Nutmeg: నిద్రపోయే ముందు ఇది పాలల్లో కలిపి తాగితే కొలెస్ట్రాల్‌ మాయం

జాజికాయలో సహజంగా శరీరానికి ప్రశాంతత కలిగించే లక్షణం ఉంటుంది. ఇది నిద్రను ప్రోత్సహించడం, శరీర వ్యవస్థలను సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. జాజికాయను పాలలో కలిపి తాగితే ఇందులో ఉండే మిరిస్టిసిన్ అనే రసాయనం మెదడుకు ప్రశాంతత కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

New Update

Nutmeg: రాత్రిపూట పడుకునే ముందు జాజికాయ కలిపిన పాలు తాగడం ఎంతో మంచిది. నేటి సమాజంలో వేగవంతమైన జీవనశైలి, మానసిక ఒత్తిడి, ఆహారపు అలవాట్ల కారణంగా అధిక కొలెస్ట్రాల్, గుండె సంబంధిత సమస్యలు, జీర్ణ సంబంధిత ఇబ్బందులు పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి చిట్కాలు ఆరోగ్య పరిరక్షణకు ఎంతో ఉపయోగపడతాయి. జాజికాయ సహజంగా శరీరానికి ప్రశాంతత కలిగించే లక్షణం కలిగి ఉంటుంది. ఇది నిద్రను ప్రోత్సహించడం, శరీర వ్యవస్థలను సక్రమంగా పనిచేసేలా చేస్తుంది.

మానసిక ఒత్తిడిని తగ్గించి..

జాజికాయను పాలలో కలిపి తాగితే ఇందులో ఉండే మిరిస్టిసిన్ అనే రసాయనం మెదడుకు ప్రశాంతత కలిగిస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గించి, నిద్రను మెరుగుపరుస్తుంది. రాత్రి గోరు వెచ్చని పాలలో జాజికాయ కలిపితే ఆ ప్రభావం రెట్టింపవుతుంది. పాలలో ఉండే ట్రిప్టోఫాన్ అనే పదార్థం శరీరంలోని సెరోటోనిన్ స్థాయిని పెంచి మెదడు అలసటను దూరం చేస్తుంది. అదే సమయంలో జాజికాయలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరంలోని వాపులను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది శరీరాన్ని లోపలి నుండి శుభ్రపరచడంలో సహాయపడుతుంది. 

ఇది కూడా చదవండి: ఉదయం పరగడుపున వీటిని తింటే ఎంతో ఆరోగ్యం

ముఖ్యంగా జీర్ణ వ్యవస్థపై మంచి ప్రభావం చూపుతుంది. పాలతో జాజికాయ కలిపి తీసుకుంటే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది రక్తనాళాలను శుద్ధి చేసి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అలాగే రాత్రిపూట తీసుకునే ఈ మిశ్రమం శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దగ్గు, గొంతు నొప్పి, శ్వాస సంబంధిత ఇబ్బందులను తగ్గిస్తుంది. కఫం ఎక్కువగా ఉన్నప్పుడు జాజికాయ కలిపిన పాలను తాగడం వల్ల గొంతులో శ్లేష్మం కరిగిపోతుంది. పాలలో జాజికాయను కలిపి రాత్రిపూట తాగడం వల్ల శరీరానికి విశ్రాంతి లభించడం మాత్రమే కాకుండా రోజువారీ ఆరోగ్య సమస్యల నుండి రక్షణ కూడా లభిస్తుంది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: ఉదయాన్నే చెప్పులు లేకుండా నడిస్తే కలిగే ప్రయోజనాలు

( nutmeg-milk | nutmeg-water | nutmeg-powder | nutmeg-health-benefits | Nutmeg Benefits in Telugu health tips in telugu | latest health tips | best-health-tips | latest-news )

Advertisment
తాజా కథనాలు