మిరియాల పొడి కలిపి మరోసారి మరిగించాలి. ఈ నీటిని వడకట్టి తాగితే శరీరానికి మేలు జరుగుతుంది. ఈ నీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ నీరు తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా ఇది సహాయపడుతుంది. కొత్తిమీర కాడల నీటిని ప్రతిరోజూ తాగడం వలన షుగర్ లెవెల్స్‌ను నియంత్రణలో ఉంచుతుంది. షుగర్ రోగులు ఆకులతోపాటు కాడలతో కూడిన కొత్తిమీరను తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: డయాబెటిస్ ఉన్నవాళ్లు గ్లూకోజ్ పౌడర్ తాగవచ్చా?

మధుమేహ నియంత్రణతోపాటు నోటి ఆరోగ్యాన్ని కాపాడడంలోనూ ఇది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా నోటి పూత సమస్య ఉన్నవారికి ఇది సహాయకరంగా ఉంటుంది. ఇప్పట్లో జీర్ణ, గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు ఉన్నా కొత్తిమీర కాడల నీరు మంచి ఔషధంగా పనిచేస్తుంది. మలబద్ధకాన్ని తగ్గించడమే కాకుండా పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపి చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచుతుంది. ఎముకల బలానికి కూడా కొత్తిమీర కాడలు ఉపయోగపడుతాయి. ఈ నీటిలో కాల్షియం అధికంగా ఉండటం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. కొత్తిమీర కాడల నీటిని మరిగించి తాగే అలవాటు ఉంటే ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. ఇది ఒక సహజ ఔషధంలా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Also Read :  కేటీఆర్ కు పార్టీ పగ్గాలు.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: ఉదయాన్నే ఒక స్పూట్ పసుపు, తేనె తీసుకుంటే.. ఎన్ని లాభాలో తెలుసా?

( health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news )

Advertisment
Advertisment
తాజా కథనాలు